టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో, ఈ వృద్ధి రేటు చాలా వేగంగా ఉంది. ఈ నేపథ్యంలో, దేశంలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు మరియు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ ఎలక్ట్రిక్ టూవీలర్లు కేవలం ఎక్కువగా పెద్దవారిని టార్గెట్ చేసి లాంచ్ చేస్తుండగా, తాజాగా టీనేజర్ల కోసం ఓ సరికొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టనుంది కోరిట్ ఎలక్ట్రిక్ (Corrit Electric) అనే స్టార్టప్ కంపెనీ.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

భారతదేశానికి చెందిన కోరిట్ ఎలక్ట్రిక్, ప్రత్యేకించి టీనేజర్లను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన ఫ్యాట్ టైర్ ఇ-బైక్ ప్రొడక్షన్ రెడీ ప్రోటోటైప్ ను ఆవిష్కరించింది. ఈ నెలాఖరు నాటికి ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహన విబాగంలో విదేశీ కంపెనీలు మరియు ఉత్పత్తులకు గట్టి పోటీ ఇవ్వడానికి భారతీయ కంపెనీలు కూడా ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లో అమ్మకానికి విడుదల చేస్తున్నాయి.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

అలాంటి, ఓ స్వదేశీ కంపెనీయే కోరిట్ ఎలక్ట్రిక్. ఈ స్టార్టప్ కంపెనీ అతి త్వరలో దేశీయ మార్కెట్లో రెండు మేడ్ ఇన్ ఇండియా హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఒకటి రెగ్యులర్‌గా కనిపించే ఎలక్ట్రిక్ బైక్, మరొకటి పెద్ద (ఫ్యాట్) టైర్లతో కూడిన హోవర్ బోర్డ్ టైప్ ఎలక్ట్రిక్ బైక్. కంపెనీ రెండు ఇ-వాహనాలను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

వీటిలో ఫ్యాట్ టైర్లతో కూడిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం భారతదేశంలో విడుదల కావడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇప్పటి వరకూ మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలన్నీ దాదాపుగా సాంప్రదాయమైన స్కూటర్, మోటార్‌సైకిల్ లేదా మోపెడ్ తరహా డిజైన్లను మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ కొత్త ఫ్యాట్ టైర్ ఇ-బైక్ మాత్రం చాలా ఫంకీగా ఉంటూ, యవతను ఆకర్షించే విధంగా ఉంటుంది.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

అయితే, ఈ ఫ్యాట్ టైర్ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమ్మకానికి తీసుకువచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతానికి, ఈ మోడల్ ను దేశంలోని కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. మొదటి దశలో భాగంగా, ఇది దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగుళూరు మరియు పూణేలలో నగరాల్లో అందుబాటులోకి వస్తుంది. ఆయా నగరాల్లో ఇప్పటికే ఈ మోడల్ కోసం బుకింగ్ లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

పైన తెలిపిన నగరాల్లో నివసించే కస్టమర్లు ఆసక్తి ఉన్నట్లయితే, రూ. 1100 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి, ఈ ఫంకీ లుకింగ్ స్కూటర్ ను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ మరియు డీలర్ల ద్వారా వీటి కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. నవంబర్ 25, 2021 వ తేదీ నుండి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

ఈ హోవర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని పెద్దలు మరియు మైనర్లు (టీనేజ్ పిల్లలు) కూడా ఉపయోగించే విధంగా డిజైన్ చేయయబడింది. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, ఇది 12 ఏళ్ల మరియు 18 ఏళ్ల మధ్య వయస్సు గల టీనేజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ అని తెలుస్తోంది. అంటే, దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ లకు సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్లను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

టీనేజర్లు ఈ వాహనం నడిపినా చట్టపరమైన సమస్యలు ఉండకపోవచ్చు, ఎందుకంటే, ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి, దీనిని నడపడానికి డ్రైవర్ లైసెన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ అవసరం ఉండదు. కేవలం టీనేజర్ల కోసం మాత్రమే కాకుండా, దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టుల సౌకర్యార్థం కూడా వీటిని ఉపయోగించేలా రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, గోవా మరియు జైపూర్ వంటి టూరిస్ట్ ప్రాంతాల్లో వీటి వినియోగం చాలా సరదాగా అనిపిస్తుంది.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

హోవర్ ఇ-బైక్ ఎరుపు, పసుపు, నీలం, గులాబీ, ఊదా మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం సుమారు 250 కిలోల వరకు బరువున్న వస్తువులను లేదా వ్యక్తులను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో మెరుగైన ప్రయాణ అనుభవం కోసం డ్యూయల్ డిస్క్ బ్రేకులు, వెడల్పాటి డ్యూయల్ ఫ్యాట్ టైర్లు మరియు డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు కూడా ఉన్నాయి.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

కోరిట్ ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు మరియు వాటి యాజమాన్యాన్ని సులభతరం చేసేందుకు కంపెనీ ప్రత్యేక రుణ పథకాలను కూడా అందించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే, వీటికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లను అందించడానికి కూడా కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై కంపెనీ బై-బ్యాక్ ప్లాన్ ను వినియోగదారులకు అందించనుంది.

టీనేజర్స్.. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫ్యాట్ టైర్ ఇ-బైక్ నడపటానికి మీరు రెడీనా..?

ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై ఉత్తమ రీసేల్ విలువను అందించాలనేది కంపెనీ ఉద్దేశ్యం. మూడు సంవత్సరాల తర్వాత కస్టమర్లకు రీఫండ్ అందించాలనేది కంపెనీ ప్లాన్. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో విప్లవాత్మకమైన లక్ష్యంతో కోరిడ్ ఎలక్ట్రిక్ ఈ వాహనాన్ని విడుదల చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు మయూర్ మిశ్రా మాట్లాడుతూ, "భారతదేశంలో విస్తారమైన ఆటోమొబైల్ పరిశ్రమలో, యువకుల కోసం వాహన ఎంపిక చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ వాహనం టీనేజర్లకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడింది. స్కూళ్లు లేదా కాలేజీలకు వెళ్లే అబ్బాయిలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది." అని అన్నారు.

Most Read Articles

English summary
India s first fat tyre e bike ready for launch specifically designed for teenagers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X