కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు
ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ డిటెల్ స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. డిటెల్ కంపెనీ విడుదల చేసిన ఈ స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఈజీ ప్లస్. ఈజీ ప్లస్ అని పిలువబడే కొత్త స్కూటర్ రైడ్-షేరింగ్ మరియు డెలివరీ వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. డిటెల్ ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం 39,999 రూపాయలు మాత్రమే.

డిటెల్ కంపెనీ యొక్క ఈ ఈజీ ప్లస్ స్కూటర్ ఫ్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. దీనిని రూ. 1,999 టోకెన్ మొత్తానికి బ్రాండ్ వెబ్‌సైట్‌లో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. రైడ్ ఆసియా ఎక్స్‌పోలో ఈ-స్కూటర్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 20AH లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4 నుంచి 5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది ఒకే ఛార్జీతో దాదాపు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో 250 వాట్స్ హబ్-మౌంటెడ్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది ఈ స్కూటర్ ని గంటకు 25 కిలోమీటర్ల వేగంతో రైడ్ చేయడానికి అనుమతిస్తుంది.

ఈ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈజీ ప్లస్ స్కూటర్ చాలా తక్కువ బాడీ ప్యానెల్లను కలిగి ఉంది. ఇది రైడర్ మరియు పిలియన్ కోసం సింగిల్-పీస్ సీటును కలిగి ఉంది. ఇ-స్కూటర్‌లో రౌండ్ ఆకారంలో ఉండే హెడ్‌ల్యాంప్ మరియు అడ్డంగా ఉంచిన టైల్ లాంప్ మరియు రెండూ ఎల్‌ఇడి యూనిట్లు ఉంటాయి.

ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇది స్కూటర్ పరిధిని విస్తరించడంలో సహాయపడటానికి పెడల్ మెకానిజంతో వస్తుంది.

డిటెల్ స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మెటాలిక్ రెడ్, పెర్ల్ వైట్, గన్‌మెటల్, మెటాలిక్ బ్లాక్ మరియు మెటాలిక్ ఎల్లో వంటి వివిధ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ 170 కేజీల బరువును మోసే సామర్థ్యంతో వస్తుంది. ఈ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంది.

భారతదేశమంతా ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ అసిస్ట్ ప్యాకేజీతో అన్ని బైక్‌లు విక్రయించబడతాయి. ఇందులో ఏమైనా సలహాలు మరియు సహాయం కోసం కస్టమర్ కి టోల్ ఫ్రీ నంబర్ కూడా వినియోగంలో ఉంటుంది. ఈ వాహనం కొనుగోలుచేసి తర్వాత కంపెనీ సర్వీస్ కూడా అందించనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1 ఇయర్ స్టాండర్డ్ వారంటీని కూడా పొందుతుంది.

డిటెల్ ఈజీ ప్లస్ ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది స్కూటర్‌ను ఆపరేట్ చేయడానికి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ అతి తక్కువ ధర కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇది నగర ట్రాఫిక్ లో కూడా చాలా సులువుగా రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








