ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

ఇటాలియన్ సూపర్‌బైక్ బ్రాండ్ డ్యుకాటి (Ducati) భారత మార్కెట్లో తమ కొత్త 2021 మోన్‌స్టర్ (Monster) ప్రీమియం బైక్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ సరికొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్ లను స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ నెలలోనే కొత్త 2021 Monster మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

ఈ కొత్త 2021 డ్యుకాటి మోన్‌స్టర్ బైక్ కోసం కంపెనీ బుకింగ్ లను ప్రారంభించడంతో పాటుగా, తమ సోషల్ మీడియా హ్యాండిల్‌ లో ఇందుకు సంబంధించిన ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఆసక్తిగల కస్టమర్లు కొత్త 2021 Ducati Monster బైక్ ని రూ. 1 లక్ష అడ్వాన్స్ మొత్తం చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లో కానీ లేదా అధీకృత డీలర్‌షిప్ లో కానీ బుక్ చేసుకోవచ్చు.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త 2021 Ducati Monster కొత్త డిజైన్ తో పాటుగా కొత్త ఇంజన్ ను కూడా కలిగి ఉంటుంది. గతేడాది డిసెంబర్ నెలలోనే కంపెనీ తమ కొత్త 2021 Ducati Monster ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్ లో కంపెనీ అనేక కొత్త అప్‌డేట్‌లు మరియు ఫీచర్లను జోడించింది.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

కొత్త 2021 Ducati Monster లో హెడ్‌ల్యాంప్ లు పూర్తిగా ఎల్ఈడి లైటింగ్ సెటప్ ను కలిగి ఉంచాయి. ఇంకా ఇందులో 'బైసన్-బ్యాక్' ప్రొఫైల్‌ తో కూడిన కొత్త ఇంధన ట్యాంక్ డిజైన్, సన్నటి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని వెనుక డిజైన్ మునుపటి కన్నా చాలా స్పోర్టీగా మరియు సన్నగా ఉంటుంది. ఈ బైక్ ఒక నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్ కాబట్టి, దీని డిజైన్‌లో ఎక్కువగా కట్స్ లేదా క్రీజ్ లైన్స్ ఉండవు.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఇందులో స్టీల్, బ్లాక్ మరియు గ్లోడెన్ యాక్సెంట్స్ కలిగిన డ్యూయల్ సైలెన్సర్ ఎగ్జాస్ట్ లు లభిస్తాయి. కొత్త 2021 Ducati Monster లో కొత్త బిఎస్ 6 కంప్లైంట్ 937 సిసి లిక్విడ్ కూల్డ్, ట్విన్ సిలిండర్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 93 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

ఈ ఇంజన్ స్టాండర్డ్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ తోజచేయబడి ఉంటుంది మరియు ఇది క్విక్ షిఫ్టర్ తో ప్రామాణికంగా వస్తుంది. పాత Monster తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ లోని ఇంజన్ పవర్ 2 బిహెచ్‌పి మరియు టార్క్ 6 ఎన్ఎమ్ మేర పెంచడం జరిగింది. ఫలితంగా, ఈ బైక్ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

కొత్త 2021 Monster ను దాని బిగ్ బ్రదర్ అయిన పానిగల్ వి4 నుండి ప్రేరణ పొందిన సరికొత్త అల్యూమినియం ఫ్రేమ్‌ పై నిర్మించారు. ఈ బైక్ మొత్తం బరువు 166 కిలోలు మరియు ఇది మునుపటి కంటే 18 కిలోల తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇందులోని వెనుక సబ్ ఫ్రేమ్ ను గ్లాస్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్డ్ పాలిమర్ (GFRP) మెటీరియల్ తో తయారు చేయబడింది కాబట్టి, ఇది మునుపటి కంటే తేలికగా మరియు ధృడంగా ఉంటుంది.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

ఈ మోటార్‌సైకిల్ మెకానికల్స్ ను గమనిస్తే, దీని ముందు భాగంలో 130 మిమీ డ్రైవ్‌ తో కూడిన 43 మిమీ అప్‌సైడ్ డౌన్ (యూఎస్‌డి) ఫోర్కులు మరియు వెనుక వైపు 140 మిమీ డ్రైవ్‌తో కూడిన మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ బైక్ లో మునుపటి కంటే మరింత తేలికైన కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ను ఉపయోగించారు. దీని ముందు భాగంలో 120/70 మరియు వెనుక భాగంలో 180/55 ప్రొఫైల్ తో కూడిన పిరెల్లి టైర్లను ఉపయోగించారు.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

ఇక బ్రేక్ సెటప్ విషయానికి వస్తే, బైక్ ముందు భాగంలో ట్విన్ బ్రెంబో ఎమ్4.32 4-పిస్టన్ మోనోబ్లాక్ కాలిపర్‌ లతో కూడిన ట్విన్ 320 మిమీ డిస్క్ బ్రేక్‌ లను మరియు వెనుక భాగంలో బ్రెంబో కాలిపర్‌ లతో కూడిన సింగిల్ 245 మిమీ డిస్క్ బ్రేక్‌ ను ఉపయోగించారు. ఈ బైక్ యొక్క అన్ని వేరియంట్లలో కూడా ఇదే విధమైన బ్రేక్ సెటప్ స్టాండర్డ్ ఫీచర్ గా లభిస్తుంది.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

కొత్త 2021 Monster ఏబిఎస్ తో రైడ్-బై-వైర్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో పవర్ లాంచ్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు వీలీ కంట్రోల్ మరియు మూడు రైడింగ్ మోడ్ లు (స్పోర్ట్, టూరింగ్ మరియు అర్బన్) ఉంటాయి. కొత్త 2021 Ducati Monster లో కొత్త 4.3 ఇంచ్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇది పానిగల్ వి4 ప్రేరేపిత బాడీ గ్రాఫిక్స్ ను కలిగి ఉంటుంది.

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

మార్కెట్ అంచనా ప్రకారం, దేశీయ విపణిలో కొత్త 2021 Ducati Monster ప్రారంభ ధర సుమారు రూ. 11 లక్షల నుండి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లోల ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. భారతదేశంలో కూడా ఈ రెండు వేరియంట్‌ లను కంపెనీ అందుబాటులోకి తెస్తుందని భావిస్తున్నారు. ఇది ఈ విభాగంలో ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్, బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 90 ఆర్, కవాసకి జీ 900 మరియు యమహా ఎమ్‌టి-09 వంటి వంటి బైక్‌లతో పోటీపడుతుంది.

Most Read Articles

English summary
New 2021 ducati monster bookings open india launch expected soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X