ఓలా ఎస్1 vs బజాజ్ చేతక్ vs ఏథర్ 450ఎక్స్ vs టీవీఎస్ ఐక్యూబ్: కంపారిజన్

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రోలను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇవి ఈ విభాగంలో బజాజ్ చేతక్, ఏథర్ 450ఎక్స్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి. మరి ఈ మూడు మోడళ్లలోని ప్రధాన వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

ఓలా ఎస్1 vs బజాజ్ చేతక్ vs ఏథర్ 450ఎక్స్ vs టీవీఎస్ ఐక్యూబ్: కంపారిజన్

ధరలు

ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధరను రూ.99,999 (ఎస్1 మోడల్)గా నిర్ణయించింది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఎస్1 ప్రో ధర రూ.1,29,999 గా ఉంది. ఈ ధరలు గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ మరియు మహారాష్ట్ర మినహా ఇతర రాష్ట్రాలలో ఉంది, ఎందుకంటే ఈ రాష్ట్రాలలో అనుసరిస్తున్న ఈవీ పాలసీల కారణంగా వీటి ధరలు వేరుగా ఉన్నాయి.

ఓలా ఎస్1 vs బజాజ్ చేతక్ vs ఏథర్ 450ఎక్స్ vs టీవీఎస్ ఐక్యూబ్: కంపారిజన్

ఇకపోతే, ఈ విభాగంలో బజాజ్ ఆటో అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ స్కూటర్ యొక్క అర్బన్ వేరియంట్ ధర లక్ష రూపాయలగా ఉంటే, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.15 లక్షలుగా ఉంది. అదే సమయంలో, ఏథర్ 450ప్లస్ ధర రూ.1,13,416 మరియు ఏథర్ 450 ఎక్స్ ధర రూ.1,32,426 గా ఉంది. ఇకపోతే, టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1,10,506 గా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఓలా ఎస్1 vs బజాజ్ చేతక్ vs ఏథర్ 450ఎక్స్ vs టీవీఎస్ ఐక్యూబ్: కంపారిజన్

రేంజ్ మరియు పెర్ఫార్మెన్స్

ఓలా ఎస్1 గరిష్టంగా 121 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 90 కిమీ. ఈ వేరియంట్‌లో నార్మల్ మరియు స్పోర్ట్ అనే రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఓలా ఎస్1 ప్రో విషయానికి వస్తే, దీని రేంజ్ 181 కిమీ మరియు టాప్ స్పీడ్ గంటకు 115 కిమీగా ఉంటుంది. ఇందులో నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

ఓలా ఎస్1 vs బజాజ్ చేతక్ vs ఏథర్ 450ఎక్స్ vs టీవీఎస్ ఐక్యూబ్: కంపారిజన్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్‌లో గరిష్టంగా 95 కిమీ రేంజ్‌ను మరియు స్పోర్ట్ మోడ్‌లో 85 కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 70 కిమీగా ఉంటుంది. అలాగే, ఈ విభాగంలోని ఏథర్ 450ఎక్స్ ఎకో మోడ్‌లో 85 కిమీ రేంజ్ మరియు రైడ్ మోడ్‌లో 70 కిమీ రేంజ్‌ను అందిస్తుంది, అయితే దీని గరిష్ట వేగం గంటకు 80 కిమీగా ఉంటుంది. కాగా, టీవీఎస్ ఐక్యూబ్ ఎకో మోడ్‌లో 75 కిమీ రేంజ్‌ను అందిస్తుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 78 కి.మీగా ఉంటుంది.

ఓలా ఎస్1 vs బజాజ్ చేతక్ vs ఏథర్ 450ఎక్స్ vs టీవీఎస్ ఐక్యూబ్: కంపారిజన్

బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.98 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగే, ఓలా ఎస్1 ప్రోలో 3.97 kWh బ్యాటరీని ఉపయోగించారు. ఈ రెండు స్కూటర్లలో 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌లను ఫాస్ట్ ఛార్జర్‌తో 18 నిమిషాల్లో 75 కి.మీ రేంజ్‌కు సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చు. అదే 750W హోమ్ ఛార్జర్‌తో ఛార్జ్ అయితే, పూర్తిగా చార్జ్ చేయటానికి 7 గంటల సమయం పడుతుంది.

ఓలా ఎస్1 vs బజాజ్ చేతక్ vs ఏథర్ 450ఎక్స్ vs టీవీఎస్ ఐక్యూబ్: కంపారిజన్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.88 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు 2.89 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. హోమ్ చార్జర్ ద్వారా పూర్తిగా చార్జ్ 5 గంటల సమయం పడుతుంది. కాగా, ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఓలా ఎస్1 vs బజాజ్ చేతక్ vs ఏథర్ 450ఎక్స్ vs టీవీఎస్ ఐక్యూబ్: కంపారిజన్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 6 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది మరియు దీనిని 3 గంటల 35 నిమిషాల్లో 80 శాతం వరకూ ఛార్జ్ చేయవచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.25 kW ఎలక్ట్రిక్ మోటార్ మరియు 2.25 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఈ బ్యాటరీ హోమ్ ఛార్జర్ ద్వారా చార్జ్ చేయటానికి 5 గంటల సమయం పడుతుంది.

ఓలా ఎస్1 vs బజాజ్ చేతక్ vs ఏథర్ 450ఎక్స్ vs టీవీఎస్ ఐక్యూబ్: కంపారిజన్

ఈ మూడింటిలో ఏది బెస్ట్?

ఓలా ఎలక్ట్రిక్ తన రెండు అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేయడం ద్వారా బజాజ్, ఏథర్ మరియు టీవీఎస్ వంటి ప్రఖ్యాత కంపెనీలకు ఒక గట్టి సవాలును విసిరింది. బజాజ్ చేతక్, ఏథర్ 450ఎక్స్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లతో పోలిస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ధర, ఫీచర్లు, పవర్, రేంజ్ వంటి అనేక అంశాలలో మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు తప్పకుండా మార్కెట్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Comparison between ola s1 s1 pro bajaj chetak ather 450x and tvs iqube
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X