పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా అంటున్న తెలంగాణ వ్యక్తి

మన దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయలు దాటేశాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య మానవుడిపై పెనుభారాన్ని మోపుతాయి. దీని వల్ల ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించే సంకేతాలు ఏ మాత్రం కనిపించడం లేదు.

పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా, అంటున్న తెలంగాణ వ్యక్తి

ఇంధన ధరల పెరుగుదల కారణంగా చాలామంది వాహనదారులు వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ఆసక్తి కనపరుస్తున్నారు. మరికొంత మంది అయితే తమ వాహనాలను కొన్ని మార్పులతో ఏకంగా ఎలక్ట్రిక్ వాహనాలను మాడిఫై చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటన మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా, అంటున్న తెలంగాణ వ్యక్తి

నివేదికల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ ప్రాంతనికి చెందిన 'విద్యాసాగర్' తన పాత బజాజ్ మోటార్‌సైకిల్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా మార్చాడు. పెరుగుతున్న పెట్రోల్ ధరల సమస్య నుండి తనను తాను రక్షించుకోవడానికి యితడు ఈ విధమైన అద్భుతాన్ని సృష్టించాడు.

పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా, అంటున్న తెలంగాణ వ్యక్తి

పాత బజాజ్ మోటార్‌ సైకిల్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌గా మార్చే ప్రయత్నంలో అతను పెట్రోల్ ఇంజిన్‌ను తొలగించి బ్యాటరీలు, కన్వర్టర్ మరియు మోటారును అమర్చాడు. 42 సంవత్సరాల వయసున్న విద్యాసాగర్ సాదారణంగా ఒక టీవీ మెకానిక్. కానీ అతను పెట్రోల్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.

పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా, అంటున్న తెలంగాణ వ్యక్తి

విద్యాసాగర్ ఈ బైక్ తయారీ కోసం 10 వేలు ఖర్చు పెట్టి నాలుగు 30 ah 12-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేసాడు. అంతే కాకుండా అతడు దీనికోసం 48 వి మోటారుతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ కన్వర్షన్ కిట్‌ మరియు మరో రూ .7,500 ఖర్చు చేసి కన్వర్టర్‌ను కూడా కొనుగోలు చేశాడు.

పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా, అంటున్న తెలంగాణ వ్యక్తి

ఎలక్ట్రిక్ బైక్ తయారీ కోసం అన్నింటిని కొనుగోలు చేసిన తరువాత ఆ బైక్ యొక్క పెట్రోల్ ఇంజిన్‌ తొలగించి, దాని స్థానంలో బ్యాటరీలు మరియు మోటారును ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ బైక్ రూపొందించాడు. ప్రస్తుతం ఈ బైక్‌ను కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం 0.2 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని అతడు తెలిపాడు.

పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా, అంటున్న తెలంగాణ వ్యక్తి

ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి విద్యాసాగర్ మాట్లాడుతూ, ఈ బైక్ తయారీకి మొత్తం తనకు 20,000 రూపాయలు ఖర్చు అయిందని చెప్పాడు. అయితే ఈ బైక్ వాళ్ళ ఇప్పుడు పెట్రోల్ నింపుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి నెలా 3,000 రూపాయలు ఆదా చేస్తున్నట్లు కూడా చెప్పాడు. కానీ ఈ బైక్ యొక్క బ్యాటరీని ప్రతిరోజూ సుమారు 5 గంటలు పాటు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా, అంటున్న తెలంగాణ వ్యక్తి

ఈ బైక్ లో అమర్చిన బ్యాటరీకి వీలైనంతవరకు రాత్రిలో ఛార్జింగ్ వేసుకోవచ్చు కావున, ఇది మరీ అసాధ్యమైన పని మాత్రం కాదు. అంతే కాకుండా విద్యాసాగర్ బైక్ నడుస్తున్నప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయ్యే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పాడు.

పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా, అంటున్న తెలంగాణ వ్యక్తి

విద్యాసాగర్ చెప్పినట్లు ఇది కూడా జరిగితే,బైక్ ఛార్జ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం వుండదు. పెట్రోల్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చిన విద్యాసాగర్ కి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విధానం చాలా బాగుండటంతో చాలామంది వాహనదారులు ఇలాంటి బైక్ తయారుచేసుకోవాలి ఆలోచిస్తున్నారు.

Most Read Articles

English summary
Telangana Man Converts His 15 Year Old Motorcycle Into Electric Bike. Read in Telugu.
Story first published: Wednesday, July 14, 2021, 9:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X