భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, వివరాలు

క్రూయిజ్ మరియు లీజర్ మోటార్‌సైకిళ్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికన్ ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్, తయారు చేసిన మొట్టమొదటి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'పాన్ అమెరికా'ను కంపెనీ భారత మార్కెట్లో కూడా విడుదల చేసింది.

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, వివరాలు

గడచిన మార్చి 2021లో హ్యార్లీ డేవిడ్‌సన్ తమ పాన్ అమెరికా అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను థాయ్‌ల్యాండ్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసినదే. కాగా, ఇప్పుడు ఇది భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది.

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, వివరాలు

భారత మార్కెట్లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.16.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన పాన్ అమెరికా 1250 స్పెషల్ ధర రూ.19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

MOST READ:సన్నీ లియోన్ కేరళ కార్ డ్రైవింగ్‌లో ఎదురైన చేదు అనుభవం.. కారణం ఇదే

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, వివరాలు

ఇప్పటి వరకూ మనం చూసిన హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే ఈ సరికొత్త హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ మోటార్‌సైకిల్ డిజైన్ చాలా భిన్నంగా మరియు విశిష్టంగా ఉంటుంది. హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికాను లైట్ వెయిట్ అల్లాయ్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌తో పాటు వన్-పీస్ కాస్ట్ అల్యూమినియం స్వింగార్మ్‌తో నిర్మించారు.

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లో పూర్తి-ఎల్‌ఈడి లైటింగ్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని, ఏబిఎస్, డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్‌ను నియంత్రించడానికి డేటాను అందించే ఐఎమ్‌యూ మరియు రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ ప్లస్ అనే ఐదు రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ప్రతి రైడింగ్ మోడ్ కూడా ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌లతో వస్తుంది.

MOST REDA:కోవిడ్-19 పేషెంట్ల కోసం రైలునే ఆస్పత్రిగా మార్చారు: ఆక్సిజన్ కూడా ఉంది!

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, వివరాలు

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా బైక్‌లో బ్లూటూత్ టెక్నాలజీ కలిగిన 6.8-ఇంచ్ కలర్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్ప్‌ప్లే యూనిట్ ఉంటుంది. దీని సాయంతో రైడర్ రిమోట్‌గా తన బైక్‌కు కనెక్ట్ అయి వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరియు నావిగేషన్‌తో పాటుగా అనేక రకాల ఫంక్షన్లను కంట్రోల్ చేయవచ్చు.

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, వివరాలు

టాప్-ఎండ్ వేరియంట్ అయిన పాన్ అమెరికా 1250 స్పెషల్‌లో సెమీ యాక్టివ్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్‌తో పాటు వెహికల్ లోడ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టాండర్డ్ సెంటర్ స్టాండ్, సర్దుబాటు చేయగల వెనుక బ్రేక్ పెడల్, అల్యూమినియం స్కిడ్-ప్లేట్, హీటెడ్ హ్యాండ్ గ్రిప్స్, స్టీరింగ్ డంపర్, అడాప్టివ్ రైడ్ హైట్ మరియు ట్యూబ్‌లెస్ స్పోక్డ్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

MOST READ:కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, వివరాలు

ఈ బైక్ ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, ముందు వైపు 320 మిమీ ట్విన్ డిస్కులు మరియు వెనుక వైపు 280 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇందులో ముందు వైపు 19 ఇంచ్ అల్లాయ్ వీల్‌ను మరియు వెనుక వైపు 17 ఇంచ్ అల్లాయ్ వీల్‌ను ఉపయోగించారు. వీటిపై మిష్లిన్ స్కార్చర్ అడ్వెంచర్ రేడియల్ టైర్లను అమర్చారు.

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, వివరాలు

హార్లే-డేవిడ్సన్ తయారు చేసిన ఈ మొట్టమొదటి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన 1,252 సిసి రివల్యూషన్ మాక్స్ వి-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 127 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

MOST READ:కరోనా కాటుకు బలైపోయిన మహిళను బైక్‌పై తరలించిన హృదయ విషాద గాథ.. ఎక్కడంటే?

Most Read Articles

English summary
Harley-Davidson Launched The All New Pan America 1250 ADV Bike In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X