ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేమ్ (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) II ప్రాజెక్టులో భాగంగా, ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలలో ఇటీవల సవరణలు చేసిన సంగతి తెలిసినదే.

ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

ఈ నేపథ్యంలో, దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు దిగొస్తున్నాయి. తాజాగా, భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ15,600 వరకూ తగ్గాయి. కస్టమర్ ఎంచుకునే మోడల్‌ను బట్టి ఈ తగ్గింపు వేర్వేరుగా ఉంటుంది.

Model FAME II Subsidy Revised Price Old Price
Optima HX (Dual Battery) ₹58,980 ₹74,660
Optima HX (Single Battery) ₹53,600 ₹61,640
ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

తాజా ధరల తగ్గింపు అనంతరం హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న పాపులర్ స్కూటర్ ఆప్టిమా హెచ్‌ఎక్స్ డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.15,680 తగ్గి, రూ.58,990 గా ఉంది. అలాగే, సింగిల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.8,040 తగ్గి, రూ.53,600 గా ఉంది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ అన్‌లైన్‌లో బుకింగ్‌లను స్వీకరిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు బ్రాండ్ వెబ్‌సైట్‌లో రూ.2,999 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ అన్ని విధాలుగా ఉత్తమంగా ఉంటుంది.

ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

హార ఆప్టిమా హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్ నుండి లభిస్తున్న హై-స్పీడ్ మోడళ్లలో భాగంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది సింగిల్ బ్యాటరీ మరియు రెండవది డబుల్ బ్యాటరీలతో లభిస్తుంది.

ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

ఫేమ్ II డిస్కౌంట్‌లో అత్యధికంగా డబుల్ బ్యాటరీ వేరియంట్‌పై లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లలో బ్యాటరీ ప్యాక్‌లో మార్పు మినహా మిగిలిన అన్ని ఫీచర్లు ఒకేలా ఉంటాయి. ఈ స్కూటర్‌లో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, యాంటీ-థెఫ్ట్ రిమోట్ లాక్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ మరియు పోర్టబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఇందులో 550 వాట్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 51.2 వి / 30 ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇందులోని సింగిల్ బ్యాటరీ వేరియంట్ 82 కిలోమీటర్ల రేంజ్‌ను మరియు డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ 122 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను ఇస్తాయి.

ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

ఈ స్కూటర‌లోని బ్యాటరీ ప్యాక్ పోర్టబుల్‌గా ఉంటుంది మరియు క్విక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులోని ప్రతి బ్యాటరీని 5 గంటల్లో 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లుగా ఉంటుంది. హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడింగ్ రేంజ్‌ను పెంచేందుకు ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది.

ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సస్పెన్షన్ సెటప్‌ను గమనిస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్ షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇరు వైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఈ స్కూటర్‌లో ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి.

ఫేమ్ 2 ప్రోత్సాహకాల సవరణ: రూ.15,600 తగ్గిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు

ఫేమ్ II పథకం క్రింద ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఇటీవల భారత ప్రభుత్వం సవరించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్‌లో ప్రోత్సాహకాలను కిలోవాట్‌కు రూ.10,000 నుండి రూ.15,000 పెంచింది. ఈ ప్రోత్సాహకాలు 50 శాతం పెరగడంతో, తయారీదారులు కూడా తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గిస్తున్నాయి.

Most Read Articles

English summary
FAME II Subsidy Revision; Hero Electric Scooter Prices Dropped By Up To Rs 15,000. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X