డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

ఇటాలియన్ సూపర్‌బైక్ బ్రాండ్ డ్యుకాటి, ఈ ఏడాది మొత్తం 12 కొత్త మోటార్‌సైకిళ్లను భారతదేశంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో కొన్ని లో-బడ్జెట్ మోటార్‌సైకిళ్లు ఉండగా, మరికొన్ని ప్రీమియం హై-ఎండ్ లగ్జరీ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. వీటన్నింటినీ 2021లోనే విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

ఈ జాబితాలో ముందుగా బిఎస్6 డ్యుకాటి స్క్రాంబ్లర్ మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల కానుంది. గడచిన 2020వ సంవత్సరంలో భారతదేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి సృష్టంచిన అవాంతరాల కారణంగా, కంపెనీ కేవలం 3 కొత్త బిఎస్6 మోడళ్లను మాత్రమే మార్కెట్లో విడుదల చేసింది.

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

వీటిలో పానిగల్ వి2, స్క్రాంబ్లర్ 1100 ప్రో మరియు మల్టీస్ట్రాడా 950 ఎస్ మోడళ్లను తాజా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బిఎస్6 స్క్రాంబ్లర్, డయావెల్ మరియు కొత్త ఎక్స్‌డయావెల్ మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. ఇవన్నీ జనవరి-మార్చ్ 2021 కాలంలో విడుదల కానున్నాయి.

MOST READ:ఉద్యోగులకు మర్చిపోలేని కానుక ఇచ్చిన పయనీర్ ఆసియా గ్రూప్!

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

వీటి అనంతరం డ్యుకాటి తన వి4 ఇంజన్‌తో కూడిన శక్తివంతమైన మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో స్పోర్ట్ టూరర్ మల్టీస్ట్రాడా వి4 ఉంటుంది, ఇది ఈ శ్రేణిలోనే అగ్రస్థానంలో ఉంటుంది. ఇంకా నెక్డ్ స్పోర్ట్ సిరీస్‌లో అత్యంత పాపులర్ అయిన స్ట్రీట్ ఫైటర్ వి4 మరియు కొత్త 2021 పానిగల వి4 మోడళ్లు విడుదల కానున్నాయి.

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

అంతేకాకుండా, స్క్రాంబ్లర్ బ్రాండ్ నుండి కొత్త స్క్రాంబ్లర్ 1100 డార్క్ ప్రో కూడా బిఎస్6 రూపంలో విడుదల కానుంది. ఇంకా డ్యుకాటి సూపర్ స్పోర్ట్ 950 మరియు హైపర్‌మోటార్డ్ 950 ఆర్‌విఈ మోడళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది చివరి లోపుగా ఈ 12 కొత్త మోటార్‌సైకిళ్లు భారత రోడ్లపై సందడి చేయనున్నాయి.

MOST READ:గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

గత 2020లో నీరసించిన అమ్మకాలను చూసిన డ్యుకాటి 2021 సంవత్సరాన్ని సరికొత్త జోష్‌తో ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కాగా, భారత మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉన్న బిఎస్6 స్క్రాంబ్లర్ ఐకాన్ మరియు స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ మోటార్‌సైకిళ్ల కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

ఈ కొత్త డ్యుకాటి మోటార్‌సైకిళ్లను అధీకృత డీలర్‌షిప్‌లలో రూ.50,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి ఈ బ్రాండ్ "డుకాటీ కన్సర్న్ ప్లాన్" అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టింది. కాబట్టి, కస్టమర్లు తమ డ్యుకాటి బైక్‌ను ఎటువంటి భయం లేకుండా కొనుగోలు చేయవచ్చు.

MOST READ:అద్భుతంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టీజర్.. ఓ లుక్కేయండి

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

డ్యుకాటి బ్రాండ్‌కు సంబంధించి ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా తమ కొత్త 2021 మోడల్ ఇయర్ పానిగల్ వి4 ఎస్‌పి మోటార్‌సైకిల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లలో విడుదల చేసింది. కొత్త 2021 డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి డిజైన్, ఫీచర్స్ మరియు ఎలక్ట్రానిక్స్ పరంగా అనేక అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉంది. ఇది భారత్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

డ్యుకాటి 851 ద్వారా మొట్టమొదట సారిగా కంపెనీ ప్రవేశపెట్టిన స్పోర్ట్ ప్రొడక్షన్ (ఎస్‌పి) పేరును కంపెనీ తిరిగి పానిగల్ వి4 ద్వారా తీసుకువచ్చింది. ఇందులో "వింటర్ టెస్ట్" లివరీ ఉంటుంది, ఇది మోటోజిపి మరియు ఎస్‌బికె ఛాంపియన్‌షిప్‌ల ప్రీ-సీజన్ పరీక్షలలో ఉపయోగించే డ్యుకాటి కోర్స్ బైక్‌ల నుండి ప్రేరణ పొంది తయారు చేయబడినవి.

MOST READ:ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

ఈ మోటార్‌సైకిల్‌లో కార్బన్-ఫైబర్ వింగ్లెట్లు కూడా అమర్చబడి ఉంటాయి, ఇవి మెరుగైన ఏరోడైనమిక్స్‌ను అందిస్తాయి. ఇందులోని 1103 సిసి లిక్విడ్-కూల్డ్ వి4 డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ గరిష్టంగా 213 బిహెచ్‌పి పవర్‌ను మరియు 124 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డ్యుకాటి ప్రియులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది 12 కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్!

ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో పాటు (డిక్యూఎస్) డ్యుకాటి క్విక్ షిఫ్ట్ ఇవో 2 బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ టెక్నాలజీతో జతచేయబడుతుంది. వి4 ఎస్‌పి రేసింగ్ పరిస్థితులకు అనుగుణంగా డ్రై క్లచ్‌ను కూడా కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Ducati India Plans To Launch 12 New Motorcycles In 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X