భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

అమెరికన్ ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్సన్, భారతదేశంలో స్వతహాగా కార్యకలాపాలు కొనసాగించలేక చేతులెత్తేసింది. దేశీయ మార్కెట్లో పెరిగిన పోటీ, తక్కువ సేల్స్ కారణంగా, భారతదేశం నుండి స్వతంత్ర బ్రాండ్‌గా నిష్క్రమిస్తున్నట్లు హ్యార్లీ డేవిడ్సన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసినదే.

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

ఈ నేపథ్యంలో, హ్యార్లీ డేవిడ్సన్ తాజాగా తమ అప్‌డేటెడ్ మోటార్‌సైకిల్ లైనప్‌ను ప్రకటించింది. ఈ లైనప్ నుండి కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేయబడిన స్ట్రీట్ 750 మరియు స్ట్రీట్ రాడ్ మోటార్‌సైకిళ్లను తొలగించింది. భారత్‌లో ఈ రెండు మోడళ్లకు సంబంధించిన ఉత్పత్తి కార్యకలాపాలను కూడా కంపెనీ పూర్తిగా నిలిపివేసింది.

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

హ్యార్లీ డేవిడ్సన్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా రెండు మోటార్‌సైకిళ్లను తొలగించారు. తక్కువ బడ్జెట్‌లో హ్లార్లీ బైక్ కొనాలనుకునే కస్టమర్ల కలను సాకారం చేసేందుకు కంపెనీ తమ ఎంట్రీ లెవల్ మోడళ్లుగా స్ట్రీట్ 750 మరియు స్ట్రీట్ రాడ్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది. తక్కువ ధరకే అందించేందుకు వీటిని భారతదేశంలోనే అసెంబుల చేసేది.

MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

అయితే, కొన్ని అనివార్య కారణాల వలన హ్యార్లీ డేవిడ్‌సన్ భారత మార్కెట్ నుండి స్వతంత్ర బ్రాండ్‌గా నిష్క్రమించింది. అయినప్పటికీ, మనదేశంలో హ్యార్లీ బైక్‌లు లభిస్తాయి. అయితే, ఇవి పూర్తిగా ఇంపోర్టెడ్ రూపంలోనే ఉంటాయి. విదేశాల్లో తయారు చేసిన హ్యార్లీ బైక్‌లను భారతదేశంలోకి దిగుమతి చేసుకొని విక్రయిస్తారు.

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

ఇందుకోసం హ్యార్లీ డేవిడ్సన్, భారతదేశపు అతిపెద్ద టూవీలర్ బ్రాండ్ అయిన హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌ల ద్వారా హ్యార్లీ డేవిడ్సన్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తారు. భారతదేశంలో ఉమ్మడి కార్యకలాపాలను ప్రారంభించేందుకు హీరో మోటోకార్ప్ హ్యార్లీ డేవిడ్సన్ డీలర్లను తమలో విలీనం చేసుకుంది.

MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

కాగా, భారత మార్కెట్ నుండి స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ మోటార్‌సైకిళ్లను తొలగించడంతో ఇకపై ఐరన్ 883 మోడల్ దేశంలో బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్‌గా ఉంటుంది. ఇకపై భారత మార్కెట్లో విక్రయించే అన్ని హ్యార్లీ డేవిడ్సన్ మోటార్‌సైకిళ్ళను కంప్లీట్లీ బిల్ట్-అప్ (సిబియు) రూట్‌లో విదేశాల నుండి దిగుమతి చేయబడతాయి.

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

దేశంలో స్ట్రీట్ 750 మోడల్‌ని నిలిపివేయబడటానికి ముందు, ఈ మోటారుసైకిల్ ధరను రూ.65,000 మేర తగ్గించారు. ధర తగ్గిన తరువాత, స్ట్రీట్ 750 అర్బన్ క్రూయిజర్ ప్రారంభ ధర రూ.4.69 లక్షలుగా ఉండేది. మరోవైపు, స్ట్రీట్ రాడ్ ధర రూ.6.55 లక్షలుగా ఉండేది. (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ:ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 మరియు స్ట్రీడ్ రాడ్‌లు రెండు ఒకేరకమైన ఇంజన్‌తో లభించేవి, అయితే వాటి పవర్ మాత్రం విభిన్నంగా ఉండేది. వీటిలో బిఎస్-6 కంప్లైంట్ 749సిసి, వి-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. స్ట్రీట్ 750 లోని ఈ ఇంజన్ గరిష్టంగా 55 బిహెచ్‌పి పవర్‌ను మరియు 60 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

కాగా, స్ట్రీట్ రాడ్‌లోని అదే ఇంజన్ గరిష్టంగా 70బిహెచ్‌పి పవర్‌ను మరియు 65 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభించేవి.

MOST READ:సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

స్ట్రీట్ రాడ్‌లో విశాలమైన హ్యాండిల్ బార్, టియర్-డ్రాప్ ఆకారపు పొడవైన ఫ్యూయెల్ ట్యాంక్, పెద్ద రేడియేటర్, గుండ్రటి ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్స్, బ్లాక్-అవుట్ లాంగ్ ఎగ్జాస్ట్, ఫ్రంట్-సీట్ ఫుట్‌పెగ్స్ మరియు బాగా కుషన్ చేయబడిన రైడర్ మరియు పిలియన్ సీట్స్ వంటి ఫీచర్లు లభించేవి.

భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్‌కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?

అలాగే, స్ట్రీట్ 750లో కూడా పొడవైన టియర్-డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్, అప్-రైట్ హ్యాండిల్ బార్, బాగా కుషన్ చేయబడిన రైడర్ సీటు ఉన్నాయి. ఇది నగర ప్రయాణాలకు మరియు సుదూర ప్రయాణాలకు అనువుగా ఉండేది. ఈ రెండు మోటార్‌సైకిళ్ళు కూడా తక్కువ-రైడర్ సీటు ఎత్తును కలిగి ఉండి, బిజీగా ఉండే నగర ట్రాఫిక్‌లో కూడా సులువుగా నావిగేట్ చేయడానికి వీలుగా ఉండేవి.

Most Read Articles

English summary
Harley Davidson Street 750 And Street Rod Discontinued In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X