ఇప్పుడు హోండా బీట్ & బీట్ స్ట్రీట్ స్కూటర్స్ మరింత కొత్తగా..!!

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇటీవల ఇండోనేషియా మార్కెట్లో రెండు కొత్త స్కూటర్లను విడుదల చేసింది. ఇండోనేషియాలో విడుదలైన ఈ స్కూటర్స్ లో ఒకటి బీట్ కాగా మరొకటి బీట్ స్ట్రీట్. ఈ రెండు స్కూటర్లు కూడా ఇప్పుడు మునుపటికంటే ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ స్కూటర్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇప్పుడు హోండా బీట్ & బీట్ స్ట్రీట్ స్కూటర్స్ మరింత కొత్తగా..!!

హోండా మోటార్ సైకిల్ కంపెనీ విడుదల చేసిన ఈ స్కూటర్స్ లో మెకానికల్ విభాగానికి సంబంధించిన ఎటువంటి మార్పులు జరగలేదు. హోండా బీట్ స్కూటర్ మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి డీలక్స్, సిబిఎస్-ఐఎస్ఎస్ మరియు సిబిఎస్ సిరీస్ వేరియంట్లు. అయితే బీట్ స్ట్రీట్ స్కూటర్ మాత్రం స్టాండర్డ్ వేరియంట్లో లభిస్తుంది.

ఇప్పుడు హోండా బీట్ & బీట్ స్ట్రీట్ స్కూటర్స్ మరింత కొత్తగా..!!

ఈ కొత్త స్కూటర్లు కొత్త అప్డేటెడ్ కాస్మొటిక్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మునుపటికంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. హోండా బీట్ సిబిఎస్ సిరీస్ వేరియంట్‌ టెక్నో బ్లూ బ్లాక్ మరియు డాన్స్ వైట్ బ్లాక్ అనే రెండు కొత్త కలర్ ఆప్సన్ లో అందుబాటులోకి వచ్చింది.

ఇప్పుడు హోండా బీట్ & బీట్ స్ట్రీట్ స్కూటర్స్ మరింత కొత్తగా..!!

హోండా సిబిఎస్-ఐఎస్ఎస్ వేరియంట్ కూడా రెండు కొత్త కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి గ్యారేజ్ మాట్టే బ్లాక్ మరియు ఎలక్ట్రో మాట్టే బ్లూ కలర్స్. ఇక మూడవ వేరియంట్ సిబిఎస్ సిరీస్ విషయానికి వస్తే డీలక్స్ బ్రౌన్ మరియు డీలక్స్ బ్లూ అనే కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 3 డి లోగో కొత్త కలర్ ఆప్సన్ తో అందించబడుతుంది.

ఇప్పుడు హోండా బీట్ & బీట్ స్ట్రీట్ స్కూటర్స్ మరింత కొత్తగా..!!

హోండా బీట్ స్ట్రీట్ స్కూటర్ స్ట్రీట్ బ్లాక్ మరియు స్ట్రీట్ సిల్వర్ అనే రెండు ఆప్సన్స్ లో వస్తుంది. హోండా బీట్ మరియు బీట్ స్ట్రీట్ స్కూటర్లలో 110 సిసి పిజిఎం-ఎఫ్ఐ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.85 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.3 ఎన్ఎమ్‌ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇప్పుడు హోండా బీట్ & బీట్ స్ట్రీట్ స్కూటర్స్ మరింత కొత్తగా..!!

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ భారతీయ మార్కెట్లో కొత్త అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడించలేదు. కానీ ఇది హోండా హార్నెట్ 2.0 బేస్డ్ అడ్వెంచర్ బైక్ కావచ్చు.

ఇప్పుడు హోండా బీట్ & బీట్ స్ట్రీట్ స్కూటర్స్ మరింత కొత్తగా..!!

ఈ ఏడాది ఏప్రిల్‌లో హోండా ట్రేడ్‌మార్క్ ఎన్‌ఎక్స్ 200 ను దాఖలు చేసింది. కొత్త హోండా ఎన్ఎక్స్ 200 బైక్ రూపకల్పన మరియు స్టైలింగ్ హోండా సిఎక్స్-02 కాన్సెప్ట్ మరియు సిబిఎఫ్-190 ఆర్ మాదిరిగానే ఉండవచ్చు. ఈ హోండా అడ్వెంచర్ బైక్ వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పుడు హోండా బీట్ & బీట్ స్ట్రీట్ స్కూటర్స్ మరింత కొత్తగా..!!

కొత్త హోండా మోటార్ సైకిల్ తన బీట్ మరియు బీట్ స్ట్రీట్ స్కూటర్లను ఇండోనేషియా మార్కెట్లో అప్డేట్ చేసి, విడుదల చేసింది. ఈ స్కూటర్లను కంపెనీ త్వరలో ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయనుంది. కానీ ఈ స్కూటర్లు భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం లేదు.

Most Read Articles

English summary
Honda Beat And Beat Street Updated For The Indonesian Market. Read in Telugu.
Story first published: Monday, July 19, 2021, 13:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X