ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

ఇటాలియన్ సూపర్‌బైక్ తయారీ సంస్థ డ్యుకాటి తమ ఉత్పత్తిని శ్రేణిని విస్తరించడం మరియు కొత్త మార్కెట్లను చేరుకోవాలనే లక్ష్యంతో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ను ప్రవేశపెట్టింది. డ్యుకాటి ప్రో-ఐ ఇవో పేరుతో ఓ ఎలక్ట్రిక్ టూవీలర్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది.

ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

డ్యుకాటి ప్రో-ఐ ఇవో ఎలక్ట్రిక్ స్కూటర్ 350W మోటార్ మరియు 280Wh బ్యాటరీతో పనిచేస్తుంది. పూర్తి ఛార్జీపై ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ గరిష్టంగా 30 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. హ్యాండిల్‌బార్‌లో లోగో మినహా డిజైన్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూర్ చూడటానికి షియోమి అందిస్తున్న ఎమ్365 ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే కనిపిస్తుంది.

ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

డ్యుకాటి ప్రో-ఐ ఇవో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోల్డబిల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాదు, దీని బరువు కూడా కేవలం 12 కిలోలు మాత్రమే. కాబట్టి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సులువుగా మడతపెట్టి, ఎక్కడికైనా తీసుకువెళ్లగలిగేలా ఉంటుంది. కాంపాక్ట్ డిజైన్ కారణంగా, ఇది ఎక్కువ స్టోరేజ్ స్థలాన్ని కూడా ఆక్రమించదు.

ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

సెగ్వే-నైన్‌బోట్ అందిస్తున్న ఉత్పత్తుల మాదిరిగానే డ్యుకాటి ప్రో-ఐ ఇవో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అదే విధమైన డిజైన్ మరియు పనితీరును కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి, ఈ డ్యుకాటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపటానికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు.

ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ లైట్-వెయిట్ స్కూటర్ ఏకంగా 100 కిలోల వరకు బరువును మోయగలదు. కాబట్టి, ఇది పిల్లలకు మరియు యువతకు చాలా అనుకూలంగా మరియు ఫన్-టూ-రైడ్ టూవీలర్ మాదిరిగా ఉంటుంది.

ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

ఇందులో చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ సాయంతో తరచూ యాక్సిలరేషన్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఎకో, డి మరియు ఎస్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉంటాయి.

ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

డ్యుకాటి ప్రో-ఐ ఇవో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్‌లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. డి మోడ్‌లో దీని గరిష్ట వేగం గంటకు 20 కిలోమీటర్లుగా ఉంటుంది మరియు ఈ ఎస్ మోడల్‌లో ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

ఈ ఎలక్ట్రిక్ టూవీలర్‌లో 8.5 ఇంచ్ చక్రాలు మరియు స్ప్లాష్ గార్డులు, ఇరు వైపులా టర్న్ ఇండికేటర్ లైట్లు, వెనుక వైపు డిస్క్ బ్రేక్ మరియు ముందు వైపు ఎల్ఈడి హెడ్‌లైట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఎలక్ట్రిక్ మోటార్‌ను ముందు చక్రంలో అమర్చబడి ఉంటుంది.

ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

అంతేకాకుండా, ఈ చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ బ్లూటూత్ కనెక్ట్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ సాయంతో ఈ స్కూటర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ మధ్యలో ఎల్ఈడి డిస్‌ప్ల ఉంటుంది. ఇది ప్రయాణించే వేగం, బ్యాటరీ సామర్థ్యం, డ్రైవ్ మోడ్, బ్లూటూత్ కనెక్టివిటీ స్టేటస్, హెడ్‌లైట్ ఇండికేటర్ మొదలైన సమాచారాన్ని తెలియజేస్తుంది.

ఇదే అత్యంత చవకైన డ్యుకాటి టూవీలర్: ధర రూ.37,000 మాత్రమే!

అంతర్జాతీయ మార్కెట్లో డ్యుకాటి ప్రో-ఐ ఇవో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం 500 డాలర్లు మాత్రమే. అంటే, ప్రస్తుత మారకపు విలువ ప్రకారం, మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు 36,000 రూపాయలుగా ఉంటుంది. డ్యుకాటి బ్రాండ్‌కు ఇదేమీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం కాదు. ఈ బ్రాండ్ గతంలో సూపర్ సోకో బ్రాండ్ సహకారంతో కొన్ని రకాల ఇ-బైక్‌లు మరియు ఇ-స్కూటర్లను కూడా విడుదల చేసింది.

Most Read Articles

English summary
Most Affordable Ducati Pro-I Evo Electric Scooter Launched, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X