ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు మరియు కార్లతో పాటు దేశంలో స్వచ్ఛమైన శక్తితో నడిచే వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రోత్సాహకాలు అందిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఈ వాహనాల జాబితా ఎలక్ట్రిక్ సైకిళ్లు విస్మరించబడ్డాయి. ఎలక్ట్రిక్ సైకిళ్లపై ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందించడం లేదు.

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

ఇది ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమను కాస్తంత ఆందోళన కలిగించే అంశమే. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భారత ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ పరిశ్రమ చిక్కుల్లో పడే అవకాశం ఉందని హీరో సైకిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజాల్ అభిప్రాయ పడ్డారు. ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమను ప్రభుత్వ తయారీ లేదా ఎగుమతి ప్రోత్సాహక విధానానికి దూరంగా ఉంచారని, దీని కారణంగా పరిశ్రమ నష్టాలను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు.

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమపై వివక్ష

ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానమే దీనికి కారణమని పంకజ్ ముంజల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఫేమ్-2 విధానం మరియు ఇటీవల ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకాలలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమను చేర్చలేదు లేదా ఎలక్ట్రిక్ సైకిల్స్ తయారు చేసే కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలను ప్రకటించలేదని ఆయన చెప్పారు.

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

అనేక దేశాల నుండి కఠినమైన సవాలు ఉంది

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ విధానం కారణంగా, రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశం సుమారు రూ. 10,000 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ సైకిల్ ఎగుమతి అవకాశాలను కోల్పోవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం, భారతీయ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీదారులు అనేక దేశాల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్ల యొక్క ఇ-సైకిల్ వ్యాపారాన్ని క్యాష్ చేసుకునేందుకు చైనా చాలా అగ్రెసివ్ ప్రణాళికతో ఉంది.

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

ఈ విధానాల కారణంగా, భారతదేశం నుండి యూరోపియన్ యూనియన్‌కు ఎగుమతి చేయాల్సిన సైకిల్ సరఫరా అవకాశాలను చైనా మరియు ఫార్ ఈస్ట్‌ దేశాల వలన కోల్పోతున్నామని ఆయన అన్నారు. సైకిల్ పరిశ్రమపై ప్రస్తుతం 14 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని, అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా సున్నాకి తగ్గించాలని పంకజ్ ముంజాల్ అన్నారు.

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

హీరో సైకిల్స్ నుండి రూ. 1000 కోట్ల పెట్టుబడి

హీరో సైకిల్స్ గత మూడేళ్ల క్రితం ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీని ప్రారంభించింది మరియు మేక్-ఇన్-ఇండియా చొరవలో భాగంగా, కంపెనీ ఇ-సైకిల్స్ తయారీకి కొత్త ఫ్యాక్టరీలో 300 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను వెచ్చించింది. అంతేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్ ను బలోపేతం చేయడం కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌ లో ఎక్స్‌పోర్ట్ హబ్‌ ను ఏర్పాటు చేయడానికి రూ. 400 కోట్లు మరియు వెండర్ బేస్ ను నిర్మించడానికి మరో రూ. 300 కోట్లు పెట్టుబడి కూడా వెచ్చించింది.

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

దిగుమతి సుంకం తగ్గించాలని డిమాండ్

యూరోపియన్ యూనియన్ లో ఇ-సైకిల్ డేటాను పంచుకున్న పంకజ్ ముంజాల్, అక్కడి మార్కెట్లో ఇ-సైకిల్ వ్యాపారం సంవత్సరానికి 5 బిలియన్ యూరోలుగా ఉంటుదని, ఇది భారతదేశంలో జరిగే వ్యాపారం కంటే 50 రెట్లు ఎక్కువ అని చెప్పారు. కాబట్టి, ఈ అవకాశాలను మనం దక్కించుకోవాలంటే, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

యూరోప్‌ లో ఇ-సైకిల్ మార్కెట్ వచ్చే 10 సంవత్సరాలలో 5 రెట్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద సైకిల్ తయారీదారుగా భారతదేశం ఉంది. ఇ-సైకిళ్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించినట్లయితే, భారతదేశం నుండి యూరప్‌ కు ఎగుమతి చేసే ఎలక్ట్రిక్ సైకిళ్ల సంఖ్యను కూడా పెంచవచ్చు.

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

తగ్గిన హీలో ఎలక్ట్రిక్ టూవీలర్ల ధరలు..

ఇదిలా ఉంటే, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేమ్-2 (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) ప్రాజెక్టులో భాగంగా, ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలలో ఇటీవల సవరణలు చేసిన సంగతి తెలిసినదే. దీంతో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు దిగొస్తున్నాయి.

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

ఈ నేపథ్యంలో, భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ అయిన హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 15,600 వరకూ తగ్గాయి. కస్టమర్ ఎంచుకునే మోడల్‌ను బట్టి ఈ తగ్గింపు వేర్వేరుగా ఉంటుంది. తాజా ధరల తగ్గింపు అనంతరం హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న పాపులర్ స్కూటర్ ఆప్టిమా హెచ్‌ఎక్స్ డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ. 15,680 తగ్గి, రూ. 58,990 గా ఉంది. అలాగే, సింగిల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ. 8,040 తగ్గి, రూ. 53,600 గా ఉంది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

ప్రమాదంలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమ, ప్రభుత్వమే కారణమన్న టాప్ సైకిల్ కంపెనీ!

హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ అన్‌లైన్‌లో బుకింగ్‌లను స్వీకరిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు బ్రాండ్ వెబ్‌సైట్‌లో రూ.2,999 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ అన్ని విధాలుగా ఉత్తమంగా ఉంటుంది. ఇది బ్రాండ్ నుండి లభిస్తున్న హై-స్పీడ్ మోడళ్లలో భాగంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది సింగిల్ బ్యాటరీ మరియు రెండవది డబుల్ బ్యాటరీలతో లభిస్తుంది.

Most Read Articles

English summary
Electric bicycle business in india is at risk says pankaj munjal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X