Just In
- 8 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020 ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ డ్రాగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా హేమంత్ ముద్దప్ప
బెంగళూరుకు చెందిన బైక్ రేసర్ హేమంత్ ముద్దప్ప మరో అరుదైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవలే ముగిసిన 2020 ఎమ్ఎమ్ఎస్‌సి ఎఫ్ఎమ్ఎస్‌సిఐ ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ డ్రాగ్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగోసారి కూడా హేమంతే విజేతగా నిలిచాడు.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాల మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు కావటం లేదా ఆలస్యం కావటం జరిగిన విషయం మనకు తెలిసినదే. అయితే, ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ డ్రాగ్ ఛాంపియన్‌షిప్ యొక్క 2020 సీజన్‌ను మాత్రం నిర్వాహకులు విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సీజన్‌కి సంబంధించిన రెండవ మరియు చివరి రౌండ్ రేసింగ్ జనవరి 24, 2021వ తేదీన చెన్నైలోని మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో జరిగింది. ఇందులో 1051సిసి విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన హేమంత్ ముద్దప్ప, తన బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్‌ఆర్‌తో 302 మీటర్ల దూరాన్ని కేవలం 7.879 సెకన్లలోనే చేరుకుని ఛాంపియన్‌షిప్ విజయాన్ని సాధించాడు.
MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

ఇదే విభాగంలో రెండవ స్థానంలో నిలిచిన బాబా శతగోపన్ ఈ దూరాన్ని 08.263 సెకన్లలో చేరుకున్నారు. కాగా, ఇదే దూరాన్ని 08.362 సెకన్లలో చేరుకున్న హఫీజుల్లా ఖాన్ ఈ ఛాంపియన్‌షిప్‌లో మూడవ స్థానంలో నిలిచారు. ఈ 1051 సిసి కేటగిరీలో గెలిచిన బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్‌ను బెంగళూరులోని మంత్ర రేసింగ్‌కు చెందిన శరణ్ ప్రతాప్ ట్యూన్ చేశారు.

ఈ ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన తరువాత, హేమంత్ ముద్దప్ప వరుసగా నాలుగో జాతీయ ఛాంపియన్‌షిప్ విజయాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన టీ షర్టుతో జరుపుకున్నారు.
MOST REDA:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

ఇకపోతే, 850 నుండి 1050 సిసి విభాగంలో హేమంత్ ముద్దప్ప తన రెండవ స్వర్ణాన్ని కేవలం 8.071 సెకన్లలో సుజుకి హయాబుసా బైక్ ద్వారా సాధించాడు. ఇదే విభాగంలో జుబైర్ అలీ జంగ్ 8.202 సెకన్ల సమయంతో రెండవ స్థానంలో ఉండగా, బాబా సతగోపన్ 8.306 సెకన్ల సమయంతో మూడవ స్థానంలో నిలిచాడు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ 850 నుండి 1050 సిసి విభాగంలో మూడు పోడియంలను కూడా బెంగళూరుకు చెందిన రేసర్లే గెలుచుకున్నారు. హేమంత్ ముద్దప్ప గతంలో 2017, 2018 మరియు 2019 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు ఈ రేసులో విజయం సాధించాడు.

రౌండ్ 2 రేస్ ఫలితాలు:
1051 సిసి మరియు ఆపై:
1 వ స్థానం: హేమంత్ ముద్దప్ప (07.879)
2 వ స్థానం: బాబా సతగోపన్ (08.263)
3 వ స్థానం: హఫీజుల్లా ఖాన్ (08.362)
815-1050 సిసి క్లాస్:
1 వ స్థానం: హేమంత్ ముద్దప్ప (08.071)
2 వ స్థానం: జుబైర్ అలీ జంగ్ (08.202)
3 వ స్థానం: బాబా సతగోపన్ (08.306)
361-550 సిసి క్లాస్:
1 వ స్థానం: కార్తీక్ మాటేటి (12.325)
2 వ స్థానం: అయాజ్ (12.360)
3 వ స్థానం: తులసి రామ్ (12.447)
226-360 సిసి క్లాస్:
1 వ స్థానం: పిఎం సూర్య (12.532)
2 వ స్థానం: జె.భారత్ రాజ్ (12.536)
3 వ స్థానం: శంకర్ గురు (13.166)
165 సిసి వరకు:
మొదటి స్థానం: జె.భారత్ రాజ్ (14.420)
2 వ స్థానం: పిఎం సూర్య (14.465)
3 వ స్థానం: ఆర్.అరవింద్ గణేష్ (14.526)
లేడీస్ క్లాస్ (165 సిసి):
1 వ స్థానం: ఆన్ జెన్నిఫర్ (16.858)
2 వ స్థానం: ఆర్.వి. సిమ్ఖి (17.077)
3 వ స్థానం: నివేటా జెస్సికా (17.156)
2-స్ట్రోక్ (165 సిసి వరకు):
1 వ స్థానం: అయాజ్ (12.959)
2 వ స్థానం: మహ్మద్ తౌహీద్ (13.220)
3 వ స్థానం: కలీం పాషా (13.224)

2-స్ట్రోక్ (130 సిసి వరకు):
1 వ స్థానం: మహ్మద్ రఫీక్ (13.200)
2 వ స్థానం: ముజాహిద్ పాషా (13.452)
3 వ స్థానం: మహ్మద్ తౌహీద్ (13.687)
2020 నేషనల్ ఛాంపియన్‌షిప్ విజేతలు
1051 సిసి మరియు ఆపై:
హేమంత్ ముద్దప్ప (మంత్ర రేసింగ్)
815-1050 సిసి క్లాస్:
హేమంత్ ముద్దప్ప (మంత్ర రేసింగ్)
361-550 సిసి క్లాస్:
అయాజ్ (ప్రైవేట్)
226-360 సిసి క్లాస్:
జె. భరత్ రాజ్ (రులెక్స్ రాకర్స్ రేసింగ్)
165 సిసి వరకు:
జె. భరత్ రాజ్ (రులెక్స్ రాకర్స్ రేసింగ్)
లేడీస్ క్లాస్ (165 సిసి):
ఆన్ జెన్నిఫర్ (స్పార్క్స్ రేసింగ్)
2-స్ట్రోక్ (165 సిసి వరకు):
అయాజ్ (ప్రైవేట్)
2-స్ట్రోక్ (130 సిసి వరకు):
మహ్మద్ రఫీక్ (2 ఎస్)
MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఈ 2020 ఇండియన్ నేషనల్ డ్రాగ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ దేశీయ విభాగంలో బెంగళూరుకు చెందిన రైడర్లే మొదటి రెండు విభాగాలలో ఎక్కువ స్థానాలను గెలుచుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి సడలింపుతో, నిర్వాహకులు 2020 సంవత్సరానికి గానూ ఈ స్వల్పకాలిక సీజన్ పూర్తి చేయడానికి 2 రౌండ్ల రేస్‌ను నిర్వహించారు.