భారత్‌లో మరింత ఖరీదైన బైక్ విడుదల చేసిన Ducati: ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ అయిన డుకాటి (Ducati) భారతీయ విఫణిలో కొత్త సూపర్‌బైక్ 'డుకాటి పానిగాలే వి4 SP' (Ducati Panigale V4 SP) ని అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సూపర్ బైక్ ధర రూ. 36,07,000 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పుడు ఢిల్లీ - NCR, ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా & చెన్నైలోని అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో మరింత ఖరీదైన బైక్ విడుదల చేసిన Ducati: ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ డుకాటి పానిగాలే వి4 SP బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే ఎక్కువ రేస్ ట్యూన్డ్ మరియు పెర్ఫార్మెన్స్ బేస్డ్ స్పోర్ట్స్ బైక్. కంపెనీ ఈ కొత్త బైక్ లో దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ అందించింది. కావున ఇది మరింత పర్ఫామెన్స్ అందిస్తుంది. అదే సమయంలో ఇది వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

భారత్‌లో మరింత ఖరీదైన బైక్ విడుదల చేసిన Ducati: ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

ఈ కొత్త డుకాటి పానిగాలే బైక్ MotoGP మరియు SBK ఛాంపియన్‌షిప్‌ల ప్రీ-సీజన్ టెస్ట్‌లలో ఉపయోగించిన డుకాటి కోర్స్ బైక్ నుండి ప్రేరణ పొందిన కొత్త "వింటర్ టెస్ట్" లైవరీతో వస్తుంది. కావున ఇది దాని స్టాండర్డ్ Panigale V4S కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది.

డుకాటి పానిగాలే వి4 SP బైక్ మాట్ బ్లాక్ పెయింటెడ్ ఫెయిరింగ్‌లు, మార్చేసిని ఫోర్జ్డ్ మెగ్నీషియం వీల్స్, బ్రష్డ్ అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్‌పై రెడ్ రెడ్ యాక్సెంట్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్‌కు కార్బన్ ఫ్రంట్ మడ్‌గార్డ్‌లు మరియు బిల్లెట్ అల్యూమినియంలో అడ్జస్టబుల్ రైడర్ ఫుట్‌పెగ్‌లు లభిస్తాయి. అయితే వీటిని రైడర్ ఇష్టపడే స్థానం ప్రకారం సెట్ చేసుకోవచ్చు.

భారత్‌లో మరింత ఖరీదైన బైక్ విడుదల చేసిన Ducati: ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

కొత్త డుకాటి పానిగాలే వి4 SP బైక్ ఓపెన్ కార్బన్ క్లచ్ కవర్, లైసెన్స్ ప్లేట్ హోల్డర్, మిర్రర్ రిమూవల్ క్యాప్ మరియు డుకాటి డేటా ఎనలైజర్ + (DDA+) GPS మాడ్యూల్‌తో కూడిన టెలిమెట్రీ కిట్ వంటి అనేక ట్రాక్ డేస్ ఓరియెంటెడ్ యాక్సెసరీలను పొందుతుంది. ఇవి రైడర్ కి చాలా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

భారత్‌లో మరింత ఖరీదైన బైక్ విడుదల చేసిన Ducati: ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

Ducati Panigale V4 SP యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1,103 సిసి డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 13,000 ఆర్‌పిఎమ్ వద్ద 214 బిహెచ్‌పి పవర్ మరియు 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 12.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తానికి ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుందని చెప్పవచ్చు.

పానిగాలే V4 SP బైక్ 90° V4 బిల్లెట్ అల్యూమినియంతో తయారు చేయబడిన STM EVO-SBK డ్రై క్లచ్‌ని ఉపయోగిస్తుంది. ఇది దాని V4 S యొక్క వెట్ క్లచ్‌తో పోలిస్తే, డ్రై క్లచ్ మరింత ప్రభావవంతమైన యాంటీ-హాప్ ఫంక్షన్‌కు హామీ ఇస్తుంది, రేస్ట్రాక్‌లో బైక్‌ను అద్భుతమైన రీతిలో ఉపయోగించడానికి ఇది సహకరిస్తుంది.

భారత్‌లో మరింత ఖరీదైన బైక్ విడుదల చేసిన Ducati: ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

పానిగాలే V4 SP విడుదల సందర్భంగా, డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ, అత్యున్నత శ్రేణి పానిగాలే మోడల్ అయిన సరికొత్త పనిగేల్ V4 SP విడుదలతో భారతదేశంలో పానిగాలే కుటుంభం మరింత విస్తరించబడింది. ఈ కొత్త బైక్ చాలా వరకు ఆధునిక సాంకేతికతలను కలిగి ఉంటుంది. కావున దేశీయ మార్కెట్లోని డుకాటి ప్రేమికులకు తప్పకుండా నచ్చుతుంది, అని ఆయన అన్నారు.

భారత్‌లో మరింత ఖరీదైన బైక్ విడుదల చేసిన Ducati: ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా డుకాటి (Ducati) భారత మార్కెట్లో ఇటీవల సరికొత్త బిఎస్ 6 హైపర్‌మోటార్డ్ 950 (BS6 Ducati Hypermotard 950) మోటార్‌సైకిల్ రేంజ్ ను కంపెనీ విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త మోటార్‌సైకిళ్ల ప్రారంభ వేరియంట్ (950 ఆర్‌విఈ) ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ (950 ఎస్‌పి) ధర రూ. 16.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

భారత్‌లో మరింత ఖరీదైన బైక్ విడుదల చేసిన Ducati: ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

డుకాటి హైపర్‌మోటార్డ్ శ్రేణి యొక్క రెండు వేరియంట్‌లు కూడా అప్‌డేటెడ్ BS VI 937 సిసి Ducati Testastretta 11-డిగ్రీ V-ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 112.4 బిహెచ్‌పి శక్తిని మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో మరింత ఖరీదైన బైక్ విడుదల చేసిన Ducati: ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

ఈ ఇంజన్ ను కంపెనీ రీట్యూన్ చేసింది. ఫలితంగా, మరింత శక్తివంతగా మరియు తేలికైనదిగా మారింది. హైపర్‌మోటార్డ్ 950 లో, 80 శాతం టార్క్ ఇప్పటికే 3,000 ఆర్‌పిఎమ్ వద్ద అందుబాటులో ఉందని, 5,000 నుండి 9,000 ఆర్‌పిఎమ్ మధ్యలో 88 శాతం కంటే తక్కువ కాకుండా అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్స్ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Ducati panigale v4 sp launched in india price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X