దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp (హీరో మోటోకార్ప్) రోజురోజుకి తన ఉనికిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే అరబ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని దుబాయ్‌లో ఒక ప్రత్యేక షోరూమ్‌ను ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

Hero MotoCorp (హీరో మోటోకార్ప్) కంపెనీ ఇప్పుడు దుబాయ్‌లోని 2వ డిసెంబర్ స్ట్రీట్, జుమేరా 1 అల్ గజల్ మాల్‌లో కొత్త ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంతే కాకుండా అత్యాధునిక వర్క్‌షాప్, 3S (సేల్స్, సర్వీస్, స్పేర్స్) కార్యకలాపాలను కూడా ప్రారంభించింది. ఇది అల్ క్వోజ్ రోడ్ నెం.318, అల్ క్వోజ్ ఇండస్ట్రియల్ ఏరియా III, దుబాయ్‌లో ఉంది.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

కంపెనీ దుబాయ్‌లో ప్రారంభించిన ఈ కొత్త షోరూమ్ 625 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణంలో కంపెనీ యొక్క మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లు ప్రదర్శించబడతాయి. దీనితో పాటు రెండు సర్వీస్ బేలతో కూడిన వర్క్‌షాప్ వినియోగదారులకు ఉత్తమమైన విక్రయాల తర్వాత సర్వీస్ మరియు విడిభాగాలను అందిస్తుంది. కావున వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ గ్లోబల్ బిజినెస్ హెడ్ Sanjay Bhan (సంజయ్ భాన్) మాట్లాడుతూ, కంపెనీ యొక్క ఉనికిని విస్తరించడంతో గల్ఫ్ ప్రాంతం చాలా ముఖ్యమైన భాగం అన్నారు, అంతే కాకుండా, మా కస్టమర్లకు ఉత్తమమైన ఉత్పత్తులను అందించడం మాత్రమే కాకుండా, ఉత్తమమైన సర్వీస్ వంటివి కూడా అందించడం మా లక్ష్యం. అమ్మకాల తరువాత కూడా కస్టమర్లకు మేము మెరుగైన సర్వీస్ అందిస్తాము అన్నారు.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త షోరూమ్ నుంచి అప్పుడే డెలివరీ కూడా ప్రారంభించింది. ఈ షోరూమ్ నుంచి ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లకు ప్రాధాన్య భాగస్వామి అయిన SS డెలివరీ సర్వీసెస్ LLCకి అందజేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

2018లో ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన హీరో మోటోకార్ప్, దాని అఫ్రివెంచర్స్ ఎఫ్‌జెడ్‌ఈతో పాటు తన మోటార్ సైకిల్స్ యొక్క అమ్మకాలను గల్ఫ్ దేశాల్లో మరింత పెంచడానికి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్త షోరూమ్ ప్రారంభించబడింది.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

Hero MotoCorp కంపెనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఖతార్ మరియు సౌదీ అరేబియా వంటి ఐదు దేశాలలో ఆరు డీలర్‌షిప్‌లు మరియు సర్వీస్ సెంటర్‌లతో పాటు నాలుగు స్పేర్ పార్ట్ అవుట్‌లెట్‌లతో సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న 10 టచ్ పాయింట్‌ల నెట్‌వర్క్ ద్వారా కంపెనీ ఈ ప్రాంతంలోని తన కస్టమర్ల అవసరాలను తీరుస్తుంది.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

ఈ ప్రాంతంలో హీరో మోటోకార్ప్ యొక్క సమగ్ర ఉత్పత్తి శ్రేణిలో Igniter 125, Hunk 150, ECO 150 cargo మరియు ECO 150 తో సహా ఎంట్రీ నుండి ప్రీమియం స్థాయిల వరకు అన్ని మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

అంతే కాకుండా కంపెనీ తన ఇతర ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఉత్పత్తులైన Xpulse 200, Hunk 160R మోటార్‌సైకిళ్లు మరియు సమీప భవిష్యత్తులో అత్యంత ప్రజాదరణ పొందిన కొత్త స్కూటర్ల శ్రేణిని కూడా ఇక్కడ విడుదల చేయాలని యోచిస్తోంది. కావున ఇప్పుడు ఈ కొత్త షోరూమ్ లో ఆధునిక మరియు అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

Hero MotoCorp (హీరో మోటోకార్ప్) ఇప్పుడు అఫ్రివెంచర్‌లతో పాటు, ఫ్రీ సర్వీస్ క్యాంప్, కస్టమర్ మీట్ & గ్రీట్ సెషన్‌లు, రీజియన్‌లోని సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇవ్వడం మరియు బలమైన ఆఫ్టర్‌సేల్స్ మద్దతును అందించడం వంటి వివిధ కార్యక్రమాల ద్వారా గల్ఫ్ దేశాలలో కస్టమర్ ఆనందాన్ని నిర్ధారించడంలో నిమగ్నమై ఉంది. ఇవన్నీ కూడా కస్టమర్ల సంఖ్యను పెంచుతుంది, తద్వారా కమపేని యొక్క అమ్మకాలు ప్రపంచ స్థాయిలో ముందుకు సాగుతాయి.

దుబాయ్‌లో డీలర్‌షిప్‌ ప్రారంభించిన Hero MotoCorp: పూర్తి వివరాలు

Hero MotoCorp (హీరో మోటోకార్ప్) 2021 సెప్టెంబర్ నెలలో విక్రయించిన వాహనాల జాబితాకు సంబందించిన నివేదికలను ఇటీవల విడుదల చేసింది. కంపెనీ నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 2021 లో మొత్తం 5,30,346 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. హీరో మోటోకార్ప్ యొక్క సెప్టెంబర్ సేల్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Hero motocorp inaugurated exclusive showroom in dubai details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X