Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

అతికొద్ది సమయంలోనే అత్యంత పాపులర్ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్‌గా అవతరించిన Ola Electric నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోళ్లు రేపటి (సెప్టెంబర్ 8, 2021వ తేదీ) నుండి ప్రారంభం కానున్నాయి. మరి దీనిని కొనుగోలు చేయటం ఎలా? డెలివరీలు ఎలా చేస్తారు? సర్వీసింగ్ చేయించాలంటే ఎలా? ఈఎమ్ఐ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ కథనం.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

Ola Electric తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను S1 మరియు S1 Pro అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు వీటిని కంపెనీ వెబ్‌సైట్ నుండి రూ.499 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ కొనుగోళ్లు సెప్టెంబర్ 8, 2021వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. డెలివరీలు అక్టోబర్ నెలలో జరుగుతాయి.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

మార్కెట్లో Ola S1 ధర రూ. 99,999 కాగా, Ola S1 Pro ధర రూ.1.29,999 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) లుగా ఉన్నాయి. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అందుబాటులో ఉన్న సబ్సిడీ ప్రకారం, వీటి ధరలు మారుతూ ఉంటాయి. కస్టమర్లు ఈ స్కూటర్లను పూర్తిగా ఒకేసారి డబ్బు చెల్లించి కానీ లేదా ఈఎమ్ఐ విధానం ద్వారా కానీ కొనుగోలు చేయవచ్చు.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

ఈఎమ్ఐ విధానం కోసం Ola Electric సంస్థ మొత్తం 11 బ్యాంకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్, టాటా క్యాపిటల్ మరియు యస్ బ్యాంక్ లు ఉన్నాయి.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

ఫైనాన్స్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు పైన తెలిపిన బ్యాంకుల ద్వారా రుణాన్ని పొందవచ్చు. Ola S1 కోసం EMI సుమారు రూ. 2,999 గాను మరియు Ola S1 Pro కోసం రూ. 3,199 గానూ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ముందుగా బుక్ చేసుకున్న మరియు ఇన్వాయిస్ చేయబడిన కస్టమర్లకు ప్రాధాన్యతనిచ్చి, ముందస్తు డెలివరీలు చేస్తామని, స్కూటర్ ను నేరుగా కస్టమర్ ఇంటి వద్దకే తీసుకువస్తామని కంపెనీ తెలిపింది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

ఇక సర్వీసింగ్ విషయానికి వస్తే, కంపెనీ ఇందుకోసం Ola Electric App ను ప్లేస్టోర్ లో అందుబాటులోకి తీసుకురానుంది. కస్టమర్లు ఈ యాప్ సాయంతో సర్వీస్ అపాయింట్‌మెంట్ ను బుక్ చేసుకుంటే, నేరుగా కస్టమర్ కోరుకున్న ప్రదేశానికే వచ్చే స్కూటర్ ను సర్వీస్ చేయటం జరుగుతుంది. స్కూటర్ లో కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ రిమైండర్లు సెట్ చేయబడి ఉంటాయి.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

స్కూటర్ డ్యాష్‌బోర్డులో ఈ సర్వీస్ రిమైండర్లు రైడర్లను అలెర్ట్ చేస్తుంటాయి. స్కూటర్ లో ఏదైనా లోపం ఉన్నా కూడా అది డ్యాష్ బోర్డుపై కనిపిస్తుంది. ఒకవేళ స్కూటర్ మరమ్మత్తులో ఏవైనా విడిభాగాలు అవసరమైతే, వాటిని కూడా నేరుగా కస్టమర్ ఇంటి వద్దకే తీసుకువచ్చి మార్చడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు ఎలాంటి భౌతిక షోరూమ్ లు, సర్వీస్ సెంటర్లు లేవు.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. అలాగే, మొత్తం స్కూటర్ పై 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్లు (ఏది ముందు ముగిస్తే అది) వారంటీని అందిస్తోంది. కాబట్టి, దీని బ్యాటరీ విషయంలో కస్టమర్లు మూడేళ్ల వరకూ చింతించాల్సిన అవసరం లేదు.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే, Ola S1 మొత్తం 5 మ్యాట్ కలర్స్‌లో లభిస్తుంది. కాగా, Ola S1 Pro మొత్తం 10 కలర్స్‌లో లభిస్తుంది, వీటిలో 4 గ్లోసీ ఫినిషింగ్ కలర్లు ఉంటాయి. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తుంది. దీనికి ఆన్-బోర్డ్ 3.92 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ శక్తినిస్తుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

ఈ బ్యాటరీని తొలగించడానికి వీలు లేదు. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్ పై 121 కిలోమీటర్ల రేంజ్ ను మరియు Ola S1 Pro పూర్తి చార్జ్ పై 181 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

ఫాస్ట్ చార్జర్ సాయంతో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 60 నిమిషాల్లోనే 0 - 100 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే, కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు మరియు 75 కి.మీ రేంజ్ ను పొందవచ్చు. హోమ్ చార్జర్ ద్వారా దీనిని పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా కొనాలి? ఎలా సర్వీస్ చేయించాలి?

Ola S1 Pro గరిష్ట వేగం విషయానికి వస్తే, ఇందులో హైపర్ అనే డ్రైవింగ్ మోడ్ ఉంటుంది, ఇందులో గరిష్టంగా గంటకు 115 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు. ఇవి కాకుండా, ఇందులో నార్మల్ మరియు స్పోర్ట్ అనే రెండు ఇతర రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఇందులో 750W పోర్టబుల్ ఛార్జర్ ఉంటుంది, స్కూటర్‌తో పాటుగా ఈ హోమ్ ఛార్జర్ అందించబడుతుంది.

Most Read Articles

English summary
How to buy ola s1 electric scooter and how to schedule service details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X