బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

మరికొద్ది రోజుల్లో 2021వ సంవత్సరం ముగిసిపోనుంది. ఈ ఏడాది ఎవ్వరూ ఊహించని రీతిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గిరాకీ పెరిగింది. ఈ సమయంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కూడా పుట్టుకొచ్చాయి. దేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగుతుండటంతో, కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ టూవీలర్ల వైపుకు మారారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను భారీగా పెంచడంలో సహకరించాయి.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ప్రస్తుతం, మనదేశంలో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మోడళ్లు మాత్రమే బెస్ట్-ఇన్ క్లాస్ ఫీచర్లను మరియు సుదీర్ఘమైన రేంజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో అతిపెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏథర్ మరియు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఓలా స్కూటర్లకు ఏమాత్రం తీసిపోమంటున్నాయి. మరి మన మార్కెట్లో లభించే టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

బజాజ్ చేతక్ ఈవీ (Bajaj Chetak EV)

జనవరి 2020 లో భారత మార్కెట్లోకి వచ్చిన బజాజ్ ఆటో మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ఈవీ. కంపెనీ తమ ఐకానిక్ స్కూటర్ చేతక్ పేరును ఉపయోగించి, మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్ మరియు ఎలక్ట్రిఫికేషన్ తో దీనిని ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 kWh సామర్థ్యం కలిగిన IP67 రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 4kW పవర్‌ను మరియు 16 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో రెండు విభిన్న రైడింగ్ మోడ్‌లు (స్పోర్ట్ మరియు ఎకో) ఉంటాయి.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్‌లో గరిష్టంగా 95 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ను మరియు స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా 85 రేంజ్ ను ఆఫర్ చేస్తుంది కంపెనీ పేర్కొంది. ఇతర స్మార్ట్ స్కూటర్ల మాదిరిగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లేటెస్ట్ కెనెక్టింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులోని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది మరియు క్విక్ ఛార్జింగ్ సహాయంతో, కేవలం 1 గంటలో 25 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఈ స్కూటర్ ధరలు రూ.1.42 లక్షల నుండి రూ.1.44 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఏథర్ 450ఎక్స్ (Ather 450X)

బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ అందిస్తున్న 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా షార్ప్ డిజైన్ తో మంచి స్టైలిష్ లుక్ ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో కంపెనీ 2.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ స్కూటర్ లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 3.3 kW పవర్‌ను మరియు 26 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో, గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 6.5 సెకన్ల సమయం పడుతుంది.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ స్పోర్ట్ మోడ్‌లో 60 కిమీలు, రైడ్ మోడ్‌లో 70 కిమీలు మరియు ఎకో మోడ్‌లో 85 కిమీలుగా ఉంటుంది. ఈ స్కూటర్ యొక్క పూర్తి ఛార్జ్‌పై 116 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీని బ్యాటరీ 3 గంటల 35 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్ల రేంజ్‌కు సరిపడా చార్జ్ చేసుకోవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారు రూ.1.32 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో (Ola S1 & S1 Pro)

ఈ ఏడాది ఆగస్ట్ 15న ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో వీటి ధరలు రూ.1 లక్ష నుండి రూ.1.20 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ స్కూటర్లలో 3.9 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8.5 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పూర్తి చార్జ్‌పై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 181 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లుగా ఉంటుంది.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఈ స్కూటర్ లోని బ్యాటరీలను 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, ఈ బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఉంటుంది. దీని సాయంతో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కూటర్‌కు రిమోట్‌గా కనెక్ట్ అయి కాల్స్, మెసేజెస్, మ్యూజిక్ వంటి అనేక ఫంక్షన్లు కంట్రోల్ చేయవచ్చు. ఇంకా ఇందులో నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ అనే రైడ్ మోడ్స్ కూడా ఉంటాయి.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)

చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ కంపెనీ టీవీఎస్ అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్. మార్కెట్లో దీని ధర సుమారు రూ.1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో 4.4 kW సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ మరియు 2.25kWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటాయి. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 75 కిమీ దూరం వరకు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది కేవలం 4.2 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 5 గంటలు పడుతుంది. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌లో కంపెనీ స్మార్ట్‌కనెక్ట్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇందులో అధునాతన టిఎఫ్‌టి క్లస్టర్ మరియు కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ స్కూటర్‌ను మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని, వివిధ రకాల ఫీచర్లు యాక్సెస్ చేయవచ్చు. వీటిలో జియో ఫెన్సింగ్, రిమోట్ లాంకిగ్, బ్యాటరీ ఛార్జింగ్ స్థితి, నావిగేషన్ అసిస్ట్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, ఇన్‌కమింగ్ కాల్/మెసేజ్ మొదలైనవి ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్‌తో కంపెనీ 3 సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీని ఆఫర్ చేస్తుంది.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

సింపుల్ వన్ (Simple One)

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా సింపుల్ ఎనర్జీ ఆగస్ట్ 15వ తేదీన తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను విడుదల చేసింది. ఇది లాంగ్ రేంజ్ బ్యాటరీ, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ మరియు స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ జాబితాలోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ మరియు ఫీచర్ల పరంగా మొదటి స్థానంలో ఉంటుంది. ఈ స్కూటర్‌లో 4.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది మరియు ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 4.5 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది.

బజాజ్ చేతక్ ఈవీ నుండి ఓలా ఎస్1 వరకూ.. భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇందులో జియో ఫెన్సింగ్, ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్‌లు, రూట్ సేవ్ ఫీచర్, రైడింగ్ స్టాటిక్స్ మరియు రిమోట్ లాకింగ్ సిస్టమ్ మొదలైన స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. గొప్ప విషయం ఏంటంటే, ఇందులో రిమూవబల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది మరియు దానిని విడిగా తీసి చార్జ్ చేసుకోవచ్చు. పైన పేర్కొన్న నాలుగు స్కూటర్లలో ఈ సదుపాయం లేదు. అపార్ట్‌మెంట్ లలో నివసించే వారికి ఇదొక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
From bajaj chetak to ola s1 top 5 best electric scooters in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X