లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

భారతీయ మార్కెట్లో రోజురోజుకి అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగిన ఎన్నో బైకులు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Ducati (డుకాటి) తన Multistrada V2 (మల్టీస్ట్రాడా వి2) అడ్వెంచర్-స్పోర్ట్ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ Ducati Multistrada V2 బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

కొత్త Ducati Multistrada V2 బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి స్టాండర్డ్ వేరియంట్ కాగా మరొకటి ఎస్ వేరియంట్. ఈ బైక్ భారతీయ మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ అడ్వెంచర్ బైక్ 2022 లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుందని ఆశిస్తున్నాము.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

Ducati Multistrada V2 అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. Ducati Multistrada V2 బైక్‌లో ఫ్లేర్డ్ ఎయిర్-ఇన్‌టేక్ మరియు స్ప్లిట్, ఫుల్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. దీనితో పాటు ఇది పెద్ద విండ్‌స్క్రీన్ మరియు ఫ్యూయెల్ ట్యాంక్ తో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇవన్నీ కూడా బైక్ ని చాలా దూకుడుగా చూపిస్తాయి.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

కొత్త Ducati Multistrada V2 ఇప్పుడు అప్‌డేట్‌ స్ట్రీట్ గ్రే అనే కొత్త కలర్ లో కూడా అందుబాటులో ఉంటుంది. స్ట్రీట్ గ్రే పెయింట్ స్కీమ్ కలిగిన బైక్ రెడ్ కలర్ రిమ్స్ పొందుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ బైక్ రెడ్ కలర్ మరియు మరో రెండు కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

Ducati Multistrada V2 బైక్ 937సిసి టెస్టాస్ట్రెట్టా 11-డిగ్రీ, ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 111.5 బిహెచ్‌పి పవర్‌ మరియు 98 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త Multistrada V2 బైక్ దాని Multi V2 950 బైక్ కంటే కూడా 5 కేజీలు తక్కువ బరువును పొందుతుంది. కావున ఇది రైడర్లకు మరింత అనుకూలంగా ఉంటుంది.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

కొత్త Multistrada V2 బైక్‌లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి స్పోర్ట్, టూరింగ్, అర్బన్ మరియు ఎండ్యూరో మోడ్‌లు. Multistrada ఎస్ వేరియంట్, డుకాటి స్కైహూక్ సస్పెన్షన్ EVO సెమీ యాక్టివ్ సస్పెన్షన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, డుకాటి కార్నింగ్ లైట్స్, డుకాటి క్విక్ షిఫ్ట్ అప్ అండ్ డౌన్, 5 ఇంచెస్ TFT డిస్‌ప్లే మరియు బ్యాక్‌లిట్ హ్యాండిల్‌బార్ కంట్రోల్ వంటి వాటిని స్టాండర్డ్ గా పొందుతుంది.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

Ducati కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో తన కొత్త Multistrada V4 బైక్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వి4 స్టాండర్డ్, వి4 ఎస్ మరియు వి4 ఎస్ స్పోర్ట్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ బైక్‌ను ఇండియన్ మార్కెట్లో పరిమిత సంఖ్యలో విక్రయించనుంది.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

ఈ కొత్త బైక్‌లోని డ్యూయల్ పాడ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్లు ఇవ్వబడ్డాయి. ఏరోడైనమిక్స్ కోసం హెడ్ లైట్ క్రింద ఎయిర్ ఇన్టేక్ యాక్సెంట్స్ అందించబడతాయి. బైక్ యొక్క హెడ్ లైట్ పైన పెద్ద విండ్ స్క్రీన్ ఇవ్వబడింది. ఇవి కాకుండా, బైక్‌కు నెయిల్ గార్డ్, ఫ్రేమ్ ప్రొటెక్టర్, ఇంజిన్ ప్రొటెక్టర్ మరియు ఇంజిన్ కౌల్ కూడా లభిస్తాయి.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

ఈ బైక్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది, దీనితో జిపిఎస్ నావిగేషన్ మరియు ట్రాకింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. లగేజ్ స్టోరేజ్, బ్యాక్‌లైట్ స్విచ్ గేర్, స్ప్లిట్ సీట్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. బైక్ యొక్క హెడ్ లైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కావున చీకటిలో కూడా మంచి దృశ్యమానతను అందిస్తాయి.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

డుకాటీ మల్టీస్ట్రాడా వి4 యొక్క ఇంజిన్ డుకాటీ యొక్క సూపర్ బైక్ పానిగలే వి4 నుండి తీసుకోబడింది. ఇది 1158 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 170 బిహెచ్‌పి పవర్ మరియు 125 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ క్విక్ షిఫ్టర్ టెక్నాలజీపై పనిచేసే స్లిప్పర్ క్లచ్‌ కలిగి ఉండి, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త Ducati Multistrada V2 బైక్; భారత్‌కు రానుందా..!!

కొత్త Ducati Multistrada V2 బైక్ (డుకాటి మల్టీస్ట్రాడా వి2) ఈ ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం లేదు. కానీ వచ్చే ఏడాదికి భారతీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Ducati revealed new multistrada v2 features engine details
Story first published: Monday, October 4, 2021, 10:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X