జూన్ 2021 లో పెరిగిన హోండా మోటార్‌సైకిల్ సేల్స్; పూర్తి వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ ఇండియా' తన 2021 జూన్ అమ్మకాల నివేదికను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ అమ్మకాల గణాంకాల ప్రకారం, మొత్తం 2,34,029 ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. ఇదే విధంగా గత ఏడాది మార్కెట్లో విక్రయించిన మొత్తం అమ్మకాలు 2,10,879 అని గత నివేదికల ద్వారా తెలిసింది.

జూన్ 2021 లో పెరిగిన హోండా మోటార్‌సైకిల్ సేల్స్; పూర్తి వివరాలు

హోండా మోటార్‌సైకిల్ అమ్మకాలు మునుపటి ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు దాదాపు 11 శాతం పెరిగాయి. మొత్తం కంపెనీ అమ్మిన 2,34,029 యూనిట్లలో 2,12,446 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించినట్లు తెలిసింది. మిగిలిన 21,583 యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయినట్లు కూడా నివేదికల ద్వారా తెలిసింది.

జూన్ 2021 లో పెరిగిన హోండా మోటార్‌సైకిల్ సేల్స్; పూర్తి వివరాలు

2020 జూన్ నెలలో హోండా మోటార్ సైకిల్స్ దేశీయ మార్కెట్లో 2,02,837 యూనిట్ల వాహనాలను విక్రయించగా, 8,042 యూనిట్ల వాహనాలను విదేశీ మార్కెట్ కి ఎగుమతి చేశాయి. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా డీలర్ నెట్‌వర్క్‌లు క్రమంగా ఓపెన్ చేయడం వల్ల 2021 జూన్ నెలలో ద్విచక్ర వాహనాల డిమాండ్‌ బాగా కొంత పెరుగుదల దిశగా వెళ్తోంది.

జూన్ 2021 లో పెరిగిన హోండా మోటార్‌సైకిల్ సేల్స్; పూర్తి వివరాలు

కంపెనీ అమ్మకాల గురించి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డీలర్షిప్ లు 95 శాతం వరకు ప్రారంభించబడ్డాయి. అదేవిధంగా కంపెనీ అమ్మకాలను పెంచడానికి మరియు ఉత్పత్తిని మరింత వేగవంతం చేయడానికి, మొత్తం 4 ప్లాంట్లలో క్రమంగా కార్యకలాపాలను పెంచుతున్నారు.

జూన్ 2021 లో పెరిగిన హోండా మోటార్‌సైకిల్ సేల్స్; పూర్తి వివరాలు

2021 జూన్ నెలలో మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల క్రమంగా ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో చాలామంది వినియోగదారులు డీలర్‌షిప్‌లను సందర్శించి వాహనాల గురించి పూర్తి సమాచారాన్ని పొందుతున్నారు. అంతే కాకుండా కంపెనీ ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

జూన్ 2021 లో పెరిగిన హోండా మోటార్‌సైకిల్ సేల్స్; పూర్తి వివరాలు

హోండా మోటార్ సైకిల్స్ కంపెనీ ఇటీవల, తన 2021 సిబి650ఆర్ మరియు సిబిఆర్650ఆర్ డెలివరీని ప్రారంభించింది. ఈ బైక్‌లలో 15 యూనిట్లను కంపెనీ పంపిణీ చేసింది. రెండు కొత్త బైక్‌ల డెలివరీలు హోండా యొక్క బిగ్‌వింగ్ షోరూమ్ ద్వారా ప్రారంభమయ్యాయి. హోండా యొక్క ఈ రెండు ప్రీమియం బైక్‌లను దేశంలో కంప్లీట్లీ నాక్డ్ డౌన్ యూనిట్‌లుగా విక్రయిస్తున్నారు.

జూన్ 2021 లో పెరిగిన హోండా మోటార్‌సైకిల్ సేల్స్; పూర్తి వివరాలు

కొత్త హోండా సిబి650ఆర్ ధర రూ. 8.67 లక్షలు కాగా, దాని సిబిఆర్ 650 ఆర్ వేరియంట్ ధర రూ. 8.88 లక్షలు వరకు ఉంటుంది. కంపెనీ తన ప్రీమియం బైకుల అమ్మకాలను వేగవంతం చేయడానికి, ఇటీవల దేశ రాజధాని నగరం ఢిల్లీలో బింగ్‌వింగ్ షోరూమ్‌ను ప్రారంభించింది. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ పూర్తిగా ముగిసే దిశలో కనిపిస్తోంది. కావున ఇకపై కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Honda Motorcycle 2021 June Sales. Read in Telugu.
Story first published: Friday, July 2, 2021, 16:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X