హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric), దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గిరాకీ ఒక్కసారిగా ఊపందుకుంది. గత కొన్ని నెలలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో హీరో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

వాస్తవానికి మార్కెట్లో బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450ఎక్స్, ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ వన్ మరియ ఓకినోవా వంటి ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి పరిమిత నగరాల్లో మాత్రమే లభించడం పైగా వాటికి వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగా ఉండటంతో కస్టమర్లు సరసమైన ధరకే లభించే హీరో ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

ఈ నేపథ్యంలో, హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అమాతం పెరిగిపోయింది. దీంతో వాటి నగరాల్లోని డీలర్లు నో-స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల అవగాహణ పెరగడం కూడా మార్కెట్లో ఎలక్ట్రిక్ టూవీలర్లకు గిరాకీని పెంచింది. గడచిన సెప్టెంబర్ 2021 నెలలో హీరో ఎలక్ట్రిక్ అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

గత నెలలో హీరో ఎలక్ట్రిక్ 6,500 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. హైస్పీడ్ విభాగంలో కంపెనీ అందిస్తున్న ఆప్టిమా మరియు ఎన్‌వైఎక్స్ వంటి స్కూటర్లు అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయని కంపెనీ తెలిపింది. సెప్టెంబరు 2021 లో కంపెనీ సానుకూల వృద్ధి వేగంతో మొదటి అర్ధభాగాన్ని అధిగమించిందని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 2022 నాటికి తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనా తయారీ సామర్థ్యాన్ని ఏటా 5 లక్షల యూనిట్లకు పెంచుతామని కంపెనీ ప్రకటించింది. అంతే కాకుండా, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కూడా కంపెనీ ప్లాన్ చేస్తోంది. రానున్న రోజుల్లో హీరో ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్ మౌళిక సదుపాయాలను కల్పించేందుకు మాసివ్ మొబిలిటీ (Massive Mobility) అనే సంస్థతో ఓ భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఇరు కంపెనీలు సంయుక్తంగా తమ ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించి వినియోగదారుల ప్రవర్తనను కొలవడానికి ఒక సర్వేను కూడా నిర్వహించాయి.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

ఈ సర్వే ప్రకారం, చాలామంది ఈవీ కస్టమర్‌లు మొబైల్ యాప్‌లు లేదా ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ ఛార్జర్‌ల కోసం వెతుకుతున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా, ఛార్జింగ్ కోసం 16 AMP ఛార్జింగ్ పాయింట్ మరియు లాంగ్ కార్డ్ కోసం డిమాండ్ ఎక్కువగా కనిపించిందని ఈ సర్వేలో వెల్లడైంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

హీరో ఎలక్ట్రిక్ భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి పంజాబ్‌లోని లూథియానాలో ఓ ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ ఉంది. ప్రస్తుతం, ఈ ప్లాంట్ ఏటా 1 లక్షకు పైగా ద్విచక్ర వాహనాలను తయారు చేయగలదు. రానున్న రోజుల్లో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 5 లక్షల యూనిట్లకు పెంచనున్నారు.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

ప్రస్తుతం, హీరో ఎలక్ట్రిక్ సంస్థకు దేశవ్యాప్తంగా 600 షోరూమ్‌లు మరియు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఈ సంస్థ గత 12 సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది మరియు ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసింది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాది నవంబర్ నెలలో సిటీ స్పీడ్ శ్రేణిలో ఆప్టిమా హెచ్ఎక్స్, ఫోటాన్ హెచ్ఎక్స్ మరియు ఎన్‌వైఎక్స్ -హెచ్‌ఎక్స్ అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లన్నీ కూడా గంటకు 30 కిమీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఈ స్కూటర్ల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి అన్ని రకాల అర్బన్ రోడ్లపై నడిచేలా డిజైన్ చేయబడ్డాయి. ఫ్లై ఓవర్లు మరియు క్లైంబింగ్ మార్గాల్లో కూడా వీటిని సులభంగా నడపవచ్చు. పవర్ మరియు పెర్ఫార్మెన్స్ యొక్క ఉత్తమ కలయికతో కంపెనీ ఈ స్కూటర్లను తయారు చేసింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మరియు వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ ఫీజ్ నుండి మినహాయించింది. ఈ నిర్ణయం తరువాత, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఫీజులో భారీగా డబ్బును ఆదా చేసుకోవచ్చు.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

కేంద్ర ప్రభుత్వంతో పాటు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాలలో అనుసరించే ఈవీ పాలసీ విధానాలను బట్టి, అక్కడ విక్రయించబడే ఎలక్ట్రిక్ వాహనాలపై రహదారి పన్ను (రోడ్ టాక్స్) మరియు బ్యాటరీతో నడిచే వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపులను అందిస్తున్నాయి. అయితే, వివిధ రాష్ట్రాలను బట్టి ఈ రాయితీలు వేర్వేరుగా ఉంటాయి.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, గత కొన్ని నెలలుగా తమ డీలర్‌షిప్ కేంద్రాలకు వినియోగదారుల తాకిడి పెరిగిందని, కస్టమర్లు తమ వద్ద ఉన్న పెట్రోల్ పవర్డ్ టూవీలర్లను హీరో ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం మార్పిడి (ఎక్సేంజ్) చేసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి కూడా ఎంక్వైరీలు చేస్తున్నారని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న క్రేజ్.. భారీ వెయిటింగ్ పీరియడ్, సెప్టెంబర్‌లో టాప్ సేల్స్!

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో, హీరో ఎలక్ట్రిక్ వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తూ, విస్తృతమైన నెట్‌వర్క్‌తో మార్కెట్ లీడర్‌గా ఉంది. ఈ బ్రాండ్ అందిస్తున్న కొన్ని రకాల లో-స్పీడ్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ కూడా అవసరం లేదు. మార్కెట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే, హీరో ఎలక్ట్రిక్ టూవీలర్లు సరసమైన ధరను కలిగి ఉండటమే కాకుండా, బెటర్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కూడా కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
Hero electric sold 6500 electric scooter in september 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X