ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన eBikeGo త్వరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ పేరు eBikeGo Rugged. ఇది భారతీయ మార్కెట్లో 2021 ఆగష్టు 25 న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

eBikeGo కంపెనీ విడుదల చేయనున్న కొత్త Rugged ఒక బలమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఫీచర్లు మరియు ఆధునిక పరికరాలతో అందించబడుతుంది. ఈ స్కూటర్ గురించి అధికారిక సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు, కానీ లాంచ్ సమయంలో కంపెనీ ఈ స్కూటర్ యొక్క అన్ని వివరాలను వెల్లడిస్తుంది.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

ముంబైకి చెందిన eBikeGo తన డెలివరీ సర్వీస్ 2017 లో ప్రారంభించింది. కంపెనీ మొదట్లో భారతీయ తయారీదారుల నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడం ప్రారంభించింది. అయితే, తక్కువ బలం కారణంగా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు డెలివరీ సర్వీస్ కి అంత బాగా ఉపయోగపడని కంపెనీ గుర్తించింది.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

డెలివరీ సర్వీస్ కి అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా దృడంగా ఉండాలి. కావున కంపెనీ దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు డెలివరీ ఫ్లీట్ కోసం బలమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉండే బైకులను డిజైన్ చేసి అటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయాలనుకుంటున్నామని కంపెనీ చెబుతోంది.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందించడానికి మరియు ఉత్పత్తి చేయడానికి మేము Boom Motors తో భాగస్వామ్యం కలిగి ఉన్నాము. ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో ఆవిష్కరణల సరిహద్దులను అధిగమించే ఒక బలమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మేము త్వరలో భారతీయ వినియోగదారుల కోసం పరిచయం చేయనున్నారు.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) ఆమోదించింది. డెలివరీ భాగస్వామి మరియు వ్యాపార భాగస్వాముల నుండి వచ్చిన సూచనల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపొందించబడినట్లు కంపెనీ తెలిపింది.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

eBikeGo ప్రకారం, Rugged E-Bike పూర్తిగా భారతదేశంలో రూపొందించబడింది. అంతే కాదు ఇది 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. అంతర్గత డిజైన్ మరియు తయారీ సహాయంతో, Rugged ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా స్వీకరించడం మరియు తయారీ సబ్సిడీ (FAME II) కి అర్హత పొందుతాయి. ఇవి మంచి ఆకర్షణీయమైన ధరతో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

eBikeGo కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలపై పని చేయడమే కాకుండా, దేశీయ స్టార్టప్ eBikeGo బ్యాటరీ రీసైక్లింగ్ టెక్నాలజీపై కూడా పనిచేస్తోంది. ఈ-వ్యర్థాలను తగ్గించడానికి డెలివరీ స్టార్టప్ కంపెనీ eBikeGo బ్యాటరీ రీసైక్లింగ్‌ను ప్రారంభించింది.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

ఎలక్ట్రిక్ వాహనాల కోసం కంపెనీ పాత లిథియం-అయాన్ బ్యాటరీలను రీసైక్లింగ్ చేస్తోంది. అంతే కాకుండా త్వరలో లీడ్ యాసిడ్ బ్యాటరీలను కూడా రీసైక్లింగ్ చేయడం ప్రారంభిస్తుంది. కంపెనీ ప్రకారం, లిథియం-అయాన్ బ్యాటరీల నుండి 99% కంటే ఎక్కువ లిథియంను రీసైక్లింగ్ కోసం సేకరించవచ్చు. కొత్త బ్యాటరీల తయారీకి ఈ లిథియం ఉపయోగపడుతుంది. అదనంగా, రీసైకిల్ చేసిన బ్యాటరీలను సోలార్ ప్లాంట్లలో కూడా ఉపయోగించవచ్చు.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged ఎలక్ట్రిక్ స్కూటర్‌: వివరాలు

రీసైక్లింగ్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల విలువను తగ్గిస్తుంది. ఏదైనా ఎలక్ట్రిక్ వాహనం యొక్క మొత్తం ఖర్చులో 50 శాతం బ్యాటరీలు ఉంటాయి. భారతదేశంలో లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తి తక్కువగా ఉన్నందున, వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది మరియు ఇది ఎలక్ట్రిక్ వాహనాల ధరను పెంచుతుంది. కావున కంపెనీ ఈ బ్యాటరీలను తయారుచేస్తే ఎలక్ట్రిక్ సైకిల్స్ ధరలు తగ్గువగా ఉంటాయి.

ఆగష్టు 25 న దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త eBikeGo Rugged Bike: వివరాలు

భారతీయ మార్కెట్లో రోజురోజకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఎలెక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న కస్టమర్ల సంఖ్య చాలా పెరుగుతోంది. దీనికి తోడు పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఎక్కువమంది వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేసేలా చేస్తున్నాయి.

Most Read Articles

English summary
Ebikego to launch rugged electric moto scooter details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X