Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న బెస్ట్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ హీరో స్ప్లెండర్ (Hero Splendor) అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. నవంబర్ 2020లో కంపెనీ మొత్తం 2,43,398 యూనిట్ల స్ప్లెండర్ మోటార్‌సైకిళ్లను విక్రయించిన గత నవంబర్ 2021లో 1,92,490 యూనిట్ల స్ప్లెండర్ మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఈ సమయంలో హీరో స్ప్లెండర్ అమ్మకాలు 22.51 శాతం వార్షిక క్షీణతను నమోదు చేశాయి.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

అలాగే, గడచిన అక్టోబర్ 2021 నెలలో హీరో మోటోకార్ప్ విక్రయించిన 2,67,8221 యూనిట్ల స్ప్లెండర్ మోటార్‌సైకిళ్లతో పోలిస్తే గత నవంబర్ నెలలో అమ్ముడైన స్ప్లెండర్ అమ్మకాలు డి 28.13 శాతం నెలవారీ క్షీణతను నమోదు చేశాయి. మొత్తంగా, హీరో స్ప్లెండర్ అమ్మకాలు తగ్గముఖం పట్టినప్పటికీ, కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న టూవీలర్ల జాబితాలో ఇది ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరతతో పాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల గత నవంబర్‌లో చాలా ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. హీరో మోటోకార్ప్ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇతర ద్విచక్ర వాహన తయారీదారుల మాదిరిగానే గత నెలలో Hero MotoCorp దేశీయ విక్రయాలు కూడా క్షీణించాయి. హీరో మోటోకార్ప్ గత నెలలో భారత మార్కెట్లో మొత్తం 3,28,817 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది సుమారు 42.91 శాతం తక్కువ.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

నవంబర్ 2020లో హీరో మోటోకార్ప్ మొత్తం 5,75,917 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత నెలలో కంపెనీ ప్రోడక్ట్ లైనప్ లో ఎక్స్‌పల్స్ 200 మినహా మిగిలిన ఇతర మోడళ్లన్నీ కూడా ప్రతికూల ఫలితాలను నమోదు చేశాయి. పంట కోతలు ఆలస్యం కావడం, రుతుపవనాలు ఆలస్యంగా రావడం మరియు గడచిన పండుగ సీజన్‌లో ఆశించిన డిమాండ్ లేకపోవడం వంటి పలు కారణాల వల గత నెలలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదని కంపెనీ పేర్కొంది.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

గత నెలలో హీరో స్ప్లెండర్ మోటార్‌సైకిల్ 1,92,490 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉండగా, 76,149 యూనిట్ల అమ్మకాలతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Delux) ద్వితీయ స్థానంలో నిలిచింది. గత ఈ మోడల్ అమ్మకాలు కూడా భారీగా క్షీణించాయి. నవంబర్ 2020లో మొత్తం 1,79,426 యూనిట్ల హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్‌సైకిళ్లను విక్రయించగా, అవి గత నెలలో 76,149 యూనిట్లకు పడిపోయాయి. ఈ సమయంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అమ్మకాలు భారీగా 57.56 శాతం తగ్గుదలను నమోదు చేశాయి.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

ఇక ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది హీరో గ్లామర్ (Hero Glamour). గత నెలలో హీరో గ్లామర్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 21,901 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇవి 45.11 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. గతేడాది నవంబర్‌లో దాదాపు 40,000 యూనిట్లకు పైగా గ్లామర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. గత కొన్ని నెలలుగా హీరో గ్లామర్ నెలవారీ అమ్మకాలు సగటున 20,000 యూనిట్లకు పడిపోయాయి.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

కాగా, అక్టోబర్‌ 2021లో మాత్రం మొత్తం 25,663 యూనిట్ల గ్లామర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. ఒకప్పుడు హీరో మోటోకార్ప్ నుండి అత్యధికంగా అమ్ముడైన పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ హీరో ప్యాషన్ (Hero Passion) గత నెలలో 12,933 యూనిట్ల విక్రయాలతో ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. అక్టోబర్‌ 2021 నెల అమ్మకాలతో పోలిస్తే, గత నెలలో గణనీయమైన తగ్గుదల లేనప్పటికీ, నవంబర్ 2020లో విక్రయించిన 53,768 యూనిట్ల హీరో ప్యాషన్ బైక్‌లతో పోలిస్తే, ఇది భారీ తగ్గుదలేనని చెప్పవచ్చు.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాలను హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిల్లు దక్కించుకోగా, ఆరవ స్థానాన్ని హీరో స్కూటర్ దక్కించుకుంది. కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ స్కూటర్ హీరో ప్లెజర్ (Hero Pleasure) గత నెలలో 11,136 యూనిట్ల విక్రయాలతో ఆరవ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే హీరో ప్లెజర్ స్కూటర్ విక్రయాలు కూడా సగానికై పైగా తగ్గాయి. అలాగే, హీరో డెస్టినీ 125 మరియు మాస్ట్రో స్కూటర్ల అమ్మకాలు కూడా సగానికి తగ్గాయి. గత నవంబర్‌లో 3,264 యూనిట్ల డెస్టినీ 125 స్కూటర్లు అమ్ముడయ్యాయి.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

ఇక ఈ లిస్ట్ లో 8వ మరియు 9వ స్థానాలలో హీరో ప్రీమియం బైక్‌లు ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మరియు ఎక్స్‌పల్స్ 200 మోడళ్లు ఉన్నాయి. గత నవంబర్‌ 2021 నెలలో ఇవి రెండూ వరుసగా 3,251 యూనిట్లు మరియు 2,303 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. హీరో ఎక్స్‌పల్స్ 200 విక్రయాలు గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 39.63 శాతం తగ్గగా, నవంబర్ 2020 తో పోలిస్తే దాదాపు 67.86 శాతం పెరిగాయి.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

నవంబర్ 2021లో హీరో మోటోకార్ప్ దేశీయ అమ్మకాలు క్షీణించినప్పటికీ, ఎగుమతులు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. నవంబర్ 2020లో 15,134 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు నవంబర్ 2021 నాటికి 20,531 యూనిట్లకు పెరిగి 35.66 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అలాగే, అక్టోబర్ 2021లో ఎగుమతి చేసిన 20,191 యూనిట్లతో పోలిస్తే, గత నెల ఎగుమతులు 1.68 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Hero Splendor బైక్‌కి తగ్గుతున్న ఆదరణ, నవంబర్‌లో భారీగా తగ్గిన సేల్స్!

గత నెలలో హీరో స్ప్లెండర్ ఎగుమతులు కూడా క్షీణించాయి. ఈ సమయంలో స్ప్లెండర్ ఎగుమతులు 24.62 శాతం తగ్గి 3,120 యూనిట్లకు పడిపోయాయి. కాగా, హీరో గ్లామర్ ఎగుమతులు మాత్రం 154.52 శాతం పెరిగి 1,66 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ సమయంలో హీరో ఎక్స్‌పల్స్ 200 ఎగుమతులు 1,255 యూనిట్లు, హీరో మాస్ట్రో స్కూటర్ ఎగుమతులు 338 యూనిట్లు మరియు డెస్టినీ 125 స్కూటర్ ఎగుమతులు 80 యూనిట్లగా నమోదయ్యాయి.

Most Read Articles

English summary
Hero splendor sales decreasing but still leads the list hero motocorp november 2021 sales breakup
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X