భారత్‌కు రానున్న హర్లే డేవిడ్సన్ 'పాన్ అమెరికా' అడ్వెంచర్ మోటార్‌సైకిల్

అమెరికన్ ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హార్లే-డేవిడ్సన్ క్రూయిజర్ మరియు లీజర్ మోటార్‌సైకిళ్లలో తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన టూవీలర్ తయారీ సంస్థ. అలాంటి హార్లే-డేవిడ్సన్ ఇప్పుడు తొలిసారిగా అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది.

భారత్‌కు రానున్న హర్లే డేవిడ్సన్ 'పాన్ అమెరికా' అడ్వెంచర్ మోటార్‌సైకిల్

హార్లే-డేవిడ్సన్ తయారు చేసిన ఈ ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌కు 'పాన్ అమెరికా' అనే పేరును పెట్టారు. ఈ మోటార్‌సైకిల్ ఇప్పటికే థాయ్‌లాండ్ వంటి ఆసియా మార్కెట్లలో విడుదలైంది. థాయిలాండ్‌లో, హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా యొక్క రెండు వేరియంట్‌లను కంపెనీ విడుదల చేసింది.

భారత్‌కు రానున్న హర్లే డేవిడ్సన్ 'పాన్ అమెరికా' అడ్వెంచర్ మోటార్‌సైకిల్

బేస్ పాన్ అమెరికా మరియు పాన్ అమెరికా స్పెషల్ అనే రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. థాయ్ మార్కెట్లో హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా ధరలు 899,000 భాట్‌ల నుండి 972,000 భాట్‌ల మధ్యలో ఉన్నాయి. అంటే, మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.20.95 లక్షల నుండి రూ.22.65 లక్షలుగా ఉంటుంది.

MOST READ:ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

హార్లే-డేవిడ్సన్ తయారు చేసిన ఈ మొట్టమొదటి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన 1,252 సిసి రివల్యూషన్ మాక్స్ వి-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 127 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.

భారత్‌కు రానున్న హర్లే డేవిడ్సన్ 'పాన్ అమెరికా' అడ్వెంచర్ మోటార్‌సైకిల్

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా బైక్‌లో బ్లూటూత్ టెక్నాలజీ కలిగిన 6.8-ఇంచ్ కలర్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్ప్‌ప్లే యూనిట్ ఉంటుంది. దీని సాయంతో రైడర్ రిమోట్‌గా తన బైక్‌కు కనెక్ట్ అయి వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరియు నావిగేషన్‌తో పాటుగా అనేక రకాల ఫంక్షన్లను కంట్రోల్ చేయవచ్చు.

MOST READ:ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

భారత్‌కు రానున్న హర్లే డేవిడ్సన్ 'పాన్ అమెరికా' అడ్వెంచర్ మోటార్‌సైకిల్

ఇంకా ఇందులో పూర్తి-ఎల్‌ఈడి లైటింగ్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని, ఏబిఎస్, డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్‌ను నియంత్రించడానికి డేటాను అందించే ఐఎమ్‌యూ మరియు రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ ప్లస్ అనే ఐదు రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ప్రతి రైడింగ్ మోడ్ కూడా ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌లతో వస్తుంది.

భారత్‌కు రానున్న హర్లే డేవిడ్సన్ 'పాన్ అమెరికా' అడ్వెంచర్ మోటార్‌సైకిల్

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికాను లైట్ వెయిట్ అల్లాయ్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌తో పాటు వన్-పీస్ కాస్ట్ అల్యూమినియం స్వింగార్మ్‌తో నిర్మించారు. దీని ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

MOST READ:కాలువలో చిక్కుకున్న నౌక; వణికిపోతున్న ప్రపంచ దేశాలు; ధరలు పెరిగే ప్రమాదం!

భారత్‌కు రానున్న హర్లే డేవిడ్సన్ 'పాన్ అమెరికా' అడ్వెంచర్ మోటార్‌సైకిల్

అలాగే, ముందు వైపు 320 మిమీ ట్విన్ డిస్కులు మరియు వెనుక వైపు 280 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇందులో ముందు వైపు 19 ఇంచ్ అల్లాయ్ వీల్‌ను మరియు వెనుక వైపు 17 ఇంచ్ అల్లాయ్ వీల్‌ను ఉపయోగించారు. వీటిపై మిష్లిన్ స్కార్చర్ అడ్వెంచర్ రేడియల్ టైర్లను అమర్చారు.

భారత్‌కు రానున్న హర్లే డేవిడ్సన్ 'పాన్ అమెరికా' అడ్వెంచర్ మోటార్‌సైకిల్

టాప్-ఎండ్ వేరియంట్ అయిన పాన్ అమెరికా స్పెషల్‌లో సెమీ యాక్టివ్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్‌తో పాటు వెహికల్ లోడ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టాండర్డ్ సెంటర్ స్టాండ్, సర్దుబాటు చేయగల వెనుక బ్రేక్ పెడల్, అల్యూమినియం స్కిడ్-ప్లేట్, హీటెడ్ హ్యాండ్ గ్రిప్స్, స్టీరింగ్ డంపర్, అడాప్టివ్ రైడ్ హైట్ మరియు ట్యూబ్‌లెస్ స్పోక్డ్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

MOST READ:మానవత్వం చాటుకున్న మంచి పోలీస్ & బైక్ రైడర్.. వీడియో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు

భారత్‌కు రానున్న హర్లే డేవిడ్సన్ 'పాన్ అమెరికా' అడ్వెంచర్ మోటార్‌సైకిల్

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా మోటార్‌సైకిల్ భారతదేశంలో కూడా విడుదల అవుతుందని సమాచారం. మరికొన్ని నెలల్లనే ఇది భారత తీరాలను తాకే ఆస్కారం ఉంది. దేశీయ మార్కెట్లో దీని ధర సుమారు రూ.20 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Harley-Davidson Pan America Adventure Motorcycle India Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X