Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

భారతదేశపు అగ్రగామి మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ స్ప్లెండర్ (Splendor) ధరలను మరోసారి పెంచింది. దీంతో హీరో స్ప్లెండర్ సిరీస్ లోని అన్ని మోడళ్లు ధరలు పెరిగాయి. పెరిగిన కొత్త ధరలు సెప్టెంబర్ 20 నుండే అన్ని డీలర్‌షిప్‌లలో అమల్లోకి వచ్చాయి.

Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

గడచిన కొన్ని నెలలుగా ముడిసరుకుల మరియు స్టీల్ ధరలు పెరిగిన కారణంగా ఉత్పత్తుల ధరలను పెంచక తప్పడం లేదని హీరో మోటోకార్ప్ తెలిపింది. తయారీపై పడుతున్న ఈ అదనపు వ్యయ భారాన్ని తగ్గించడానికి ఉత్పత్తి ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. అయితే, కస్టమర్లను పెద్దగా ప్రభావితం చేయకుండా ఉండేలా ఈ ధరలను సవరించినట్లు కంపెనీ తెలిపింది.

Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

హీరో స్ప్లెండర్ (Hero Splendor) సిరీస్ లో మోడల్ ని బట్టి ధరలు రూ. 1100 నుండి రూ. 1700 మధ్యలో పెరిగాయి. హీరో మోటోకార్ప్ నుండి బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన స్ప్లెండర్ ప్లస్, సెల్ఫ్ / డ్రమ్ / అల్లాయ్ వేరియంట్ ధర రూ. 1100 మేర పెరిగింది. అలాగే, హీరో స్ప్లెండర్ ప్లస్ ఐ 3 ఎస్ వేరియంట్ ధర రూ. 1150 మేర పెరిగింది.

Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ డ్రమ్ / అల్లాయ్ వేరియంట్ ధర రూ. 1,000 మేర పెరగగా, హీరో సూపర్ స్ప్లెండర్ డ్రమ్ / అల్లాయ్ వేరియంట్ ధర రూ. 1300 మరియు హీరో సూపర్ స్ప్లెండర్ డిస్క్ / అల్లాయ్ వేరియంట్ ధర రూ. 1700 మేర పెరిగాయి.

Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

హీరో స్ప్లెండర్ (Hero Splendor) బైక్ రేంజ్ యొక్క కొత్త (ఎక్స్-షోరూమ్) ధరలు ఇలా ఉన్నాయి:

హీరో స్ప్లెండర్ ప్లస్ కిక్ / డ్రమ్ / అల్లాయ్ : రూ. 64,850 (పాత ధర : రూ. 64,850)

హీరో స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్ / డ్రమ్ / అల్లాయ్ : రూ. 67,160 (పాత ధర : రూ. 66,050)

హీరో స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్ / డ్రమ్ / అల్లాయ్ / ఐ 3 ఎస్ : రూ. 68,360 (పాత ధర : రూ. 67,210)

హీరో స్ప్లెండర్ ప్లస్ 100 మిలియన్ ఎడిషన్ : రూ. 70,710 (పాత ధర : రూ. 70,710)

హీరో స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ యాక్సెంట్ సెల్ఫ్ / డ్రమ్ / అల్లాయ్ : రూ 68,860 (పాత ధర : రూ. 67,260)

హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ డ్రమ్ / అల్లాయ్ : రూ. 69,650 (పాత ధర: రూ. 68,650)

హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ డిస్క్ / అల్లాయ్ : రూ. 72,350 (పాత ధర : రూ. 72,350)

హీరో సూపర్ స్ప్లెండర్ డ్రమ్ / అల్లాయ్ : రూ. 73,900 (పాత ధర : రూ. 72,600)

హీరో సూపర్ స్ప్లెండర్ డిస్క్ / అల్లాయ్ : రూ .77,600 (పాత ధర : రూ. 75,900)

Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ఆరంభంలో, స్ప్లెండర్ ప్లస్ లో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ మోడల్ తో పోల్చుకుంటే, ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ లో కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి. మెకానికల్ గా ఎలాంటి మార్పులు ఉండవు.

Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హీరో స్ప్లెండర్ బైక్ లో 97.2 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.9 బిహెచ్‌పి పవర్ ను మరియు 8.05 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

హీరో మోటోకార్ప్ ప్రవేశపెట్టిన 100 మిలియన్ ఎడిషన్లలో స్ప్లెండర్ శ్రేణికి అదనంగా ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ మరియు ప్యాషన్ ప్రో మోడళ్లు కూడా ఉన్నాయి. అలాగే, స్పెషల్ ఎడిషన్ స్కూటర్ రేంజ్‌ లో హీరో ప్లెజర్, డెస్టినీ 125, మాస్ట్రో ఎడ్జ్ 110 మోడళ్లు కూడా ఉన్నాయి.

Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

హీరో ప్యాషన్ ప్రో విషయానికి వస్తే, స్ప్లెండర్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఇది. ఇందులో 113 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 9 బిహెచ్‌పి పవర్ ను మరియు 9.89 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ తమ బిఎస్-6 మోడళ్లలో మెరుగైన మైలేజ్ కోసం ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది.

Splendor మోటార్‌సైకిళ్ల ధరలను పెంచిన Hero MotoCorp; కొత్త ధరలు

హీరో మోటోకార్ప్ నుండి త్వరలో రానున్న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

ఇదిలా ఉంటే, హీరో మోటోకార్ప్‌ వచ్చే ఏడాది మార్చ్ నెల నాటికి, దేశీయ మార్కెట్లో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా సరికొత్త డిజైన్ మరియు లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. - దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Hero motocorp increases splendor range prices new price list details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X