Just In
- 9 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 48 min ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 16 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
Don't Miss
- Sports
'అనుకోకుండా క్రికెటర్ అయ్యా.. టీమిండియా జెర్సీ ధరిస్తానని అసలు ఊహించలేదు'
- News
రూ.40 లక్షలు బిల్.. స్టార్ హోటల్లో రాజసం, లగ్జరీ కార్లు.. ఇదీ కిలేడీ కహానీ
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Movies
Naandhi 8 Days Collections: ఒక్కసారిగా పుంజుకున్న నాంది.. నరేష్ మూవీకి ఎంత లాభం వచ్చిందంటే!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హార్లే డేవిడ్సన్ ఇండియా చైర్మన్‌గా రవి అవలూర్‌ని నియమించిన హీరో మోటోకార్ప్
అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'హార్లే డేవిడ్సన్', భారతదేశంలో స్వతంత్ర బ్రాండ్‌గా నిష్క్రమించిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ నియంత్రణలో ఉన్న హార్లే డేవిడ్సన్ ఇండియాకు కొత్త ఛైర్మన్‌గా రవి అవలూర్ నియమితులయ్యారు.

హై-ఎండ్ క్రూయిజర్ మోటార్‌సైకిళ్ల తయారీలో ప్రపంచ లీడర్‌గా ఉన్న హార్లే డేవిడ్సన్, భారతదేశంలో మాత్రం వ్యక్తిగతంగా వ్యాపారం కొనసాగించలేకపోయింది. ఈ బ్రాండ్ పట్ల మార్కెట్లో ఆదరణ తగ్గిపోవటం, అమ్మకాలు సన్నగిల్లడంతో హార్లే డేవిడ్సన్ భారతదేశం నుండి వ్యక్తిగత సంస్థగా బయటకు వెళ్లిపోతున్నట్లు గతేడాది ప్రకటించింది.

హార్లే డేవిడ్సన్ భారత మార్కెట్ నుండి స్వతంత్ర బ్రాండ్‌గా నిష్క్రమించినప్పటికీ, కొత్త కస్టమర్లకు మనదేశంలో హ్యార్లీ బైక్‌లు మరియు వాటికి సంబంధించిన సేవలు లభిస్తాయి. ఈ బైక్‌లను పూర్తిగా విదేశాల నుండి దిగుమతి చేసుకొని, భారత్‌లోని హీరో మోటోకార్ప్ నెట్‌వర్క్ ద్వారా వాటిని విక్రయిస్తున్నారు.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

హార్లే డేవిడ్సన్ హర్యానాలో ఉన్న తమ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా మూసివేసింది. దీంతో ప్లాంట్‌లో పనిచేసే కార్మికులు మరియు డీలర్లు రోడ్డున పడ్డారు. ఈ ప్లాంట్‌లో హార్లే డేవిడ్సన్ తమ బడ్జెట్ మోటార్‌సైకిళ్లయిన స్ట్రీట్ 750 మరియు స్ట్రీట్ రాడ్ మోడళ్లను ఉత్పత్తి చేసేది. కంపెనీ ఇటీవలే ఈ రెండు మోడళ్లను కూడా భారత మార్కెట్ నుండి తొలగించివేసింది.

కాగా, భారతదేశంలో ఉమ్మడి కార్యకలాపాలను ప్రారంభించేందుకు హార్లే డేవిడ్సన్ డీలర్లను హీరో మోటోకార్ప్ తమలో విలీనం చేసుకోనుంది. ఇందుకోసం ఇదివరకు హార్లే డేవిడ్సన్ సంస్థతో పనిచేసిన 11 మంది డీలర్లు ఇప్పుడు హీరో మోటోకార్ప్ క్రింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.
MOST READ:ట్రయంఫ్ టైగర్ 900 బైక్ సొంతం చేసుకున్న మలయాళీ స్టార్

చెన్నై, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, కొచ్చి, భువనేశ్వర్, ఢిల్లీ, డెహ్రాడూన్, హైదరాబాద్, ముంబై మరియు కోల్‌కతాలోని హార్లే డేవిడ్సన్ డీలర్లు హీరో మోటోకార్ప్‌తో పనిచేయటానికి సానుకూలంగా స్పందించారు.

అదే సమయంలో, హీరో మోటోకార్ప్ క్రింద పనిచేస్తున్న కొన్ని అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలు కూడా హార్లే డేవిడ్సన్ మోటార్‌సైకిళ్లను విక్రయించనున్నాయి. అంతేకాకుండా, అమ్మకాలు అయిన తర్వాత హార్లే డేవిడ్సన్ మోటార్‌సైకిళ్లకు సేవలను అందించడం (సర్వీస్, మెయింటినెన్స్, స్పేర్ పార్ట్స్ మొదలైనవి) కూడా కొనసాగిస్తాయి.
MOST READ:మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

ఈ నిర్ణయం దేశంలోని కొత్త మరియు పాత హార్లే డేవిడ్సన్ మోటారుసైకిల్ వినియోగదారులకు కొంతమేర ఉపశమనాన్ని కలిగించనుంది. ఈ మొత్తం ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు హీరో మోటోకార్ప్ రవి అవలూర్‌ను హార్లే డేవిడ్సన్ ఇండియా డివిజన్ బిజినెస్ హెడ్‌గా నియమించింది.

హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆధ్వర్యంలో ఆయన నేరుగా పని చేయనున్నారు. ఇంతకు ముందు, రవి అవలూర్ కూపర్ మరియు డుకాటీ ఇండియా ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
MOST READ:తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి