Ola S1 Pro Electric Scooter: ప్రైస్, సబ్సిడీ & పూర్తి వివరాలు

Ola Electric 2021 ఆగష్టు 15 న S1 మరియు S1 Pro అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ. 99,999 మరియు రూ. 1.29 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద విడుదల చేసింది. కానీ కొనుగోలుదారులు ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి మొత్తం రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇందులో హోమ్ ఛార్జర్, పర్ఫామెన్స్ అప్‌గ్రేడ్, రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్, స్కూటర్ ఇన్సూరెన్స్ మరియు హెల్మెట్ వంటివి ఇందులో ఉంటాయి.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

Ola S1 Pro యొక్క ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.29 లక్షలు. కానీ దీని మొత్తం ధర రూ .1,40,221. అయితే కంపెనీ S1 ప్రో యొక్క అసలు ధర రూ .1,63,549 వద్ద ఉంచింది. ఇందులో దాని హోమ్ ఛార్జర్ ధర రూ .9000, పర్ఫామెన్స్ అప్‌గ్రేడ్ ధర రూ .17,000, రిజిస్ట్రేషన్ మరియు రోడ్ ట్యాక్స్ రూ. 2138 ఉన్నాయి. అంతే కాకుండా ఆయా రాష్ట్రాల్లో అందించే సబ్సిడీ కూడా అందుబాటులో ఉంటుంది.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

Ola స్కూటర్ ఇన్సూరెన్స్ కోసం రూ. 6,785 చెల్లించాలి. ఇందులో 1 సంవత్సరం ఓన్ డ్యామేజ్ మరియు 5 సంవత్సరాల థర్డ్ పార్టీ ఉన్నాయి. అంతే కాకుండా హెల్మెట్ కోసం రూ .1299 చెల్లించాల్సి ఉంటుంది.

కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫేమ్ 2 పథకం కారణంగా, రూ. 59,550 తగ్గింపు ఉంటుంది. దీనితో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వచ్చిన రాష్ట్రాల్లో, వాహనం డెలివరీ అయిన తర్వాత రూ .5000 తగ్గింపు లభిస్తుంది. ఇవన్నీ కూడా అసలు ధరలో చాలా తగ్గింపును కలిగిస్తాయి. కావున వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. నగరంలో రోజు వారి ప్రయాణాలకు మరియు ఆఫీసులకు మరియు కాలేజీలకు వెల్లవారికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకంగా యువకులకు సరిపోయే విధంగా తయారు చేయబడింది.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

భారతదేశంలో రోజురోజుకి ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ఈ తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం చాలా అవసరం, ఇది సామాన్య మానవుడిని ఇంధన ధరల భారీ నుంచి రక్షిస్తుంది. అయితే ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 కిలో వాట్ సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఓలా అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను చేర్చింది.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

ఓలా S1 ఒక పూర్తి ఛార్జ్‌పై 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 Pro మాత్రం 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. అంతే కాకూండా, ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది, మరియు బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కానీ డెలివరీలు ఇంకా ప్రారంభించలేదు. కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

ఓలా కంపెనీ ఇంకా ఏ నగరంలోనూ తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ప్రారంభించలేదు. ప్రారంభ దశలో, ఓలా తన స్కూటర్లను డోర్-స్టెప్ డెలివరీని ప్రారంభిస్తుంది. కావున కస్టమర్ స్కూటర్ పొందడానికి షోరూమ్‌కు వెళ్ళవలసిన అవసరం లేదు. స్కూటర్ కస్టమర్ ఇంటికి డోర్ డెలివరీ చేయబడుతుంది.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

ఓలా స్కూటర్ ప్రిడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వినియోగదారులకు నిర్వహణ సంబంధిత హెచ్చరికలను అందిస్తూనే ఉంటుంది. తదుపరి దశలో కంపెనీ స్కూటర్‌ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో విక్రయించవచ్చని ఓలా తెలిపింది. దీని కోసం, కంపెనీ దేశంలోని అనేక నగరాల్లో తన డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చే మూడు నెలల్లో దేశంలోని ప్రతి నగరంలో ఒక కస్టమర్ టచ్ పాయింట్‌ను కంపెనీ ప్రారంభిస్తుంది.

Ola Electric Scooter: కొనడానికి సరైనదా? కాదా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం, కంపెనీ డోర్-స్టెప్ సర్వీస్‌ను అందిస్తుంది. అంటే, స్కూటర్‌లో ఏదైనా సమస్య ఉంటే, ఆ కంపెనీ టెక్నీషియన్‌లు స్కూటర్ రిపేర్ చేయడానికి కస్టమర్ ఇంటికి వెళ్తారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మొబైల్ అప్లికేషన్ మరియు వెబ్‌సైట్‌లో సర్వీస్ రిక్వెస్ట్ సౌకర్యం అందించబడుతుంది.

Most Read Articles

English summary
Is ola s1 electric scooter budget friendly cost details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X