హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్, ఈ ఏడాది జనవరిలో 100 మిలియన్ టూవీలర్ అమ్మకాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, కంపెనీ తమ ఉత్పత్తులలో 6 మోడళ్లను 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్‌లుగా విడుదల చేసింది.

హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

కాగా, కంపెనీ ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లపై వివిద రకాల ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా, ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.3,500 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

ఈ మొత్తంలో రూ.2,500 నగదు బోనస్ మరియు రూ.1,000 ఎక్స్ఛేంజ్ / లాయల్టీ బోనస్‌లు కలిసి ఉంటాయి. హీరో మోటోకార్ప్ అందిస్తున్న ఈ సెలబ్రేషన్ ఆఫర్, కంపెనీ విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ మోడల్స్ స్టాక్ అయ్యే వరకు కొనసాగుతుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

షోరూమ్‌ను బట్టి ఈ ఆఫర్ మారవచ్చని కంపెనీ పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, స్ప్లెండర్ ప్లస్, ప్యాషన్ ప్రో, గ్లామర్, డెస్టినీ 125 మరియు మాస్ట్రో ఎడ్జ్ 110 మోడళ్లు ఉన్నాయి.

హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి కొంత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వచ్చే ఐదేళ్ల పాటు ప్రతి సంవత్సరం పదికి పైగా కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తామని హీరో మోటోకార్ప్ ప్రకటించింది.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

కంపెనీ నుండి రాబోయే ఈ కొత్త హీరో మోడళ్లలో పూర్తిగా సరికొత్త ద్విచక్ర వాహనాలతో పాటు ఇప్పటికే ఉన్న మోడళ్లకు అప్‌గ్రేడెడ్ వెర్షన్లు కూడా ఉంటాయని కంపెనీ వివరించింది.

హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

కొత్త మరియు ప్రత్యేకమైన ప్రోడక్ట్ కాన్సెప్ట్‌లను అభివృద్ధి చేయడంతో పాటు దాని ప్రపంచ అడుగుజాడలను విస్తరించడానికి కూడా కృషి చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ అమ్మకాల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉంది.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

ఇదిలా ఉంటే, భారతదేశంలో పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా, ఏప్రిల్ నెల నుండి తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ముడి సరుకుల అధిక ధరల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించడానికి ధరలను సవరించే నిర్ణయం అవసరమని కంపెనీ పేర్కొంది.

హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2021వ తేది నుండి అమల్లోకి వస్తాయని, మోడల్‌ను బట్టి ధరలు 2,500 రూపాయల వరకూ పెరుగుతాయని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలోనే హీరో మోటోకార్ప్ తమ టూవీలర్ల ధరలను పెంచడం ఇది వరుసగా రెండవసారి. జనవరి 2021లో కంపెనీ తమ టూవీలర్ల ధరలను సుమారు రూ.1,500 వరకూ పెంచింది.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

Most Read Articles

English summary
Hero MotoCorp Announces 100 Million Celebration Offer On Two Wheelers, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X