భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఎట్టకేలకు భారత మార్కెట్లో కొత్త 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 బైక్ విడుదల చేసింది. ఈ కొత్త హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 ధర రూ. 37.20 లక్షలు. 2021 హోండా గోల్డ్ వింగ్ సింగిల్ ఫుల్-లోడెడ్ టూర్ వేరియంట్లో విడుదల చేయబడింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

2021 హోండా గోల్డ్ వింగ్ సింగిల్ టూర్ వేరియంట్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ అనే రెండు గేర్‌బాక్స్ ఆప్సన్లో అందించబడుతుంది. మాన్యువల్ వేరియంట్ ధర రూ. 37.20 లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ధర రూ. 39.16 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

ఈ కొత్త మోటారుసైకిల్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా బ్రాండ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అయితే దీని డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఈ బైక్ కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా భారతదేశానికి దిగుమతి కానుంది. కావున ఇది పరిమిత సంఖ్యంలో మాత్రమే దిగుమతి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

కంపెనీ ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను దేశంలోని బ్రాండ్ యొక్క ప్రీమియం బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో విక్రయించనుంది. ఈ బైక్ పెర్ల్ గ్రెల్ వైట్ మరియు గన్‌మెటల్ బ్లాక్ మెటాలిక్ / మాట్ మోరియన్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. మునుపటి గోల్డ్ వింగ్ మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2021 గోల్డ్ వింగ్ మోడల్ లో పెద్దగా మార్పులు లేవు. చూడటానికి దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

కానీ ఈ కొత్త బైక్ లో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మంచి ఆడియో క్వాలిటీ కోసం కొత్త 45-వాట్స్ స్పీకర్లు, టాప్-బాక్స్‌లో అడిషినల్ 11-లీటర్ స్టోరేజ్, పునః రూపకల్పన చేసిన పిలియన్ సీటు, స్వెడ్ సీట్ కవర్లు వంటివి ఉన్నాయి.

భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

హోండా గోల్డ్ వింగ్ బైక్ ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యంత లగ్జరీ మోటార్ సైకిల్స్ విభాగంలో ఒకటిగా ఉంటుంది. ఈ మోటారుసైకిల్ లో 1695 మిమీ లాంగ్-వీల్ బేస్ కలిగి ఉంది. అంతే కాకుండా ఈ బైక్ యొక్క డ్యూయల్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లతో ఆకర్షణీయమైన ఫ్రంట్ ఎండ్ స్టైలింగ్ ద్వారా కొంత విభిన్నంగా ఉంటుంది.

భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

2021 గోల్డ్ వింగ్ బైక్ 7.0 ఇంచెస్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, మీడియా స్క్రీన్‌కు ఇరువైపులా అనలాగ్ డయల్స్ మరియు మరో మూడు చిన్న స్క్రీన్లు, 121-లీటర్ స్టోరేజ్ స్పేస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, రివర్స్ గేర్ మరియు హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

ఇందులో ఇవి మాత్రమే కాకూండా స్మార్ట్ కీలు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, ఆన్-బోర్డ్ నావిగేషన్ విత్ గైరోకాంపాస్, ప్యాసింజర్ ఆడియో కంట్రోల్ స్విచ్ మరియు 21.1-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ లభిస్తుంది. ఈ బైక్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది.

భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

2021 గోల్డ్ వింగ్ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది ఫ్లాట్-సిక్స్ లిక్విడ్-కూల్డ్ 1833 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 125 బిహెచ్‌పి పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్ 6 విడుదల; ధర రూ. 37.20 లక్షలు

హోండా మోటార్ సైకిల్ కంపెనీ తన బిఎస్ 6 అవతార్‌లో తన ప్రధాన మోటార్‌సైకిల్‌ అయినా గోల్డ్ వింగ్ ని భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రీమియం క్రూయిజర్ మోటార్ సైకిల్స్ లో జపనీస్ బ్రాండ్ అయిన హోండా గోల్డ్ వింగ్ కూడా ఒకటిగా ఉంది. హోండా గోల్డ్ వింగ్ బైక్ ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ డార్క్ హార్స్, హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ గ్లైడ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Honda Gold Wing BS6 Launched In India. Read in Telugu.
Story first published: Wednesday, June 16, 2021, 15:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X