Just In
- 23 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 33 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 42 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- News
ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సిఎఫ్‌మోటో 300ఎన్‌కె బిఎస్6 బైక్ టీజర్; త్వరలోనే భారత్‌లో విడుదల
చైనాకి చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ బ్రాండ్ సిఎఫ్‌మోటో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఉత్పత్తులను ఇంకా బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయలేదు. ఈ నేపథ్యంలో, తాజా ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తమ మోటారుసైకిల్ లైనప్‌ను అప్‌డేట్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ మేరకు సరికొత్త బిఎస్6 సిఎఫ్‌మోటో 300ఎన్‌కె స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఇది భారత మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ విడుదల చేసిన ఈ టీజర్ ఇమేజ్‌లో కొత్త 2021 మోడల్ 300ఎన్‌కె బైక్‌లోని అగ్రెసివ్‌గా కనిపించే ఎల్ఈడి డిఆర్‌ఎల్‌లను చూడొచ్చు.

సిఎఫ్‌మోటో 300ఎన్‌కె మోటారుసైకిల్‌లో ఇదివరకటి బిఎస్4 ఇంజన్‌నే బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసి ఉపయోగించనున్నారు. ఇందులోని 292సిసి డిఓహెచ్‌సి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 28 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 25.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా.. ఇది చూడండి

కొత్త బిఎస్6 ఇంజన్ కూడా ఇదే విధమైన పవర్, టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ స్టాండర్డ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కొత్తగా వస్తున్న ఈ 2021 మోడల్‌లో ఇంజన్ అప్‌గ్రేడ్స్ మినహా పెద్దగా చెప్పుకోదగిన ఇతర మార్పులేవీ ఉండబోవని తెలుస్తోంది.

అయితే, ఇందులో మెరుగైన రైడింగ్ అనుభూతి కోసం అప్‌గ్రేడ్ చేయబడిన బిఎస్6 ఇంజన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో అప్-సైడ్-డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీ-లోడెడ్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.
MOST READ:ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్..ఎలా జరిగిందంటే ?

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ఇరు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉండి, డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తుంది. బిఎస్4 సిఫ్‌మోటో 300ఎన్‌కె మోటార్‌సైకిల్‌లో ఆఫర్ చేసిన రైడింగ్ మోడ్‌లను బిఎస్6 మోడల్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఈ రైడింగ్ మోడ్‌లను స్విచ్ క్యూబ్ మరియు టిఎఫ్‌టి డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చు.

కొత్త 2021 బిఎస్6 300ఎన్‌కె మోటార్‌సైకిల్ మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదలవుతున్న నేపథ్యంలో, త్వరలోనే ఈ కంపెనీ ఇదివరకు విక్రయించిన 600ఎన్‌కె స్ట్రీట్‌ఫైటర్, 650ఎమ్‌టి అడ్వెంచర్-టూరర్ మరియు 650 జిటి-టూరర్ మోడళ్లలో కూడా బిఎస్6 వెర్షన్లను ప్రవేశపెట్టవచ్చని ఆశిస్తున్నాము.
MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

చైనాకి చెందిన సిఎఫ్‌మోటో ఆటోమొబైల్ కంపెనీ మోటార్‌సైకిళ్ళు, ఏటివి (ఆల్-టెర్రైన్ వెహికల్స్)లు, యుటిలిటీ వాహనాలు, పవర్‌పోర్ట్ ఇంజన్లు మరియు విడిభాగాల తయారీలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్.

ఈ సంస్థను 1989 లో స్థాపించారు, ప్రస్తుతం ఈ బ్రాండ్ ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియా మరియు ఆఫ్రికా వంటి అనేక అంతర్జాతీయ మార్కెట్లలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.
MOST READ: భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

భారత మార్కెట్‌లో సిఎఫ్‌మోటో తమ మోటార్‌సైకిళ్లను అసెంబుల్ చేయటం కోసం బెంగళూరుకు చెందిన ప్రైవేట్ సంస్థ ఏఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిళ్ళతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.