డ్యుకాటి నుండి రెండు సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లు విడుదల; వివరాలు

ఇటాలియన్ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ డ్యుకాటి, భారతదేశంలో విక్రయిస్తున్న తమ పాపులర్ స్క్రాంబ్లర్ సిరీస్‌లో రెండు సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్ మరియు స్క్రాంబ్లర్ డెసెర్ట్ స్లెడ్ పేరిట రెండు మోడళ్లను డ్యుకాటి మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ రెండు మోడళ్ల ధరలు ఇలా ఉన్నాయి:

డ్యుకాటి నుండి రెండు సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లు విడుదల; వివరాలు

డ్యుకాటి స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్ : రూ.9.80 లక్షలు

డ్యుకాటి స్క్రాంబ్లర్ డెసెర్ట్ స్లెడ్ : రూ.10.89 లక్షలు

(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

డ్యుకాటి ఈ రెండు మోడళ్లను నవంబర్ 2020లో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. కాగా, ఇవి ఇప్పుడు మన దేశంలో కూడా లభ్యం కానున్నాయి. డ్యుకాటి స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్ ఈ లైనప్‌లో పూర్తిగా కొత్త మోడల్ కాగా, డెసెర్ట్ స్లెడ్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది.

డ్యుకాటి నుండి రెండు సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లు విడుదల; వివరాలు

డ్యుకాటి స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్ పేరు సూచించినట్లుగానే మ్యాట్ గ్రే మరియు యాష్ కలర్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కెఫే రేసర్ స్టైల్‌ను పోలినట్లుగా ఉండే ఫ్లాట్ సీట్ ఉంటుంది. ఇది రైడర్ మరియు పిలియన్ రైడర్ ఇద్దరికీ సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేయబడింది.

MOST READ:నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

డ్యుకాటి నుండి రెండు సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లు విడుదల; వివరాలు

ఇందులోని ఇంజన్ పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీపడదని కంపెనీ తెలిపింది. ఇందులో ఐకానిక్ పిరెల్లి ఎమ్‌టి 60 టైర్లను స్పోక్ వీల్స్‌పై అమర్చారు. కేఫే రేసర్ స్టైల్ ఫ్లాట్ సీట్ మరియు విస్తృతమైన హ్యాండిల్‌బార్‌తో కూడిన ఈ కొత్త స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్ అసాధారణమైన పవర్ మరియు గొప్ప క్యారెక్టర్‌తో కూడిన మోటార్‌సైకిల్‌ను నడపాలని కోరుకునే నైట్ రైడర్‌లకు అనువైన ఎంపికగా ఉంటుంది.

డ్యుకాటి నుండి రెండు సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లు విడుదల; వివరాలు

డ్యుకాటి స్క్రాంబ్లర్ డెసెర్ట్ స్లెడ్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఈ కొత్త 2021 మోడల్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో గోల్డెన్ రిమ్స్ మరియు క్లాసిక్ బ్లాక్ ఫ్రేమ్‌తో పాటుగా ట్యాంక్ మరియు మడ్‌గార్డ్‌లపై రెడ్ అండ్ వైట్ డీటేలింగ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది సరికొత్త "స్పార్కింగ్ బ్లూ" లివరీ థీమ్‌తో 1980 కాలం నాటి ఎండ్యూరో బైక్‌లకు నివాళిగా డిజైన్ చేయబడినది.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

డ్యుకాటి నుండి రెండు సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లు విడుదల; వివరాలు

ఇందులో హై ఫ్రంట్ మడ్‌గార్డ్, ఎక్స్‌టెండెడ్ రియర్ ఫెండర్, హై ప్లేట్ హోల్డర్, వేరియబుల్ క్రాస్-సెక్షన్ హ్యాండిల్ బార్ మరియు సర్దుబాటు చేయగల కయాబా సస్పెన్షన్లు ఈ మోటార్‌సైకిల్‌కు మరింత ఉత్తమమైన ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని జోడిస్తాయి.

డ్యుకాటి నుండి రెండు సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లు విడుదల; వివరాలు

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో యూరో 5 (బిఎస్ 6) నిబంధనలకు సమానమైన 803సిసి, ఎల్-ట్విన్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 73 హెచ్‌పి పవర్‌ను మరియు 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 66.2 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది అధునాతన 6-స్పీడ్ స్లిప్పర్ అసిస్ట్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

డ్యుకాటి నుండి రెండు సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లు విడుదల; వివరాలు

సరికొత్త డ్యుకాటి స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్ మరియు స్క్రాంబ్లర్ డెసెర్ట్ స్లెడ్ మోటార్‌సైకిళ్ల కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా మరియు చెన్నై నగరాల్లోని అన్ని డ్యుకాటి డీలర్‌షిప్‌లలో ఈ బైక్‌లను బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే వీటి డెలివరీలు కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Ducati Launches 2021 Scrambler Nightshift And Desert Sled In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X