హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

భారతదేశపు అగ్రగామి టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా వాట్సాప్ ద్వారా ఆఫ్టర్ సేల్స్ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇకపై తమ కస్టమర్లు ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ సాయంతో సర్వీస్‌కు సంబంధించిన సేవలు పొందవచ్చని పేర్కొంది.

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

హీరో మోటోకార్ప్ తమ కస్టమర్లకు రియల్ టైమ్ సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. వాట్సాప్ సాయంతో హీరో కస్టమర్లు తమ వాహనాల కోసం సర్వీస్ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చు.

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

అంతేకాకుండా, దీని సాయంతో మరమ్మత్తులో ఉన్న వాహనం యొక్క రియల్ టైమ్ స్టేటస్‌ను చెక్ చేయటం, సమీపంలో ఉన్న వర్క్‌షాప్‌లను మరియు షోరూమ్‌లను గుర్తించడం, జాబ్ కార్డ్‌ను స్వయంగా జనరేట్ చేయటం, డిజిటల్ సేల్స్ మరియు సర్వీస్ కాపీని పొందడం మరియు సర్వీస్ అనంతరం ఫీడ్‌బ్యాక్‌ను పంపడం మొదలైనవి చేయవచ్చు.

MOST READ:మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

హీరో మోటోకార్ప్ కొత్తగా ప్రవేశపెట్టే సరికొత్త మోడళ్లు, లేటెస్ట్ టెలివిజన్ యాడ్స్, గుడ్ లైఫ్ ప్రోగ్రామ్, హీరో యాప్, సేఫ్టీ టిప్స్ మరియు మెయింటెనెన్స్ వీడియోలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కంపెనీ తమ వాట్సాప్ సేవల ద్వారా అందిస్తుంది.

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తిరగబెడుతున్న నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ తమ కస్టమర్లకు కాంటాక్ట్ లెస్ సేవలను అందించే లక్ష్యంలో భాగంగా ఈ వాట్సాప్ ఆఫ్టర్ సేల్స్ సేవలను ప్రారంభించింది. వాట్సాప్ సేవల కోసం హీరో మోటోకార్ప్ ప్రత్యేకంగా +91 83677 96950 ఫోన్ నెంబరుపై అందుబాటులో ఉంటుంది.

MOST READ:భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

డిజిటల్ అవగాహన ఉన్న కస్టమర్లు ఇప్పుడు వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో 24x7 అందుబాటులో ఉండే మరియు సులువుగా యాక్సెస్ చేయగలిగే మెను-ఆధారిత చాట్‌బాట్ సాయంతో ఈ సేవలను పొందవచ్చు.

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

హీరో మోటోకార్ప్ ఈ కొత్త ప్రణాళిక ద్వారా సమాచార, లావాదేవీ మరియు స్థాన (లొకేషన్) ఆధారిత సేవలను అందిస్తోంది. వీటి సాయంతో డిజిటల్ అవగాహన ఉన్న కొత్త తరం వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేని మరియు సులువుగా యాక్సెస్ చేయగల సేవలు పొందుతారని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది.

MOST READ:చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

ఈ విషయం గురించి హీరో మోటోకార్ప్ సేల్స్ అండ్ ఆఫ్టర్ సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ.. తమ కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ మరియు సులువుగా యాక్సెస్ చేయగల సేల్స్ అండ్ సర్వీస్ సదుపాయాలను అందించే లక్ష్యంలో భాగంగా ఈ వాట్సాప్ సపోర్ట్ సేవలను ప్రారంభించామని అన్నారు.

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

ఈ కొత్త డిజిటల్ చొరవతో, తమ కస్టమర్లకు మరియు కంపెనీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలోపేతం అవుతుందని, అదే సమయంలో కస్టమర్లు తమ వేలికొనలతో ఎలాంటి ఇబ్బందులు లేని, సమయానుసారమైన మరియు సమర్థవంతమైన సేవా పరిష్కారాలను పొందవచ్చని ఆయన చెప్పారు.

MOST READ:ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

ఈ ఫీచర్‌ను యాక్సెస్ చెయ్యడానికి, కస్టమర్లు అన్ని హీరో మోటోకార్ప్ కస్టమర్ టచ్ పాయింట్లలో లభించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కస్టమర్లు ఏ సమయంలోనైనా వాట్సాప్‌లో తమ సంభాషణను ప్రారంభించవచ్చు మరియు అందుబాటులో ఉండే వివిధ రకాల సేవలను పొందవచ్చు.

హీరో మోటోకార్ప్ వాట్సాప్ సేవలు ప్రారంభం; ఎలా ఉపయోగించాలంటే..?

ఇదిలా ఉంటే, హీరో మోటోకార్ప్ తాజాగా దేశంలో అత్యంత సరసమైన మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హీరో హెచ్‌ఎఫ్ 100 పేరుతో విడుదలైన ఈ మోటార్‌సైకిల్ ధర కేవలం రూ.49,400 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. - దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Hero Motocorp Launches WhatsApp Service For After Sales Service, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X