2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్, ఇదే

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాకర్ ర్యాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ డాకర్ ర్యాలీ గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే 2022 లో సౌదీ అరేబియాలో జరగనున్న డాకర్ ర్యాలీ 44 వ ఎడిషన్ యొక్క డేట్స్ ఇటీవల విడుదలైంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్, ఇదే

2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ యొక్క 44 వ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 14 వరకు జరగనుంది. ఈ ర్యాలీ నిర్వాహకులు రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. ఇంతకు ముందు జరుగుతున్న మాదిరిగానే వచ్చే ఏడాది 2022 ర్యాలీని సౌదీ అరేబియా ఎడారిలోనే నిర్వహిస్తున్నారు.

2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్, ఇదే

అయితే ఈసారి సౌదీ అరేబియా యొక్క పొరుగు దేశాలు ఈజిప్ట్ మరియు జోర్డాన్ కూడా ఉన్నాయి. ఈ డాకర్ ర్యాలీ రేసులో, 80 శాతం వరకు మార్గాలు కొత్తగా ఉంటాయి, తద్వారా ఇందులో రైడించే చేసేవారికి ఇది ఒక సాహసమనే చెప్పాలి. ఈ ర్యాలీ సౌదీ అరేబియాలో ప్రారంభమై జెడ్డాలో ముగుస్తుంది. ర్యాలీకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి జెడ్డాను ఎంపిక చేయడం జరిగింది.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్, ఇదే

డాకర్ ర్యాలీ చీఫ్ డేవిడ్ కాస్టెరా మొత్తం ఈ స్పెషల్ స్టేజి దూరం 4,000 కిలోమీటర్లు ఉంటుందని వెల్లడించారు. లిసాన్ దూరం 3,000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ఒకే తాత్కాలిక సైట్ చుట్టూ రెండు లూప్ స్టేజ్లు ఉంటాయి.

2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్, ఇదే

డాకర్ ర్యాలీ అంటేనే ప్రపంచంలో అత్యంత సాహసవంతమైన మరియు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రేస్ చాలా కష్టతరంగా ఉంటుంది. ఎన్నో అడ్డంకులు ప్రమాదకరమైన మలుపులు మరియు ఎత్తుపల్లాలు వంటి వాటిలో రేస్ జరుగుతుంది. ఈ కారణంగా చాలామంది రేసర్లు దీనిని పూర్తి చేయలేకపోతారు.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్, ఇదే

ఈ ర్యాలీలో పాల్గొనే రేసర్లు వారి శక్తికి మించి సాహసం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా వాహనాల పరిమితికి మించి డ్రైవ్ చేయవలసి వస్తుంది. ఈ రేస్ ఒక్కో సారి అత్యంత ప్రమాదకారిగా మారి అనుకోని ఆటంకాలను తెచ్చిపెడుతుంది. ఈ రేసులో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అందరికి బాగా తెలుసు.

2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్, ఇదే

డాకర్ ర్యాలీ నిబంధనల ప్రకారం, రేసు మొత్తం వ్యవధిలో రైడర్ ఒంటరిగా ఉంటాడు. అయితే, డాకర్ ఆర్గనైజేషన్ అవసరమైన అన్ని పరికరాలు మరియు యాక్ససరీస్ అందిస్తూ సహాయం చేస్తుంటారు. ఈ యాక్ససరీస్ విషయానికి వస్తే ఇందులో బైక్ కి సంబంధించిన యాక్ససరీస్ మరియు ఫుడ్ వంటివి ఉంటాయి.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్, ఇదే

ఇవి మాత్రమే కాకుండా డాకర్ ఆర్గనైజేషన్ ప్రతి పోటీదారునికి స్లీపింగ్ టెంట్, ట్రావెల్ బ్యాగ్ మరియు టైర్స్ యూనిట్ వంటి వాటిని కూడా అందిస్తుంది. రైడర్స్ తమ ట్రంక్‌లో ర్యాలీ చేయడానికి అన్ని విడి భాగాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులను తీసుకెళ్లాల్సి ఉంటుంది.

2022 లో జరగనున్న డాకర్ ర్యాలీ షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్, ఇదే

ఈ డాకర్ ర్యాలీలో రైడర్స్ తమ బైకుల నిర్వహణను స్వయంగా చేసుకోవాలసి ఉంటుంది. ఈ డాకర్ ర్యాలీని 1979 లో సౌదీ అరేబియాలో ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ర్యాలీగా పరిగణించబడుతుంది. కానీ ఇందులో దేశ విదేశాలలో ఉన్న పేరు మోసిన రైడర్స్ పాల్గొంటారు.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

Most Read Articles

English summary
Dakar Rally 2022 Route & Schedule Revealed. Read in Telugu.
Story first published: Thursday, May 13, 2021, 14:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X