బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

బారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌తో, వివిధ స్టార్టప్‌లు ఇప్పటికే ఈ విభాగంలో బలమైన ఉనికిని పొందుతున్నాయి. ఇటీవల ఓలా ఈ విభాగంలోకి రావడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ మరింత తీవ్రమైంది. దేశంలో నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలకు అనుగుణంగా నేడు ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యంత సరైన ప్రత్యామ్నాయ మార్గంగా మారాయి. ఈ విషయం గ్రహించిన వివిధ స్టార్టప్‌ కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాయి.

బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

తాజాగా, బెంగళూరుకు చెందిన రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ బౌన్స్ (Bounce) దేశంలో తమ ఈవీ కార్యకలాపాలను కిక్‌స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. బౌన్స్ త్వరలోనే దేశంలో తమ రైడ్ షేరింగ్ విభాగంలో స్వీయ-నిర్మిత ఈవీ స్కూటర్లను పరిచయం చేయనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి మరియు బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలను విస్తరించడానికి సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు 740 కోట్ల)కు పైగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

బౌన్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ వివేకానంద హల్లెకెరే ఈ ప్రకటన చేశారు. బౌన్స్ ఈ పెట్టుబడిని రాబోయే 12 నెలల్లో దశల వారీగా వెచ్చించనుందని, ఈ నెలాఖరులో తమ మొదటి ఇ-స్కూటర్‌ను ఆవిష్కరిస్తామని మరియు ఫిబ్రవరి 2022 నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కొత్త బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లను ఆన్‌లైన్‌తో పాటు దాదాపు 200 మంది డీలర్ల నెట్‌వర్క్ ద్వారా విక్రయించనున్నట్లు బౌన్స్ పేర్కొంది.

బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

బౌన్స్ దేశంలో తమ స్వీయ-నిర్మిత (సెల్ఫ్-మేడ్) ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టడానికి అవసరమైన అనుమతులను కూడా ప్రభుత్వం నుండి పొందింది. ఈ నేపథ్యంలో రెట్రో-ఫిట్ స్కూటర్లను పరీక్షించడానికి కంపెనీ తమ వినియోగదారులను మరియు అభిమానులను కూడా ఆహ్వానిస్తోంది. ఇవి త్వరలోనే బౌన్స్ యొక్క ప్రస్తుత ద్విచక్ర వాహనాలకు జోడించబడుతాయని భావిస్తున్నారు. నవంబర్ చివరి నాటికి బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించనున్నారు.

బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో కంపెనీ రెండు ఎంపికలను అందజేయనుంది. వీటిలో ఒకటి బ్యాటరీతో ఉంటుంది మరియు మరొకటి బ్యాటరీ లేకుండా ఉంటుంది మరియు ధర రెండింటికీ భిన్నంగా ఉంటుంది. బ్యాటరీతో కూడిన స్కూటర్ ధర సుమారు రూ. 70,000 లోపు ఉంటుందని మరియు బ్యాటరీ లేని దాని ధర సుమారు రూ. 50,000 కంటే తక్కువ ధరకే ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాటరీ లేని స్కూటర్ల కోసం కంపెనీ బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్ అందిస్తుంది.

బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

సింపుల్‌గా చెప్పాలంటే, బ్యాటరీతో కూడిన బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లు తమ ఇంటి వద్దనే చార్జ్ చేసుకోవచ్చు మరియు సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. అయితే, బ్యాటరీ లేని బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కంపెనీ దేశవ్యాప్తంగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను అందిస్తుంది. కస్టమర్లు ఈ బ్యాటరీలను అద్దె ప్రాతిపదిక తీసుకోవచ్చు. ఈ బ్యాటరీలను ఎప్పటికప్పుడు స్వాపింగ్ స్టేషన్ల వద్ద మార్చుకుంటూ, తమ ప్రయాణాన్ని సాగించవ్చచు.

బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

ఇందుకోసం కంపెనీ 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' అనే ప్రోగ్రామ్ ను ప్రారంభించనుంది. ఇందులో నగరం అంతటా మార్చుకోగలిగిన ఛార్జింగ్ స్టేషన్‌లను సెటప్ చేయడం బౌన్స్‌ ఈ సేవలను అందిస్తుంది. వినియోగదారు ఈ స్టేషన్‌లకు వెళ్లి వారి ఖాలీ బ్యాటరీలను అక్కడే మార్చుకొని, పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీని అమర్చుకొని ముందుకు సాగిపోవచ్చు.

బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

ఇలా చేయడం వలన బ్యాటరీపై కొనుగోలుదారులు చేసే ఖర్చును తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. దీని వలన ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు 40-50 శాతం వరకూ తగ్గే అవకాశం ఉంది. బ్యాటరీ స్వాపింగ్ విధానం ద్వారా కొనుగోలు చేసే స్కూటర్ల విషయంలో, బ్యాటరీపై పూర్తి హక్కులు కంపెనీకే చెందుతాయని గుర్తుంచుకోవాలి. బౌన్స్ రాబోయే 24 నెలల్లో 1-2 మిలియన్ స్కూటర్ల కోసం బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కంపెనీ కృషి చేస్తోంది.

బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

రాబోయే 12 నెలల్లో బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాల కోసం సుమారు 50-75 మిలియన్ల పెట్టుబడిని వెచ్చించనున్నారు. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి విషయానికొస్తే, కంపెనీ ఇప్పటికే రాజస్థాన్‌లోని భివండిలో ప్లాంట్ లో దీనిని తయారు చేయనుంది. ఈ ప్లాంట్ లో కంపెనీ ఏటా 1,80,000 యూనిట్ల ఎలక్ట్రి స్కూటర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. అయితే, ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచడం కోసం కంపెనీ ఇప్పుడు రెండవ లొకేషన్ కోసం కూడా వెతుకుతోంది.

బౌన్స్ (Bounce) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలకు రంగం సిద్ధం.. డెలివరీలు ఎప్పుడంటే..?

సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా మొత్తం పరిశ్రమ ప్రభావితమైనప్పటికీ, బౌన్స్ దానిని బాగా ప్లాన్ చేసిందని మరియు ఈ విభాగంలో కస్టమర్ల నుండి వచ్చే డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని హల్లెకెరే చెప్పారు. కంపెనీ తన ఇ-స్కూటర్ ను కేవలం భారత మార్కెట్లోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించాలని చూస్తోంది. టర్కీలో ఒక సంవత్సరం వ్యవధిలో సుమారు 30,000 స్కూటర్లను సరఫరా చేయడానికి బౌన్స్ ఇప్పటికే ఓ ఒప్పందంపై సంతకం కూడా చేసిందని, మార్చి చివరి నాటికి షిప్పింగ్ ప్రారంభమవుతుందని హల్లెకెరే చెప్పారు.

Most Read Articles

English summary
Bounce to launch its first electric scooter in november 2021 lets find all the details here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X