ఒకినావా స్కూటర్లపై 'మార్వెలస్ మార్చ్' ఆఫర్స్; ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావా, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుదారుల కోసం 'మార్వెలస్ మార్చ్' పేరిట వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా మార్చ్ నెలలో ఎంపిక చేసిన ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఖచ్చితమైన బహుమతిని పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

ఒకినావా స్కూటర్లపై 'మార్వెలస్ మార్చ్' ఆఫర్స్; ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి!

ఈ ఆఫర్లు మార్చ్ 1 నుండి మార్చ్ 31 వరకూ చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ సమయంలో ఒకినావా లైట్, రిడ్జ్ ప్లస్ మరియు ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లు 'స్క్రాచ్ అండ్ విన్ అష్షూర్డ్ గిఫ్ట్స్' ఆఫర్‌కి అర్హులు అవుతారు. ఇలా స్క్రాచ్ కార్డు ద్వారా రూ.1 లక్ష రూపాయల వరకు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఒకినావా స్కూటర్లపై 'మార్వెలస్ మార్చ్' ఆఫర్స్; ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి!

కస్టమర్లు ఈ స్క్రాచ్ కార్డు ద్వారా రూ.3,000 విలువైన అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్, రూ.5,000 విలువైన అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్, మార్ఫీ రిచర్డ్స్ 20 ఎమ్ఎస్ మైక్రోవేవ్ ఓవెన్, 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, రూ.10,000 వర్ల్‌పూల్ 7.5 కేజీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ మొదలైనవి గెలుచుకోవచ్చు.

ఒకినావా స్కూటర్లపై 'మార్వెలస్ మార్చ్' ఆఫర్స్; ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి!

అంతేకాకుండా, ఈ స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్లలో కస్టమర్లు శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్ 11 స్మార్ట్‌ఫోన్ - 64 జిబి, రూ.25,000 విలువైన శామ్‌సంగ్ 80 సెం.మీ ఎల్‌ఈడీ టీవీ, రూ.35,000 విలువైన లెనోవా ల్యాప్‌టాప్ మరియు రూ.1,00,000 విలువైన గిఫ్ట్ చెక్‌లను కూడా గెలుపొందవచ్చు.

ఒకినావా స్కూటర్లపై 'మార్వెలస్ మార్చ్' ఆఫర్స్; ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి!

ఒకినావా లైట్, ఒకినావా రిడ్జ్ ప్లస్, మరియు ఓకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే, మార్కెట్లో వీటి ధరలు వరుసగా 63,990 రూపాయలు, 73,417 రూపాయలు మరియు 58,992 రూపాయల వద్ద రిటైల్ అవుతున్నాయి.

ఒకినావా స్కూటర్లపై 'మార్వెలస్ మార్చ్' ఆఫర్స్; ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరియు నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరలు వంటి పరిస్థితుల నేపథ్యంలో కస్టమర్లు సురక్షితమైన మరియు సరసమైన వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరిగింది.

ఒకినావా స్కూటర్లపై 'మార్వెలస్ మార్చ్' ఆఫర్స్; ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి!

ఒకినావా ఇటీవలి కాలంలో భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ఓ మంచి స్థిరమైన బ్రాండ్‌గా అవతరించింది. ఒకినావా సంస్థకు దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, టైర్-2, టైర్-3 మరియు గ్రామీణ ప్రాంతాలతో కలిపి 300కి పైగా డీలర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి.

ఒకినావా స్కూటర్లపై 'మార్వెలస్ మార్చ్' ఆఫర్స్; ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కంపెనీ ఈ మార్చ్ నెలలో స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చేలా మరియు వారిని ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపుకు మారేలా ప్రోత్సహించేందుకు కంపెనీ ఈ ఆఫర్లను ప్లాన్ చేసింది.

ఒకినావా స్కూటర్లపై 'మార్వెలస్ మార్చ్' ఆఫర్స్; ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి!

ఒకినావా గడచిన సంవత్సరంలో భారత మార్కెట్లో 5,601 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇది భారతదేశం మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలలో 20.5 శాతంగా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 9, 2021, 16:41 [IST]
English summary
March 2021 Month Offers On Okinawa Electric Scooters, Details. Read In Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+