మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

భారతమార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగా చాలామంది వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమైంది. ఇప్పటికే భారత మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒకటి ఎలక్ట్రిక్ 2-వీలర్ తయారీ సంస్థ హాఫ్ (HOPE) ఎలక్ట్రిక్ మొబిలిటీ.

మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీసం 5 ఎలక్ట్రిక్-వెహికల్ సొల్యూషన్స్‌ను ప్రారంభించటానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. దీనికోసం జైపూర్‌లోని 40,000 చదరపు అడుగుల పొడవైన ప్రొడక్షన్ యూనిట్ సంవత్సరానికి 50,000 వాహనాలను ఉత్పత్తి చేయగలదు.

మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

అయితే ఈ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి అన్ని సదుపాయాలను సిద్ధం చేస్తోంది. కావున జైపూర్‌లోని ప్రొడక్షన్ యూనిట్ లో ఉత్పత్తిని 1 లక్ష యూనిట్లకు పెంచవచ్చు. 2022 నాటికి, దక్షిణ భారతదేశంలో కొత్త ఉత్పాదక విభాగాన్ని ఏర్పాటు చేయాలని బ్రాండ్ యోచిస్తోంది, ఇది సంవత్సరానికి కనీసం 5 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

ప్రస్తుతం హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హాఫ్ లియో మరియు హాఫ్ లైఫ్ అనే రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది మరియు త్వరలో ఈ-మోటర్‌బైక్‌ను విడుదల చేయబోతోంది. హాఫ్ ఈ-వెహికల్ పరిష్కారాలు విస్తృతమైన ఆర్ అండ్ డి పరిశోధనలపై ఆధారపడి ఉంటాయి. వీటి ధర రూ. 65,500 నుండి మొదలవుతుంది.

మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ 2 వీలర్ వాహనాల అంత బలంగా లేవని తెలుస్తుంది. ఈ స్కూటర్లు లో 125 కి.మీ వరకు హై రేంజ్, 72 వి ఆర్కిటెక్చర్, హోప్ లియో మరియు లైఫ్ రెండింటికీ 180 కిలోల లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో హై పర్ఫామెన్స్ మోటారు, 19.5 లీటర్ల బూట్ స్పేస్, కనెక్ట్ ఫీచర్స్ అయిన ఇంటర్నెట్, జిపిఎస్, మొబైల్ యాప్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఇందులో అందించబడ్డాయి. హోప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి లియో బేసిక్, లియో మరియు లియో ఎక్స్‌టెండెడ్ వేరియంట్లు.

మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యూయల్ 2 ఎక్స్ లి-అయాన్ బ్యాటరీల కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జీపై 125 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. లియో ఎక్స్‌టెండెడ్ యొక్క ఎలక్ట్రిక్ మోటారు ఒక సమయంలో 2700డబ్ల్యు వరకు యాంత్రిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ఠవేగం 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

ఇక హాఫ్ లైఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది లైఫ్ బేసిక్, లైఫ్ మరియు లైఫ్ ఎక్స్‌టెండెడ్ అనే మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. హాఫ్ లియో మాదిరిగానే, ఈ లైఫ్ మోడల్ డ్యూయల్ 2ఎక్స్ లి-అయాన్ బ్యాటరీల కలిగి ఉండి, ఇది ఒక ఛార్జీకి 125 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

లైఫ్ ఎక్స్‌టెండెడ్ యొక్క ఎలక్ట్రిక్ మోటారు 2000డబ్ల్యు వరకు యాంత్రిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్స్ లో పార్క్ అసిస్ట్, 5 కిలోమీటర్ల రివర్స్ గేర్, సైడ్ స్టాండ్ సెన్సార్, రిజర్వ్ మోడ్, త్రీ రైడ్ మోడ్లు, ఎల్‌ఇడి కన్సోల్, డ్యూయల్ డిస్క్ బ్రేక్, యుఎస్‌బి ఛార్జింగ్, రిమోట్ కీ, యాంటీ-తెఫ్ట్ అలారం వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
HOP Leo And Lyf Electric Scooters Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X