దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వాహన తయారీ సంస్థ 'హోండా బైక్స్ అండ్ స్కూటర్స్ ఇండియా' (హెచ్‌ఎంఎస్‌ఐ) మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఏకంగా 40 లక్షల వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం. కంపెనీ సాధించిన ఈ ఘన విజయం గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కర్ణాటక రాష్ట్రంలో కంపెనీ యొక్క సేల్స్ టచ్‌పాయింట్ మరియు ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడం వల్లే ఈ ఘనత సాధించగలిగినట్లు తెలిసింది. కర్నాటకలో డీలర్‌షిప్‌లు, అధీకృత సర్వీస్ సెంటర్‌లతో సహా కంపెనీకి ప్రస్తుతం 380 టచ్‌పాయింట్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ విజయానికి తోడ్పడ్డాయి.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలో కరోనా మహమ్మారి అధికంగా వ్యాపించిన కారణంగా డిజిటల్ డీలర్‌షిప్ అనుభవాలకు వినియోగదారుల ప్రాధాన్యత పెరుగుతున్నందున హోండా డిజిటల్ మార్కెటింగ్ వ్యూహంపై కూడా దృష్టి పెడుతోంది. ఈ కారణంగానే కంపెనీ కర్ణాటక రాష్ట్రంలో 49 శాతం బలమైన వృద్ధిని సాధించగలిగింది. కర్ణాటకలో ద్విచక్ర వాహన మార్కెట్లో కంపెనీ మొత్తం మార్కెట్ వాటా 32 శాతానికి చేరుకుందని సంస్థ అధికారికంగా పేర్కొంది.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

భారత స్కూటర్ మార్కెట్లో హోండా స్కూటర్లు ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన హోండా యాక్టివా స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ గా నిలిచింది. ఇది మొత్తం టూ వీలర్ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనం యొక్క స్థానాన్ని కైవసం చేసుకుంది.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

కర్ణాటకలో తొలి 20 లక్షల యూనిట్లను విక్రయించేందుకు కంపెనీకి 16 ఏళ్లు పట్టింది, కానీ ఇప్పుడు కేవలం 5 సంవత్సరాలలో మరో 20 లక్షల యూనిట్లు విక్రయించగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క వాహనాలకు మార్కెట్లో రానురాను ఆదరణ మరింత పెరుగుదల దిశవైపు చేసురుకుంటోందని అర్థమవుతోంది.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

హోండా మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్లు భారతీయ మార్కెట్లో కమ్యూటర్ రేంజ్‌తో పాటు ప్రీమియం ద్విచక్ర వాహన శ్రేణిని విక్రయిస్తోంది. కంపెనీ ప్రస్తుతం యాక్టివా, డియో మరియు గ్రాజియా 125 మోడళ్లను దాని ప్రసిద్ధ స్కూటర్ శ్రేణిలో విక్రయిస్తోంది. దీనితో మోటార్‌సైకిల్ శ్రేణిలో కమ్యూటర్ మోడల్‌ల నుండి ప్రీమియం బైక్‌ల వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఉన్నాయి. ఈ మోటార్‌సైకిళ్లలో CD110 డ్రీమ్, Livo, SP125, షైన్, యునికార్న్, హార్నెట్ 2.0, X-బ్లేడ్ మరియు CB 200X వంటివి ఉన్నాయి.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

హోండా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టివా స్కూటర్ భారతదేశంలో 50 మిలియన్ యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించింది. యాక్టివా స్కూటర్‌తో కంపెనీ భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మొదటి 25 మిలియన్ల కస్టమర్లను పొందటానికి కంపెనీకి 16 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత 25 మిలియన్ల కస్టమర్లను పొందటానికి కేవలం 5 సంవత్సరాల కాలం మాత్రమే పట్టింది.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

అయితే గత కొన్నేళ్లుగా హోండా మోటార్‌సైకిల్ యొక్క విక్రయాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా 2021 అక్టోబర్ నెలలో మొత్తం 3,94,623 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అయితే ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ 37,584 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి చేసింది.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

2021 అక్టోబర్ నెలలో హోండా మోటార్‌సైకిల్స్ మొత్తం 4,32,207 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అదే సమయంలో కంపెనీ ఎగుమతుల పరంగా మునుపటికంటే కూడా 15 శాతం వృద్ధిని సాధించింది.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

హోండా మోటార్‌సైకిల్స్ కంపెనీ ఈ పండుగ సీజన్‌లో తమ బైక్‌లు మరియు స్కూటర్‌ల శ్రేణిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ మరియు ఆఫర్‌లను అందిస్తోంది. ఇప్పుడు కంపెనీ యొక్క బైక్ లేదా స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు హోండా ద్విచక్ర వాహనాల కొనుగోలుపై భారీగా ఆదా చేసుకోవచ్చు. హోండా ద్విచక్ర వాహనాలపై పండుగ సీజన్ ఆఫర్ 2021 నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులులో ఉంటుంది.

దేశంలోని ఆ ఒక్క రాష్ట్రంలో 40 లక్షల హోండా మోటార్‌సైకిల్స్ కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

కంపెనీ పండుగ సీజన్ ఆఫర్ కింద, EMI లో హోండా బైక్ లేదా స్కూటర్‌ని కొనుగోలు చేసి, SBI క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే, మీకు గరిష్టంగా 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ హోండా షైన్, యాక్టివా 3G, Activa 125 తో సహా అన్ని హోండా బైక్ మరియు స్కూటర్ శ్రేణిలో అందుబాటులో ఉంది. కావున ఇప్పుడు కొత్త బైకులు కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్న వారు ఈ ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు.

Most Read Articles

English summary
Honda two wheeler sales milestone 40 lakh units in karnataka details
Story first published: Thursday, November 18, 2021, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X