రూ.2500 పెరగనున్న హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు

ఏప్రిల్ 2021 నెల నుండి వాహన తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా, భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ కూడా వచ్చే నెల నుండి తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

రూ.2500 పెరగనున్న హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు

కొత్త ధరలు ఏప్రిల్ 1, 2021 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలోనే హీరో మోటోకార్ప్ తమ టూవీలర్ల ధరలను పెంచడం ఇది వరుసగా రెండవసారి. జనవరి 2021లో కంపెనీ తమ టూవీలర్ల ధరలను సుమారు రూ.1,500 వరకూ పెంచింది.

రూ.2500 పెరగనున్న హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు

కాగా, ఈసారి రూ.2,500 వరకు ధరల పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. కంపెనీ విక్రయిస్తున్న అన్ని మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లపై ఈ ధరల పెంపు వర్తిస్తుందని, అయితే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఇది భిన్నంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

రూ.2500 పెరగనున్న హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు

ఏయే మోడల్ మీద ఎంత మేర ధరలు పెరుగుతాయనేది వచ్చే నెల ప్రారంభంలో తెలుస్తుంది. పెరిగిన వస్తువుల వ్యయాల ప్రభావాన్ని పాక్షికంగా పూడ్చడానికి ధరల పెరుగుదల అవసరమని, అందుకే ఈ భారాన్ని కస్టమర్లపైకి బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది.

రూ.2500 పెరగనున్న హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు

మార్కెట్లో గత కొంత కాలంగా స్టీల్/ఉక్కు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశంలో ఇప్పటికీ కోవిడ్-19 మహమ్మారి వలన ఏర్పడి సప్లయ్ అంతరాయాలు ఆటోమొబైల్ కంపెనీలు పెద్ద సవాళ్లుగా మారాయి.

MOST READ:నువ్వా నేనా అంటూ జరిగిన 2021 రెడ్ బుల్ ఏస్ రేస్ హైలెట్స్ & ఫలితాలు.. వచ్చేశాయ్

రూ.2500 పెరగనున్న హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు

గత సంవత్సరం ఆటో పరిశ్రమ అనేక సవాళ్లను మరియు సమస్యలను ఎదుర్కుంది. ఏప్రిల్‌-మే నెలల్లోని సంపూర్ణ లాక్‌డౌన్ కారణంగా, ఆటోమొబైల్ కంపెనీలు సున్నా విక్రయాలను చూశాయి, వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి.

రూ.2500 పెరగనున్న హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు

ప్రస్తుతం వాహనాల అమ్మకాలు గతేడాది కన్నా మెరుగ్గానే ఉన్నప్పటికీ, అధిక ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా పెరిగిన ఉత్పాదక వ్యయాన్ని వాహన తయారీదారులు కస్టమర్లపైకి బదిలీ చేస్తున్నారు. ఇటీవలే మారుతి సుజుకి ఇండియా కూడా ఇదే కారణం చెప్పి తమ కార్ల ధరలను ఏప్రిల్ 1వ తేదీ నుండి పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి లగ్జరీ సెడాన్ రివ్యూ.. లేటెస్ట్ ఫీచర్స్ & వివరాలు

రూ.2500 పెరగనున్న హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు

హీరో మోటోకార్ప్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ సరికొత్త డెస్టిని 125 'ప్లాటినం' ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త హీరో డెస్టిని 125 ప్లాటినం వేరియంట్ ధర రూ.72,050 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)గా ఉంది.

రూ.2500 పెరగనున్న హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు

కొత్త హీరో డెస్టిని 125 ప్లాటినం విశిష్టమైన డ్యూయెల్ టోన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని 124.6 సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్ బ్రాండ్ యొక్క ‘ఎక్స్‌సెన్స్ టెక్నాలజీ'తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 9 బిహెచ్‌పి పవర్‌ను మరియు 10.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

Most Read Articles

English summary
Hero MotoCorp To Increase Two-Wheeler Prices Upto Rs 2500 From April. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X