Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 23 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Sports
RCB vs KKR: జోరుమీదున్న బెంగళూరు హిట్టర్! కోల్‌కతాను కలవరపెడుతున్న ఆ ఇద్దరి ఫామ్! విజయం ఎవరిది!
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వావ్ అమేజింగ్.. ఒక్క స్కూటర్ బ్రాండ్, 2.5 కోట్ల మంది కస్టమర్స్
భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్ చరిత్రను తిరగరాసిన మోడల్ హోండా యాక్టివా. ఈ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలై సుమారు రెండు దశాబ్ధాలు పూర్తి కావస్తోంది. గడచిన 20 ఏళ్లలో హోండా యాక్టివా భారతదేశంలో 2.5 కోట్ల మంది కస్టమర్లకు చేరువైంది.

హోండా యాక్టివా స్కూటర్ బ్రాండ్ 25 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో, భారత ఆటోమొబైల్స్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా అవతరించిందని హోండా టూ-వీలర్స్ ఇండియా ప్రకటించింది. స్కూటర్లకు ఆదరణ అంతంత మాత్రం ఉన్నరోజుల్లో యాక్టివా మార్కెట్లోకి ప్రవేశించింది.

హోండా యాక్టివాను తొలిసారిగా 2001లో విడుదల చేశారు. ఆ తర్వాత మొదటి ఐదేళ్లలోనే ఈ స్కూటర్ 10 లక్షల (1 మిలియన్) యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. మొదట్లో ఈ స్కూటర్ 102సీసీ ఇంజన్‌తో విడుదలైంది. 2004-05 సంవత్సరంలో కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన 110సీసీ ఇంజన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.
MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఈ సెకండ్ జనరేషన్ హోండా యాక్టివా స్కూటర్‌లో తొలిసారిగా కాంబీ బ్రేక్ సిస్టమ్‌ను పరిచయం చేశారు. ఈ ఫీచర్ వలన ఏ బ్రేక్ లివర్ ప్రెస్ చేసినా రెండు (ముందు, వెనుక) బ్రేకులు ఒకేసారి పనిచేసి, మెరుగైన బ్రేకింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఆ తర్వాత్ 2014-15 ప్రాంతంలో హోండా ఈకో టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను మరియు ఇందులో చిన్న స్కూటర్‌హా 'యాక్టివా ఐ' మోడల్‌ను హోండా ప్రవేశపెట్టింది. ఈ మార్పుల వలన యాక్టివా బ్రాండ్ సేల్స్ మరింత పెరిగాయి.
MOST READ:అద్భుతంగా ఉన్న మలయాళీ స్టార్ మమ్ముట్టి లగ్జరీ కారవాన్.. చూసారా !

గత 2015 సంవత్సరం పూర్తయ్యే నాటికి హోండా యాక్టివా బ్రాండ్ భారత మార్కెట్లో 15 వసంతాలను పూర్తి చేసుకుంది. అప్పటికే ఈ బ్రాండ్ అమ్మకాలు 1 కోటి మార్కును చేరుకున్నాయి. కాగా, అనూహ్యంగా గత ఐదేళ్లలో మునుపెన్నడూ లేనంగా ఈ స్కూటర్ అమ్మకాలు జరిగాయి.

కేవలం ఐదేళ్లలోనే (2016-2020 సమయంలో) హోండా అదనంగా 1.5 కోట్ల మంది కొత్త కస్టమర్లను ఆకర్షించింది. దీంతో మొత్తంగా గత 20 ఏళ్ల కాలానికి గానూ హోండా యాక్టివా 2.5 కోట్ల అమ్మకాల మైలురాయిని చేరుకోగలిగింది.
MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు

హోండా 2014లో 125సీసీ ఇంజన్‌తో కూడిన యాక్టివా స్కూటర్‌ను విడుదల చేసింది. దేశంలో అప్పుడదే మొట్టమదటి 125సీసీ ఇంజన్ కలిగిన స్కూటర్. ఈ మోడల్‌ను హోండా యాక్టివా 3జి (థర్డ్ జనరేషన్) పేరుతో సరికొత్త డిజైన్‌తో విడుదల చేశారు. ఈ మోడల్ ఎక్కువ కస్టమర్లను ఆకర్షించింది.

హోండా యాక్టివా స్కూటర్ అమ్మకాలు ఎంతలా పెరిగాయంటే, గత 2015లో ఇది హీరో మోటోకార్ప్ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్‌సైకిల్ అమ్మకాలను సైతం అధిగమించేంతలా పెరిగాయి. అప్పట్లో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా మరియు స్కూటర్‌గా సంచలనం సృష్టించింది.

ఇటీవలి కాలంలో భారతదేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనలు అమల్లోకి రావడంతో 2019లో కంపెనీ యాక్టివా 6జి పేరుతో ఆరవ తరం యాక్టివా 125 స్కూటర్‌ను అప్‌గ్రేడెడ్ ఇంజన్‌తో మార్కెట్లో విడుదల చేసింది. ఇదే సమయంలో ఈ స్కూటర్‌లో అనేక కొత్త ఫీచర్లను కూడా జోడించారు.

ఇందులోని కొత్త బిఎస్6 ఇంజన్ మెరుగైన మైలేజ్‌ను ఆఫర్ చేయడమే కాకుండా మంచి పనితీరును కూడా అందిస్తుంది. ఈ స్కూటర్‌లో తొలిసారిగా సైలెంట్ ఏసిజి స్టార్టర్‌ను ఉపయోగించారు. ఇది మునుపటి క్రాంకింగ్ స్టార్టర్ మోటార్ మాదిరిగా కాకుండా చాలా సైలెంట్‌గా స్కూటర్ స్టార్ట్ అయ్యేందుకు సహకరిస్తుంది.

ఇంకా ఇందులో ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కూడా పరిచయం చేశారు. ఇంజన్ కొంత సమయం పాటు ఆన్‌లో ఉండి, ఎలాంటి కదలిక లేకపోయినట్లయితే ఇది గుర్తించి, ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ అయ్యేలా చేస్తుంది. ఆ వెంటనే యాక్సిలరేటర్‌ను తిప్పగానే ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆన్ అవుతుంది. ఈ ఫీచర్ ఇంధనాన్ని ఆదా చేసి, మైలేజ్‌ను పెంచడంలో సహకరిస్తుంది.