కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

అమెరికన్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌సైకిల్' త్వరలోనే భారత మార్కెట్లో తమ కొత్త తరం అధునాతన మోటార్‌సైకిళ్లను విడుదల చేయనుంది. మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా, ఈ కొత్త మోటార్‌సైకిళ్ళు తదుపరి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది.

కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

అంతేకాకుండా, కస్టమర్లు వీటిని తమ రైడ్ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకునేందుకు సరికొత్త యాక్ససరీలతో వస్తాయని కంపెనీ తెలిపింది. ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం, కొత్త 2022 ఇండియన్ చీఫ్ లైనప్ ఈ ఏడాది ఆగస్టు నెల నాటికి భారతదేశానికి చేరుకుంటుందని సమాచారం.

కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

కొత్త 2022 ఇండియన్ చీఫ్ లైనప్‌తో పాటుగా కంపెనీ తమ ఎఫ్‌టిఆర్ మోడల్ లైనప్‌ను కూడా తిరిగి బిఎస్6 రూపంలో మార్కెట్లోకి తీసుకురాబోంది. కొత్త ఇండియన్ చీఫ్ లైనప్ విషయానికి వస్తే, 2022 గ్లోబల్ ఇండియన్ చీఫ్ లైనప్‌లోని ఆరు మోడళ్లలో మూడు మోడళ్లు భారత్ కోసం నిర్ణయించబడ్డాయి.

MOST READ:డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

అంతేకాకుండా, ఈ మూడు మోడళ్లు ఇప్పుడు పెద్ద థండర్ స్ట్రోక్ 116 ఇంజన్‌తో రానున్నాయి. ఈ ఇంజన్‌ను కంపెనీ ఇప్పటికే తమ వింటేజ్, స్ప్రింగ్‌ఫీల్డ్, చీఫ్టైన్ మరియు రోడ్ మాస్టర్ మోడళ్లలో ఉపయోగిస్తోంది. ప్రస్తుతం ఈ నాలుగు మోడళ్లు భారతదేశంలో అమ్మకానికి ఉన్నాయి.

కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

ఇండియన్ చీఫ్ లైనప్‌లో భారత మార్కెట్‌కు రానున్న మూడు మోడళ్లలో చీఫ్ డార్క్ హార్స్, చీఫ్ బాబర్ డార్క్ హార్స్ మరియు సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడళ్లు ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు సుమారు రూ.20.75 లక్షల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.

MOST READ:కరోనా ఎఫెక్ట్; 4 రోజులు, 300 కి.మీ సైకిల్ ప్రయాణం.. కొడుకు కోసం తండ్రి చేసిన సాహసం

కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

ఇకపోతే, ఎఫ్‌టిఆర్ మోడల్ లైనప్‌ను కంపెనీ అప్‌డేటెడ్ బిఎస్ 6-కంప్లైంట్ ఇంజన్‌తో విడుదల చేయనుంది. ఈ లైనప్‌లో ఇండియన్ ఎఫ్‌టిఆర్ 1200 ఎస్ మరియు 1200 ఎస్ రేస్ రెప్లికా మోడళ్లు ఉన్నాయి. ఇవి రెండూ కూడా 1,203సిసి వి-ట్విన్ ఇంజన్‌తో పనిచేస్తాయి.

కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి పవర్‌ను మరియు 115 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

MOST READ:హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

గత ఏడాది చివరలో, కంపెనీ తమ 2021 మోటారుసైకిల్ లైనప్ ధరలను భారత మార్కెట్లో ప్రకటించింది. స్కౌట్ మోడల్‌తో 2021 ఇండియన్ మోటార్‌సైకిల్ లైనప్ ప్రారంభం అవుతుంది. మార్కెట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.15.67 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

ఇండియన్ స్కౌట్ బైక్‌లో లిక్విడ్-కూల్డ్ వి-ట్విన్ 1133సిసి ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5600 ఆర్‌పిఎమ్ వద్ద 97 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ300; వైరల్ అవుతున్న వీడియో

కొత్త 2022 ఇండియన్ మోటార్‌సైకిల్స్ వస్తున్నాయ్.. బిఎస్6 ఎఫ్‌టిఆర్ బైక్స్ కూడా..

అలాగే, ఇండియన్ వింటేజ్ లైనప్ 1890 సిసి ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది గరిష్టంగా 2800 ఆర్‌పిఎమ్ వద్ద 168 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్‌సైకిళ్లలో మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం క్రూయిజ్ కంట్రోల్, ఏబిఎస్ మరియు వెనుక సిలిండ డీయాక్టివేషన్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Source: AutoCar India

Most Read Articles

English summary
Indian Motorcycle To Update Its Entire Line-up in India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X