లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన సంస్థగా ప్రసిద్ధి చెందిన హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా ఇటీవల తన షైన్ బైక్ ధరను పెంచినట్లు తెలిపింది. భారతదేశంలో బ్రాండ్ యొక్క అత్యధిక అమ్మకాలు కలిగిన వాటిలో హోండా షైన్ ఒకటి. అయితే కంపెనీ గత రెండు నెలల్లో ఏకంగా దీని ధరను రెండుసార్లు పెంచింది.

లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

భారతీయ మార్కెట్లో హోండా షైన్ బైక్‌, డ్రమ్ బ్రేక్‌ మరియు డిస్క్ బ్రేక్‌ అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ వీటి ధరలను పెంచడం వల్ల హోండా షైన్ యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 71,550 మరియు డిస్క్ వేరియంట్ ధర రూ. 76,346 కు చేరింది. ఈ ధరలు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రకారం నిర్ణయించడం జరిగింది.

లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

ఈ బైకులతో ఒక్క ధర పెరుగుదల తప్ప, ఇందులో ఎటువంటి మార్పు జరగలేదు. కావున ఇందులో అవే ఫీచర్స్ మరియు అవే పరికరాలు ఉంటాయి. ఇప్పటికే చాలా కంపెనీలు కూడా తమ వాహనాల ధరలు పెంచినట్లు ఇది వరకే ప్రకటించాయన్న సంగతి తెలిసిందే.

MOST READ:మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

హోండా మోటార్ సైకిల్ కంపెనీ ఇటీవల తన షైన్ బైక్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కొత్త షైన్ బైక్ కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులకు దీనిపై ఇప్పుడు 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. కానీ దీనికి నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి. కొనుగోలుదారులు దీనిని గమనించాలి.

లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

హోండా అందిస్తున్న ఈ ఆఫర్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇఎంఐ లావాదేవీలకు మాత్రమే చెల్లుతుంది. దీనితో పాటు కనీస లావాదేవీ విలువ రూ. 40,000 వరకు ఉండాలి అని హోండా తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ జూన్ చివరి వరకు అందుబాటులో ఉంటుంది.

కావున కస్టమర్లు దీనిని వినియోగించుకోవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్ షిప్ ని సందర్శించి తెలుసుకోవచ్చు.

MOST READ:మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

ఇండియన్ మార్కెట్లో హోండా షైన్ ప్రారంభించినప్పటి నుండి దాదాపు 90 లక్షల యూనిట్లకుపైగా అమ్మినట్లు కంపెనీ తెలిపింది. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్యాసింజర్ బైకులలో హోండా షైన్ ఒకటి. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది కావున, ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ బైక్ ఎంచుకుంటారు.

లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

ఈ హోండా షైన్ బైక్‌లో 124 సిసి, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజిన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.7 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

MOST READ:తండ్రికి నచ్చిన బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

హోండా షైన్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ మరియు వెనుక హైడ్రాలిక్ యూనిట్ సస్పెన్షన్ సెటప్ ఉంది. ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ముందు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. దీనితో 240 మిమీ డిస్క్ బ్రేక్ ఆప్షన్ ముందు భాగంలో ఇవ్వబడుతుంది.

లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా నివేదికల ప్రకారం మే 2021 లో 58,168 ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం హోండా షైన్ బైక్ ధర పెరగడం వల్ల అమ్మకాలు ఏ విధంగా ఉంటాయి. ఇది కంపెనీ పై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

Most Read Articles

English summary
Honda Shine BS6 Prices Hiked. Read in Telugu.
Story first published: Saturday, June 5, 2021, 10:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X