2021 ఇండియన్ ఛీఫ్టైన్ ఎలైట్ విడుదల; కేవలం 120 యూనిట్లు మాత్రమే..

అమెరికన్ ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ 'ఇండియన్ మోటారుసైకిల్' తమ సంస్థను స్థాపించి 120 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

2021 ఇండియన్ ఛీఫ్టైన్ ఎలైట్ విడుదల; కేవలం 120 యూనిట్లు మాత్రమే..

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ యొక్క 120వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, కొత్త 2021 ఇండియన్ చీఫ్టైన్ ఎలైట్ మోటార్‌సైకిల్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది.

2021 ఇండియన్ ఛీఫ్టైన్ ఎలైట్ విడుదల; కేవలం 120 యూనిట్లు మాత్రమే..

కొత్త 2021 ఇండియన్ చీఫ్టైన్ ఎలైట్ స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిల్‍‌ను ప్రపంచవ్యాప్తంగా కేవలం 120 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపధికన ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ స్పెషల్ ఎడిషన్ దక్కుతుంది. మొత్తం 120 యూనిట్లు అమ్ముడైపోయిన తర్వాత కంపెనీ ఈ వేరియంట్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది.

2021 ఇండియన్ ఛీఫ్టైన్ ఎలైట్ విడుదల; కేవలం 120 యూనిట్లు మాత్రమే..

స్టాండర్డ్ ఇండియన్ చీఫ్టైన్‌తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ ఇండియన్ చీఫ్టైన్ ఎలైట్ మోడల్‌లో ప్రత్యేకమైన ఫీచర్లు లభిస్తాయి. ఇందులో కొత్త ఎల్‌ఈడీ ఎలైట్ పూర్తి-ఎల్‌ఈడీ లైటింగ్, పవర్-ఆపరేటెడ్ టింటెడ్ విండ్‌స్క్రీన్, విశాలమైన అల్యూమినియం ఫ్లోర్‌బోర్డులు మరియు 400 వాట్ ఇంటిగ్రేటెడ్ పవర్‌బ్యాండ్ ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

2021 ఇండియన్ ఛీఫ్టైన్ ఎలైట్ విడుదల; కేవలం 120 యూనిట్లు మాత్రమే..

ఇంకా ఇందులో ఇండియన్ మోటార్‌సైకిల్ యొక్క 7-ఇన్ రైడ్ కమాండ్స్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో రైడర్ హ్యాండ్స్ ఫ్రీగా మ్యూజిక్, నావిగేషన్ వంటి పలు ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు మరియు మోటార్‌సైకిల్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

2021 ఇండియన్ ఛీఫ్టైన్ ఎలైట్ విడుదల; కేవలం 120 యూనిట్లు మాత్రమే..

కొత్త 2021 ఇండియన్ చీఫ్టైన్ ఎలైట్ కొత్త పెయింట్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కార్బన్ క్రిస్టల్ పెయింట్‌పై ప్రీమియం టూ-టోన్ థండర్ బ్లాక్ వివిడ్ క్రిస్టల్ పెయింట్ స్కీమ్ ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్‌లోని ప్రతి మోడల్‌ను కూడా పూర్తిగా చేతులతో పెయింట్ చేస్తారని, ఇలా ఒక్కొక్క బైక్‌ని పెయింట్ చేయటానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది.

2021 ఇండియన్ ఛీఫ్టైన్ ఎలైట్ విడుదల; కేవలం 120 యూనిట్లు మాత్రమే..

ఇక ఈ మోటార్‌సైకిల్‌లోని ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో శక్తివంతమైన 1890సీసీ వి-ట్విన్, ఎయిర్-కూల్డ్, థండర్‌స్ట్రోక్ 116 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 171 ఎన్ఎమ్ టార్క్‌తో క్లాస్-లీడింగ్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

2021 ఇండియన్ ఛీఫ్టైన్ ఎలైట్ విడుదల; కేవలం 120 యూనిట్లు మాత్రమే..

రైడర్ తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు గాను ఇందులో రియర్ సిలిండర్ డియాక్టివేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో టూర్, స్టాండర్డ్ మరియు స్పోర్ట్ అనే మూడు రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి.

2021 ఇండియన్ ఛీఫ్టైన్ ఎలైట్ విడుదల; కేవలం 120 యూనిట్లు మాత్రమే..

రెగ్యులర్ చీఫ్టైన్ మాదిరిగానే ఈ కొత్త 2021 ఇండియన్ చీఫ్టైన్ ఎలైట్ లిమిటెడ్ ఎడిషన్ కూడా ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), కీలెస్ స్టార్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ మరియు వెదర్ ప్రూఫ్ మరియు రిమోట్-లాకింగ్ సాడిల్‌బ్యాగ్స్ వంటి స్టాండర్డ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 10, 2021, 12:30 [IST]
English summary
Indian Motorcycles Launches New 2021 Chieftain Elite; Only 120 Units Available Worldwide. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+