6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

ప్రపంచంలో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డకార్ ర్యాలీలో పాల్గొంటూ ఇందులో తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. అయితే ఇప్పుడు మరో సారి పాల్గొనటానికి కూడా సన్నద్ధమవుతోంది. ఈ కంపెనీ డకార్ ర్యాలీలో పాల్గొనడం ఇది వరుసగా 6 వ సారి.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

ఇప్పుడు 2022 లో జరగబోయే డకార్ ర్యాలీ యొక్క 44 వ అధ్యాయం సౌదీ అరేబియాలోని జెడ్డాలో 2022 జనవరి 1 నుండి 14 వరకు నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీ రేస్ మొత్తం 14 దశల్లో పూర్తవుతుంది, ఇందులో రేసర్లు మొత్తం 8,000 కి.మీ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

2022 లో జరగనున్న ఈ డాకర్ ర్యాలీ యొక్క తదుపరి అధ్యాయంలో, హీరో మోటోకార్ప్ ఇద్దరు రేసర్‌లను రంగంలోకి దింపుతోంది. గత సంవత్సరం రేసును విజయవంతంగా ముగించిన అదే రేసర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఫ్రాంకో కైమీ మరియు జోక్విమ్‌ ఇందులో పాల్గొంటున్నారు. వీరు ఇరువురు హీరో 450 ర్యాలీ బైక్‌ను ఈ రైడింగ్ లో ఉపయోగించనున్నారు.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

హీరో మోటోకార్ప్‌కు డాకర్ ర్యాలీలో ఇప్పటికే ఐదు సంవత్సరాల అనుభవం ఉంది. అయితే ఇప్పుడు జరగనున్న ఈ రేసులో మరింత ప్రత్యేకమైన గుర్తింపును పొందుతుంది. 2021 సంవత్సరం కంపెనీకి చాలా ముఖ్యమైనదిగా మారింది, ఎందుకంటే హీరో వైపు నుండి ఇద్దరు రేసర్లు రేసును విజయవంతంగా ముగించగలిగారు. కావున కంపెనీ యొక్క పేరు ఇందులో నిలిచిపోయింది.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రేసుల్లో డకార్ ర్యాలీ పేరుగాంచింది. ఈ రేసు చాలా కఠినమైనది, చాలామంది రేసర్లు దానిని పూర్తి చేయడంలో విఫలమవుతారు. ఇందులో అనేక సార్లు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు జరిగిన ఈ డాకర్ ర్యాలీలో సీఎస్ సంతోష్ గాయపడిన విషయం తెలిసిందే.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

డాకర్ ర్యాలీ నిబంధనల ప్రకారం, ఈ రేసు మొత్తం వ్యవధిలో రైడర్ ఒంటరిగా ఉంటాడు. అయితే డాకర్ ఆర్గనైజేషన్ అవసరమైన అన్ని పరికరాలు మరియు యాక్ససరీలను డెలివరీ చేయడం ద్వారా రైడర్‌లకు సహాయం చేస్తుంది. ఈ యాక్ససరీస్ లో బైక్ యాక్ససరీస్ మరియు రైడర్ కోసం ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి తప్పా వీరికి ఇతర ఏ సహాయం లభించదు. ఒక వేళా ప్రమాదంలో జరిగితే వెంటనే ఆర్గనైజేషన్ అప్రమత్తమవుతుంది.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

ఈ యాక్ససరీస్ లో ప్రతి పోటీదారునికి స్లీపింగ్ టెంట్, ట్రావెల్ బ్యాగ్ మరియు టైర్ల సెట్ కూడా అందించబడ్డాయి. రైడర్లు తమ ట్రంక్‌లో ర్యాలీకి సంబంధించిన అన్ని విడి భాగాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులను తీసుకెళ్లాలి. అంతే కాకుండా రైడర్లు తమ బైక్‌ల మెయింటెనెన్స్‌ అంతా స్వయంగా చేయాల్సి ఉంటుంది.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

డకార్ ర్యాలీ సౌదీ అరేబియాలో 1979 లో ప్రారంభమైంది. డాకర్ ర్యాలీ యొక్క 43వ అధ్యాయం 3 జనవరి 2021 నుండి 15 జనవరి 2021 వరకు జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రేసర్లు 7,646 కి.మీ ప్రయాణించారు. ఇందులో హీరో మోటోకార్ప్ కూడా తన ప్రతిష్టను నిలుపుకుంది. అయితే ఈసారి జరగనున్న రేసులో కూడా హీరోమోటోకార్ప్ తరఫును పాల్గొనే రేసర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తారని మేము ఆశిస్తున్నాము.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల తన 2021 నవంబర్ అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం, నవంబర్ నెలలో కంపెనీ 3,49,393 ద్విచక్ర వాహనాలను విక్రయించింది, ఇది నవంబర్ 2020లో విక్రయించిన 5,91,091 యూనిట్లతో పోలిస్తే 40.89% క్షీణతను నమోదు చేసింది.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

హీరో మోటోకార్ప్ నెలవారీ అమ్మకాలలో కూడా చాలా తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ 2021 అక్టోబర్ నెలలో 5,47,970 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, 2021 నవంబర్ లో 36.24% క్షీణతను నమోదు చేసింది. కంపెనీ మొత్తం దేశీయ అమ్మకాలు 42.90% తగ్గి 3,28,862 యూనిట్లకు చేరుకున్నాయి.

6 వ డకార్ ర్యాలీకి సిద్దమైన Hero MotoCorp: పూర్తి వివరాలు

ఇక ఎగుమతుల విషయానికి వస్తే, 2021 నవంబర్ లో 20,531 యూనిట్లను విక్రయించి 35.66 శాతం వృద్ధిని నమోదు చేసింది. నవంబర్ 2021లో, మోటార్‌సైకిల్ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 39.20% తగ్గి 3,29,185 యూనిట్లకు చేరుకోగా, స్కూటర్ అమ్మకాలు 59.30% క్షీణించి 20,208 యూనిట్లకు చేరుకున్నాయి.

Most Read Articles

English summary
Hero motocorp to participate in 44th dakar rally with two riders details
Story first published: Saturday, December 11, 2021, 12:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X