మూడు చక్రాలుంటాయి.. కాని ఆటో కాదు: కొత్త వెహికల్ ఉత్పత్తికి సిద్దమవుతున్న eBikeGo

భారతీయ మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ అయిన eBikeGo కంపెనీ, ప్రముఖ స్పానిష్ ఆటోమేకర్ యొక్క స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రైక్ 'వెలోసిపెడో' (Velocipedo) తయారీ హక్కులను పొందగలిగింది. eBikeGo ఏర్పరచుకున్న ఈ భాగస్వామ్యం తర్వాత, eBikeGo భారతదేశంలో 'వెలోసిపెడో' మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే అవకాశం ఉంటుంది. eBikeGo Velocipedo యొక్క మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉత్పత్తికి సిద్దమవుతున్న eBikeGo: పూర్తి వివరాలు

eBikeGo మొబిలిటీ భారతదేశంలోనే త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తయారు చేయడం ద్వారా లగ్జరీ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. వెలోసిపెడో ఎలక్ట్రిక్ ట్రైక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇవి ఇతర ద్విచక్ర వాహనాల కంటే చాలా సురక్షితంగా ఉంటాయి.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉత్పత్తికి సిద్దమవుతున్న eBikeGo: పూర్తి వివరాలు

వెలోసిపెడో ట్రైక్ యొక్క అద్భుతమైన డిజైన్ మరియు ప్రాక్టికాలిటీకి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన 'రెడ్‌డాట్ డిజైన్ అవార్డ్'ని కూడా కైవసం చేసుకుంది. వెలోసిపెడో అనేది స్పానిష్ ఆటోమొబైల్ కంపెనీ టొరోట్ చేత తయారు చేయబడిన మూడు చక్రాల స్మార్ట్ ట్రైసైకిల్. ఇది చూడటానికి చాలా సింపుల్ గా మరియు ఆకర్షనీయంగా ఉండి, ఇతర ద్విచక్ర వాహనాలకంటే కూడా చాలా సురక్షితంగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉత్పత్తికి సిద్దమవుతున్న eBikeGo: పూర్తి వివరాలు

ఈ ట్రైసైకిల్ కి ముందు భాగంలో రెండు చక్రాలు మరియు వెనుక ఒక చక్రం ఉంటాయి. కావున సురక్షితంగా ఉంటుంది, అయితే ఈ కొత్త ట్రై సైకిల్ లో విశేషమేమిటంటే, ఈ ఎలక్ట్రిక్ ట్రైక్ బాడీ మొత్తం కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడింది. కావున ఇది ప్రయాణీకులను ఎండ నుండి సురక్షితంగా ఉంచుతుంది. అంతే కాకూండా ఇది డబుల్-సీటర్ త్రీవీలర్, కావున ఇందులో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉత్పత్తికి సిద్దమవుతున్న eBikeGo: పూర్తి వివరాలు

కంపెనీ ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ ని పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపయోగించేలా ప్రత్యేకంగా రూపొందించింది. కావున ఇది రోజువారీ ప్రయాణానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వాహనాన్ని సాధారణ బైక్ లేదా స్కూటర్ కంటే సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

ఈ కొత్త వెహికల్ యొక్క డిజైన్ వల్ల సిటీ ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపగలిగేలా మరియు పార్కింగ్ స్థలంలో చాలా తక్కువ స్థలాన్ని తీసుకునేలా ఉంటుంది. వెలోసిపెడో ఎలక్ట్రిక్ ట్రైక్ అనేది అధునాతన సాంకేతికతకు ఒక ఉదాహరణ. ఇది మోటర్‌బైక్ వంటి పనితీరును అందిస్తూనే కారు సౌకర్యం మరియు భద్రతను అందించేలా రూపొందించబడింది.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉత్పత్తికి సిద్దమవుతున్న eBikeGo: పూర్తి వివరాలు

ఈ వాహనానికి ముందు భాగంలో రెండు చక్రాలు ఉండటం వల్ల రోడ్డుపై ఉండే సాధారణ స్కూటర్ కంటే ఇది మరింత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఈ మూడు చక్రాల స్కూటర్ ఎటువంటి రోడ్డులో అయిన నడపడానికి అనుకూలంగా ఉంటుంది. కావున దేనిని వాహన వినియోగదారులు చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు.

నివేదికల ప్రకారం, వెలోసిపెడో ఎలక్ట్రిక్ ట్రైవెహికల్ మూడు మోడళ్లలో అందించబడుతుంది. ఇందులో ఇండ్యూజ్యువల్ వెహికల్, క్యాబ్ మరియు కార్గో వెహికల్ వంటివి ఉన్నాయి. అయితే ఈ కొత్త మరియు ప్రత్యేకమైన వాహనాన్ని eBikeGo వచ్చే ఏడాది ప్రారంభంలో పూణేలో తయారు చేసే అవకాశం ఉంటుంది. ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బేస్ మోడల్‌లో ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారు మరియు రెండు సీట్ బెల్ట్‌లు మరియు ఫుల్ క్యాబ్‌తో వస్తాయి.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉత్పత్తికి సిద్దమవుతున్న eBikeGo: పూర్తి వివరాలు

ఈ వెహికల్ లో ప్రయాణించడానికి హెల్మెట్ కూడా అవసరం లేదు. అంతే కాకుండా ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు గరిష్టంగా 95 కిమీ వరకు ఉంటుంది. వెలోసిపెడో 180 కిలోల బరువును కలిగి ఉంటుంది మరియు పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఒకటిన్నర గంటలు పడుతుంది.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉత్పత్తికి సిద్దమవుతున్న eBikeGo: పూర్తి వివరాలు

ఇందులో కంపెనీ రీజెనరేటివ్ బ్రేక్ టెక్నాలజీని ఉపయోగించడం, వల్ల ఈ స్కూటర్ నడుస్తున్నప్పుడు కూడా ఛార్జ్ చేసుకోగలదు. అయితే ఈ బైక్ యొక్క వాణిజ్య వినియోగ కార్గో మోడల్ 150 కిలోల బరువు ఉంటుంది, ఇది దాదాపు 70 కిలోల కార్గోను మోయగలదు. మొత్తానికి ఈ బైక్ చూడచక్కగా ఉండటమే కాకుండా, వినియోగదారుల అవసరాలకు అనువుగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉత్పత్తికి సిద్దమవుతున్న eBikeGo: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా కొత్త కొత్త వాహనాలు భారత మార్కెట్లో అడుగుపెడుతున్నాయి. అయితే ఈ సమయంలో ఇలాంటి కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లోకి అడుగుపెడితే, ఊహించని రెస్పాన్స్ వస్తుందని మేము భావిస్తున్నాము. కానీ ఈ కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ భారత మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆదరణ పొందుతాయో కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Ebikego to start manufacturing velocipedo electric trike in india soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X