Just In
- 29 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 39 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 48 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరికొత్త జావా ఫోర్టీ టూ మోడల్ వస్తోంది.. స్పై చిత్రాలు, వివరాలు
భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఐకానిక్ క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ జావా, ఇప్పుడు తమ మోడళ్లలో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్లను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, జావా ఫోర్టీ టూ కొత్త మోడల్‌ను కంపెనీ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్‌ను దేశీయ రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. జావా మోటార్‌సైకిల్స్ నుండి ఎంట్రీ లెవల్ మోడల్‌గా లభిస్తున్న ఈ కొత్త మోడల్‌లో ఇప్పుడు మరిన్ని కొత్త అప్‌డేట్స్‌తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఆటోకార్ఇండియా పోస్ట్ చేసిన లేటెస్ట్ స్పై చిత్రాల ప్రకారం, అప్‌డేటెడ్ జావా ఫోర్టీ టూ మోటార్‌సైకిల్‌లో సైలెన్సర్ పైప్‌లను పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేశారు. ఇదివరకటి మోడల్‌లో ఇవి క్రోమ్ ఫినిషింగ్‌లో ఉండేవి.
MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

అంతేకాకుండా, హెడ్‌లైట్ డోమ్, టెయిల్ లైట్స్, బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్, ఫ్రంట్ సస్పెన్షన్, ఫెండర్ గార్డ్ మరియు రియర్ సస్పెన్షన్లను కూడా బ్లాక్ కలర్‌లోనే పెయింట్ చేయబడి కనిపిస్తాయి. అలాగే, ఇందులో కొత్త బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను కూడా మనం గమనించవచ్చు.

ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో పిలియన్ రైడర్ కోసం కొత్త డిజైన్‌తో కూడిన గ్రాబ్ రెయిల్‌ను జోడించారు, ఇది కూడా బ్లాక్ కలర్‌లోనే ఉంటుంది. ఈ మొత్తం బ్లాక్అవుట్ థీమ్‌తో వస్తున్న కొత్త 2021 జావా ఫోర్టీ టూ రెట్రో-క్లాసిక్ మోటార్‌సైకిల్ మునుపటి కన్నా మరింత స్పోర్టీగా, ప్రీమియంగా కనిపిస్తుంది.
MOST READ:ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

ఇప్పటి వరకూ ఈ మోడల్ స్పోక్ వీల్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమయ్యేది. కాగా, కొత్త జావా ఫోర్టీ టూ మోడల్ స్టయిలిష్ బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్‌తో రానుంది. వీటిపై ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చే అవకాశం ఉంది. ఈ మార్పుల మినహా దీని డిజైన్ పెద్దగా వేరే మార్పులేవీ కనిపించడం లేదు.

ఇంజన్ పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. మునుపటి జావా ఫోర్టీ టూ మోడల్‌లో ఉపయోగించిన 293సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త మోడల్‌లోనూ ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 26.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

ఈ మోటార్‌సైకిల్‌లోని మెకానికల్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. పాత మోడల్‌లో ముందు వైపు 18 ఇంచ్ మరియు వెనుక వైపు 17 ఇంచ్ స్పోక్ వీల్స్ ఉంటాయి. కొత్త మోడల్‌లోని అల్లాయ్ వీల్స్ కూడా ఇదే పరిమాణాలను కలిగి ఉంటాయని అంచనా.

జావా ఫోర్టీ టూ మోడల్ ఆరు రంగులలో లభిస్తుంది. ఇందులో రెండు గ్లోసీ మరియు నాలుగు మ్యాట్ ఫినిష్ ఉన్నాయి. ఇది సింగిల్-ఛానల్ ఏబిఎస్ మరియు డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.1.65 లక్షలు మరియు రూ.1.74 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.
MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!