ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతున్న సమయంలో చాలా కంపెనీలు దేశీయ విఫణిలో ఆధునిక ఫీచర్స్ కలిగిన అధునాతన వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే 'Eeve India' కూడా దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

భారతీయ మార్కెట్లో కంపెనీ EeVe Soul Electric Scooter విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ ఆధునిక కాలంలో ఉపయోగించే స్కూటర్లలో ఉండే దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఐఓటి ఫంక్షన్, యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టమ్, జిపిఎస్ నావిగేషన్, USB పోర్ట్, కీలెస్ అనుభవం, రివర్స్ మోడ్, సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్, జియో-ట్యాగింగ్ మరియు జియో-ఫెన్సింగ్ వంటివి ఉన్నాయి. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

EeVe Soul Electric Scooter యొక్క సీటు కింద రెండు లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌లు అమర్చబడి ఉన్నాయి. ఇవి ఈ స్కూటర్ కి దాదాపు 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 40 కిమీ ఉన్నప్పుడు ఎకో మోడ్ లో ఇది 120 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే మిగిలిన రెండు మోడ్స్ లో పరిధి తక్కువగా ఉంటుంది. ఇది వినియోగదారులు గమనించాలి.

ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ లోని బ్యాటరీలను వేరు చేసి మార్చుకోవచ్చు, కావున దీనిని వినియోగారులు చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ మూడేళ్ళ వారంటీతో వస్తుంది.

ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

కంపెనీ రీసెర్చ్, డెవలప్‌మెంట్, డిజైన్, ప్రొడక్షన్, స్ట్రాటజిక్ సహకారం, సప్లయ్ చైన్ మరియు స్కూటర్ల పార్టనర్‌షిప్‌లో దాదాపు రూ. 80 కోట్ల పెట్టుబడి పెట్టింది. అంతే కాకుండా కంపెనీ భారతదేశంలో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. కంపెనీ 2027 నాటికి 2 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కావున కంపెనీ తన పరిధిని రోజురోజుకి తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. దీని వల్ల కంపెనీ ఎక్కువ ఎలక్ట్రిక్ అహనాలను విక్రయించే అవకాశం ఉంటుంది.

ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

Eeve India తూర్పు భారతదేశంలో ఉన్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం ఒడిశాలో ఉంది. Eeve India దేశవ్యాప్తంగా 63 డీలర్ నెట్‌వర్క్‌లను నిర్వహిస్తోంది. అయితే ఈ సంవత్సరం 200 కొత్త ప్రదేశాలలో ఉనికిని సృష్టించాలని కూడా యోచిస్తోంది.

ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

Eeve India అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో స్కూటర్లను తయారు చేయడమే కాకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది. Eeve India స్కూటర్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ మరియు స్మార్ట్ బ్యాటరీ నిర్వహణ వంటి కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. కావున రానున్న కాలంలో ఈ కంపెనీ యొక్క వాహనాలను మంచి ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది.

ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి. వాహన వినియోగదారులు కూడా లేటెస్ట్ స్కూటర్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున కంపెనీలు కూడా వారి అభిరుచికి తగిన విధంగా వాహనాలను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో EeVe Soul Electric Scooter విడుదలైంది. దీనికి దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. కొత్త EeVe Soul Electric Scooter భారతీయ మార్కెట్లో Ather 450X, Ola S1, Simple One వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు క్రమంగా పెరుగుతున్నాయి, దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. అంతే కాకుండా మారుతున్న ప్రపంచంలో ఇనియోగదారుడు కూడా మారుతున్నాడు, కావున లేటెస్ట్ వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నాడు.

ఒక్క చార్జితో 120 కి.మీ రేంజ్ అందించే EeVe Soul ఎలక్ట్రిక్ స్కూటర్: ధర కూడా తక్కువే

ఇది మాత్రమే కాకుండా దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమదైన శైలిలో కస్టమర్లను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపైనా చాలావరకు డిస్కౌంట్లు మరియు రాయితీలను అందిస్తున్నారు. మొత్తానికి రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది, అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Eeve soul high speed electric scooter launched price range features details
Story first published: Thursday, December 16, 2021, 19:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X