Just In
- 1 hr ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 2 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
- 17 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
Don't Miss
- News
జగన్‌పై రఘురామ బిగ్‌బాంబ్- మీ కేసులకూ వందరోజులే- పిచ్చోళ్లకు నో ఛాన్స్-పది క్యాన్సిల్
- Finance
Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లాంచ్ : ధర & వివరాలు
భారత మార్కెట్లో సిఎఫ్ మోటో 300 ఎన్‌కె బిఎస్ 6 ఎట్టకేలకు విడుదలైంది. ఈ కొత్త బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 2.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్). సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 యొక్క డిజైన్ దాదాపు బిఎస్ 4 మోడల్ నుండే తీసుకోబడింది. అయితే ఇంజిన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది.

సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 భారత మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన మొట్టమొదటి బిఎస్ 6 కంప్లైంట్ మోడల్. అయితే ఇది బిఎస్ 4 వెర్షన్‌తో సమానంగా ఉంది. దీని స్టైలింగ్ అదే విధంగా ఉంచబడింది. కానీ ఈ కొత్త మోడల్ కొన్ని అప్డేట్స్ కారణంగా క్రొత్త రూపాన్ని కలిగి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లో ఫుల్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, అడ్జస్టబుల్ రియర్ సెక్షన్, స్ప్లిట్ సీట్ సెటప్, అండర్ బెల్లి ఎగ్జాస్ట్, రియర్ ఫెండర్ పై నంబర్ ప్లేట్ మరియు 5 స్పోక్ అల్లాయ్ వీల్ వంటివి ఉన్నాయి.
MOST READ:తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్!

ఈ కొత్త బైక్ యొక్క కలర్ మరియు గ్రాఫిక్స్ పాత మోడల్ మాదిరిగానే ఉన్నాయి. ఇందులో అప్సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు సస్పెన్షన్ కోసం వెనుక మోనో షాక్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం, ఈ బైక్ రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ కూడా కలిగి ఉంది.

ఈ బైక్ లో ఉన్న ఇంజిన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణం అనుకూలంగా అప్డేట్ చేయబడింది. కానీ దీనికి సంబంధించిన సమాచారం అధికారికంగా ప్రకటించబడలేదు. అయితే దీని పవర్ మరియు టార్క్‌లో పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదని మేము భావిస్తున్నాము. కానీ ఈ బైక్ ప్రియులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.

దీని బిఎస్ 4 మోడల్‌లో 292.4 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ అమర్చారు, ఇది 33.5 బిహెచ్‌పి పవర్ మరియు 20.5 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందించింది. కానీ ఈ కొత్త బిఎస్ 6 ఇంజిన్ ఏ విధమైన గణాంకాలను అందిస్తుందనే విషయం త్వరలో కంపెనీ వెల్లడిస్తుంది.

సాధారణంగా 2020 ఏప్రిల్ నించి బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చాయి. అయితే సిఎఫ్ మోటో కొత్త ప్రమాణాలకు అనుగుణంగా దాని మోడళ్లను ఇంకా నవీకరించలేదు. కానీ కంపెనీ ఇప్పుడు తన మొదటి బిఎస్ 6 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇదే విధంగా తన ఇతర మోడళ్లను కూడా త్వరలో బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసి తీసుకురాగలదు.
MOST READ:స్కూల్ బస్సులు యెల్లో కలర్లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి