డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ వచ్చేసింది; ధర రూ. 18.99 లక్షలు

భారత మార్కెట్లో డుకాటీ తన మల్టీస్ట్రాడా వి4 బైక్ ని ఎట్టకేలకు విడుదల చేసింది. కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్‌ ధర రూ. 18.99 లక్షలు(ఎక్స్‌షోరూమ్). ముందు మరియు వెనుక భాగంలో రైడర్ అసిస్టెన్స్ రాడార్ సిస్టం ఉపయోగించిన ప్రపంచంలో మొట్టమొదటి మోటారుసైకిల్ ఈ డుకాటీ తన మల్టీస్ట్రాడా వి4. ఈ బైక్ యొక్క బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి. కొనుగోలు చేయదలచిన కస్టమర్లు రూ. 1 లక్ష టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ వచ్చేసింది; ధర రూ. 18.99 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వి4 స్టాండర్డ్, వి4 ఎస్ మరియు వి4 ఎస్ స్పోర్ట్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ బైక్‌ను ఇండియన్ మార్కెట్లో పరిమిత సంఖ్యలో విక్రయించనుంది. ఈ బైక్ యొక్క టెస్ట్ రైడ్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ వచ్చేసింది; ధర రూ. 18.99 లక్షలు

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 యొక్క ఇంజిన్ డుకాటీ యొక్క సూపర్ బైక్ పానిగలే వి4 నుండి తీసుకోబడింది. ఇది 1158 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 170 బిహెచ్‌పి పవర్ మరియు 125 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ క్విక్ షిఫ్టర్ టెక్నాలజీపై పనిచేసే స్లిప్పర్ క్లచ్‌ కలిగి ఉండి, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ వచ్చేసింది; ధర రూ. 18.99 లక్షలు

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా మరియు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ అడ్వెంచర్ బైక్ యొక్క ముందు భాగంలో ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ఇంజిన్ కంపార్ట్మెంట్ వంటివి భారీగా ఉంటాయి. ఇవి చూడటానికి పరిమాణం పరంగా కొంత పెద్దగా కనిపిస్తుంది. ఈ బైక్ బరువు 215 కేజీల వరకు ఉంటుంది.

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ వచ్చేసింది; ధర రూ. 18.99 లక్షలు

ఈ కొత్త బైక్‌లోని డ్యూయల్ పాడ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్లు ఇవ్వబడ్డాయి. ఏరోడైనమిక్స్ కోసం హెడ్ లైట్ క్రింద ఎయిర్ ఇన్టేక్ యాక్సెంట్స్ అందించబడతాయి. బైక్ యొక్క హెడ్ లైట్ పైన పెద్ద విండ్ స్క్రీన్ ఇవ్వబడింది. ఇవి కాకుండా, బైక్‌కు నెయిల్ గార్డ్, ఫ్రేమ్ ప్రొటెక్టర్, ఇంజిన్ ప్రొటెక్టర్ మరియు ఇంజిన్ కౌల్ కూడా లభిస్తాయి.

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ వచ్చేసింది; ధర రూ. 18.99 లక్షలు

ఈ బైక్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది, దీనితో జిపిఎస్ నావిగేషన్ మరియు ట్రాకింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. లగేజ్ స్టోరేజ్, బ్యాక్‌లైట్ స్విచ్ గేర్, స్ప్లిట్ సీట్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. బైక్ యొక్క హెడ్ లైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కావున చీకటిలో కూడా మంచి దృశ్యమానతను అందిస్తాయి.

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ వచ్చేసింది; ధర రూ. 18.99 లక్షలు

కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వి4 భారీ 22 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. ఇది ఆఫ్-రోడింగ్ సమయంలో వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్రంట్ మడ్గార్డ్ కార్బన్ ఫైబర్ తో తయారు చేయబడింది. ఈ బైక్‌లో కనిపించే అద్భుతమైన ఫీచర్ దాని రాడార్ టెక్నాలజీ, ఇది బైక్ ముందు మరియు వెనుక భాగంలో ఇన్‌స్టాల్ చేయబడింది. ఈ కొత్త బైక్ లో అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించబడింది.

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ వచ్చేసింది; ధర రూ. 18.99 లక్షలు

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో అప్సైడ్డౌన్ మరియు వెనుక భాగంలో మోనో షాక్ సెటప్ అందుబాటులో ఉంటుంది. కావున బైక్ యొక్క సస్పెన్షన్ చాలా ప్రతిస్పందిస్తుంది. ఈ కారణంగానే ఈ బైక్ ఎటువంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టం కూడా చాలా షార్ప్ గ ఉంటుంది.

Most Read Articles

English summary
Ducati Multistrada V4 Launched In India. Read in Telugu.
Story first published: Thursday, July 22, 2021, 14:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X