మీకు తెలుసా.. కవాసకి విడుదల చేయనున్న కొత్త బైక్, ఇదే

ప్రముఖ బైక్ తయారీదారు కవాసకి ఇండియా ఇటీవల తన కొత్త 2021 కవాసకి నింజా 300 మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని గురించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో అప్‌డేట్ చేయలేదు. కానీ ఈ కొత్త కవాసకి నింజా 300 బైక్ యొక్క ఫోటో మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మీకు తెలుసా.. కవాసకి విడుదల చేయనున్న కొత్త బైక్, ఇదే

కంపెనీ ప్రస్తుతం అందించిన సమాచారం ప్రకారం, కొత్త బైక్ ధర గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే రాబోయే కొద్ది రోజుల్లో ఈ బైక్ ధరను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఆవిష్కరించి ఈ కొత్త బైక్ యొక్క డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదనే విషయం తెలుస్తోంది.

మీకు తెలుసా.. కవాసకి విడుదల చేయనున్న కొత్త బైక్, ఇదే

కవాసకి అప్‌డేట్‌ చేసిన దానిని బట్టి చూస్తే ఈ సరికొత్త కొత్త నింజా 300 కొత్త పెయింట్ స్కీమ్‌తో ప్రవేశపెట్టినప్పటికీ, ఈ బైక్ రూపకల్పన దాని పాత మోడల్ మాదిరిగానే ఉంది. ఈ కొత్త పెయింట్ స్కీమ్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉంది. ఇది కాకుండా, బైక్ యొక్క మొత్తం బాడీపై రెడ్ కలర్ హైలెట్స్ చాలా చోట్ల కనిపిస్తాయి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

మీకు తెలుసా.. కవాసకి విడుదల చేయనున్న కొత్త బైక్, ఇదే

ఈ కొత్త బైక్ లో ఈ అప్డేట్స్ కాకుండా, రూపకల్పన మరియు స్టైలింగ్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక్కడ మనం గమనించదగ్గ ఇంకో విషయం ఏమిటంటే ఈ బైక్ యొక్క కొన్ని భాగాలను భారతదేశంలోనే కంపెనీ తయారు చేస్తోంది.

మీకు తెలుసా.. కవాసకి విడుదల చేయనున్న కొత్త బైక్, ఇదే

భారతదేశంలోని కంపెనీలో బైక్ యొక్క హెడ్‌లైట్, బాడీ ప్యానెల్, బ్రేక్‌లు, ఎలక్ట్రిక్ కేబుల్, టైర్లు మరియు ఇంజిన్ యొక్క కొన్ని భాగాలు తయారు చేయబడతాయి. ఈ కారణంగా ఈ బైక్ ఇప్పుడు సరసమైన ధరలకు లభించే అవకాశం ఉంది. కొత్త ఇంజిన్‌తో బైక్‌కు అనేక ఇతర ఫీచర్లు జోడించబడ్డాయి.

MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!

మీకు తెలుసా.. కవాసకి విడుదల చేయనున్న కొత్త బైక్, ఇదే

కవాసకి నింజా 300 బిఎస్ 6 బైక్ 296 సిసి అప్‌గ్రేడ్ ఫ్యారలల్ ట్విన్ బిఎస్ 6 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 39 బిహెచ్‌పి శక్తితో 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మునుపటి కంటే ఎక్కువ అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. ఈ బైక్ ట్యూబులర్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది, ఇది మంచి బ్యాలెన్స్‌తో బైక్‌కు మరింత స్థిరత్వాన్ని ఇస్తుంది.

మీకు తెలుసా.. కవాసకి విడుదల చేయనున్న కొత్త బైక్, ఇదే

కొత్త కవాసకి బైక్ యొక్క మొత్తం బరువు 179 కేజీలు. నింజా 300 బైక్ 17 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. ఇది బైక్‌ ప్రత్యేకంగా లాంగ్ డ్రైవ్ ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ బైక్‌లో ఎంఆర్‌ఎఫ్ టైర్లు, స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, ముందు భాగంలో 290 మిమీ సింగిల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ అమర్చారు.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో ఫెరారీ సూపర్ స్పోర్ట్స్ కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్

మీకు తెలుసా.. కవాసకి విడుదల చేయనున్న కొత్త బైక్, ఇదే

కవాసకి 2018 లో నింజా 300 బిఎస్ 4 బైక్ ను రూ. 2.98 లక్షలకు డిస్సీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ దేశంలోనే అనేక భాగాలను తయారు చేస్తోంది, కాబట్టి బిఎస్ 6 మోడల్ ధర రూ. 2.5 లక్షలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. అంతే కాకుండా లాంగ్ డ్రైవ్ లో వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kawasaki India Revealed New Ninja 300 Expected Launch Soon Details. Read in Telugu.
Story first published: Wednesday, February 24, 2021, 15:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X