దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric), బెంగళూరుకు చెందిన EV ఛార్జింగ్ స్టార్ట్-అప్ అయిన చార్జర్‌ (Charzer) తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, చార్జర్ మొదటి సంవత్సరంలో హీరో ఎలక్ట్రిక్ సహకారంతో భారతదేశంలోని టాప్ 30 నగరాల్లో 10,000 ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది. ఇరు కంపెనీలు కలిసి వచ్చే మూడేళ్లలో మొత్తం 1,00,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

అంతేకాకుండా, ఈ స్టార్ట్-అప్ కంపెనీ వినియోగదారులకు ఛార్జింగ్ సౌకర్యాన్ని సులభతరం చేయడానికి హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో కిరానా చార్జర్ (Kirana Charzer) కూడా అమలు చేయనుంది. అలాగే, యూజర్లకు సమీపంలో ఉండే ఛార్జింగ్ స్టేషన్‌ లు మరియు బుకింగ్ స్లాట్‌ లను గుర్తించడానికి EV యజమానుల కోసం Charzer ఓ మొబైల్ అప్లికేషన్ ను మరియు ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ ను కూడా అందిస్తుంది.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

ఎలక్ట్రిక్ వెహికల్ రైడర్‌ లు సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్‌లో ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని చార్జర్ అందించనుంది. Charzer అనేది పబ్లిక్ స్థలాలు, అపార్ట్‌మెంట్‌ లు మరియు కార్యాలయాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ సొల్యూషన్‌ లను అందించే EV స్టార్ట్-అప్ కంపెనీ. ఇది బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థ అందించే ఈవీ ఛార్జర్‌ లు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలంగా ఉంటాయి.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

చార్జర్ ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా, ధృవీకరించబడిన నిపుణుల ద్వారా ఈ చార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేస్తుంది మరియు సర్వీస్ అందిస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం బెంగళూరు, పూణె, ఢిల్లీ, హైదరాబాద్, మంగళూరు మరియు విశాఖపట్నంతో సహా 20 నగరాల్లో తన ఉనికిని కలిగి ఉంది. ఈ సహకారం ద్వారా, Charzer తన B2B (బిజినెస్ టూ బిజినెస్) వ్యాపారంలో హీరో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ భాగస్వామిగా ఉంటుంది.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

ఈ సహకారం గురించి హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అభివృద్ధికి బలమైన మరియు సుసంపన్నమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ కీలకమని తమ కంపెనీ విశ్వసిస్తోందని అన్నారు. ఈ అసోసియేషన్ దేశంలో EV ల వృద్ధికి సహాయపడుతుందని మరియు Charzer ద్వారా అమర్చబడిన ఈవీ ఛార్జర్‌లతో ఛార్జింగ్ స్లాట్ బుకింగ్ మరియు పేమెంట్‌ని ఏకీకృతం చేయడం ద్వారా కస్టమర్‌లకు ఇబ్బందులు లేని ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

భారతదేశంలో EV ల వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథం మరియు నిబద్ధతతో, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడానికి ఈ రెండు బ్రాండ్‌లు కృషి చేస్తున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా, ప్రజల దృష్టిని ఈవీల వైపు ఆకర్షించడం, క్లీనర్ మరియు గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్‌ను ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు: హీరో ఎలక్ట్రిక్

ఇదిలా ఉంటే, హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 - 2022) ముగిసే నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 కొత్త సేల్స్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. కేవలం తన సేల్స్ టచ్‌పాయింట్లను పెంచడమే కాకుండా, ఎలక్ట్రిక్ టూవీలర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

గత ఏడాదితో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు విక్రయాలకు అనుగుణంగా తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. హీరో ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా 500 నగరాల్లో సానుకూల విక్రయాలను కలిగి ఉంది మరియు ఈ నగరాల్లో 700 కంటే ఎక్కువ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ లను నిర్వహిస్తోంది.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 4,00,000 లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత మార్కెట్లో కంఫర్ట్ స్పీడ్ మరియు సిటీ స్పీడ్ విభాగంలో స్కూటర్లను విక్రయిస్తోంది.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

కంఫర్ట్ స్పీడ్ విభాగంలో అట్రియా (Atria), ఫ్లాష్ (Flash) మరియు ఆప్టిమా (Optima) ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, వీటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు.

దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer

అలాగే, సిటీ స్పీడ్ విభాగంలో ఆప్టిమా హెచ్ఎక్స్ (Optima HX), ఎన్‌వైఎక్స్ హెచ్ఎక్స్ (NYX HX) మరియు ఫోటాన్ హెచ్ఎక్స్ (Photon HX) మోడళ్లను విక్రయిస్తోంది. ఈ స్కూటర్ల గరిష్ట వేగం (టాప్ స్పీడ్) గంటకు 42 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ సిటీ స్పీడ్ రేంజ్ స్కూటర్లను నడపడానికి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

Most Read Articles

English summary
Hero electric charzer to install 1 lakh charging stations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X