భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన బైక్ కంపెనీలలో హార్లే డేవిడ్సన్ ఒకటి. హార్లే డేవిడ్సన్ బ్రాండ్ యొక్క బైకులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం చెందాయి. హార్లే డేవిడ్సన్ కంపెనీ భారతదేశంలో కూడా తన బ్రాండ్స్ ప్రవేశ పెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే కంపెనీ తన పాన్ అమెరికా 1250 బైక్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

పాన్ అమెరికా 1250 ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అడ్వెంచర్-టూరర్ బైక్. ఇప్పుడు కంపెనీ ఈ అడ్వెంచర్ బైక్ డెలివరీలను కూడా ప్రారంభించింది. కంపెనీ యొక్క మొదటి అడ్వెంచర్ టూరర్ పాన్ అమెరికా 1250 బైక్ సొంతం చేసుకున్న వ్యక్తి లేడీస్ ఆఫ్ హార్లీ అసిస్టెంట్ డైరెక్టర్ 'అనుశ్రియ గులాటి'.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 బైక్ ధర భారతీయ మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం అక్షరాలా రూ. 16.90 లక్షల నుండి రూ. 19.19 లక్షల వరకు ఉంటుంది. హార్లే-డేవిడ్సన్ బైక్‌ను కొన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తోంది. ఈ బైక్‌ను అమెరికాలోని పెన్సిల్వేనియాలోని హార్లే యార్క్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడి నుండి బైక్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ మార్గం ద్వారా భారతదేశంలోకి దిగుమతి అవుతోంది.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్-కనెక్టివిటీతో 6.8-ఇంచెస్ కలర్ డిస్‌ప్లే మరియు USB C-టైప్ అవుట్‌లైట్ వంటివాటిని కలిగి ఉంది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ పాన్ అమెరికన్ 1250 పూర్తిగా రీడిజైన్ చేసి అభివృద్ధి చేయబడిన కొత్త బైక్. ఇది సాహస ప్రియులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 బైక్ 1250 సిసి వి ట్విన్ డిఓహెచ్సి ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 127 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. పాన్ అమెరికా చాలా ఇంధన సామర్ధ్యం కలిగి ఉంటుంది, కావున ఇది లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

కొత్త పాన్ అమెరికా 1250 స్పెషల్ వెహికల్ లోడ్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టాండర్డ్ సెంటర్ స్టాండ్, అడ్జస్టబుల్ రియర్ బ్రేక్ పెడల్, అల్యూమినియం స్కిడ్-ప్లేట్, హీటెడ్ హ్యాండ్ గ్రిప్స్, స్టీరింగ్ డంపర్, అడాప్టివ్ రైడ్ హైట్ మరియు ట్యూబ్‌లెస్‌ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 లో అతి ముఖ్యమైన ఫీచర్ దాని అడాప్టివ్ రైడర్ హైట్ సిస్టం. కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ సహాయంతో, బైక్ డ్రైవర్ తన సౌలభ్యం మేరకు బైక్ యొక్క ఎత్తును సర్దుబాటు చేయవచ్చు.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

ఈ సిస్టమ్‌తో, బైక్ యొక్క ఎత్తు డ్రైవ్ చేస్తున్నప్పుడు 890 మిమీ, అదేవిధంగా నిలబడినప్పుడు 855 మిమీ అవుతుంది. ఈ టెక్నాలజీతో, రైడర్ బైక్ పై మెరుగైన నియంత్రణ మరియు సౌకర్యాన్ని పొందుతాడు. బైక్‌ను వివిధ రకాల రోడ్లపై నడపడానికి మల్టిపుల్ రైడ్ మోడ్‌లు ఇవ్వబడ్డాయి, ఇందులో స్పోర్ట్, రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్ మరియు ఆఫ్ రోడ్ ప్లస్ వంటి రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

ఈ బైక్ లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టిసిఎస్, ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇది ఎలాంటి రోడ్డులో అయినా రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

భారతీయ మార్కెట్ నుండి హార్లే-డేవిడ్సన్ వైదొలిగిన తరువాత, తన కంపెనీ యొక్క అమ్మకాలను దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ ద్వారా విక్రయిస్తోంది. భారతదేశంలో ఈ బైకులను విక్రయించడం కోసం మార్కెటింగ్ మరియు సర్వీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది.

భారతదేశంలో 'హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250' ఫస్ట్ బైక్‌ సొంతం చేసుకున్న మహిళ; ఎవరో తెలుసా?

హీరో మోటోకార్ప్ భారతదేశంలో హార్లే-డేవిడ్సన్ బైకులను 2021 జనవరి నుంచి అమ్మకాలను చేపడుతూ సర్వీస్ వంటి వాటి బాధ్యతను కూడా స్వీకరించింది. హీరోతో భాగస్వామ్యం తరువాత, హార్లే-డేవిడ్‌సన్ కస్టమర్‌లు ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు మరియు సర్వీసింగ్ ఆప్సన్ కలిగి ఉన్నారు.

Most Read Articles

English summary
Harley davidson started deliveries of pan america 1250 adventure tourer in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X